గురివింద కళ్లు, చిగురుటాకుల చేతివేళ్ళు... చెప్పవా! కావ్యాలు. సుతారంగా, సున్నితంగా చీకటిని పక్కకి చెరుపుతూ చంద్రోదయం అయ్యే సమయమది. చంద్రుని నుండి కొన్ని నూలు దారాలు... కలబోసుకుని, పెనవేసుకున్నాయి. నేల మీది కన్నె పిల్లల నడుము చుట్టుకుని వెన్నెల్లో... ఊయలోపుతున్నాయి. తళతలలాడే తారలు తనువుపై పడి తలుక్కుమన్నాయి. తారల తళుకులో? లేక నక్షత్ర బామలో ఈ యువతులు. కువకువలు, పక్షుల కిలకిలలు నవసరమా వెన్నెల వేళలు.
మంచిమొగుడు కోసం కన్నెపిల్లల కలవరింతలు, బుగ్గ సిగ్గులు, గోరింట ఎరుపులు, మసక రాతిరి కబురులు, మంచమల్లే కథలు. పిడికెడు నడుము చుట్టూ పీతాంబరాలు, మోకాళ్ళు దాటి జడ కుచ్చులు, నుదుటన కుంకుమ సొబగులు, బృందావనమే చూడబోతే... కృష్ణుడొక్కడే కొదవిక్కడ. గోవిందుని కోసం గోప బామలు గోవర్దనమును చుట్టినట్టు, చేతులు పట్టుకు ఆడేరు.
అటుపోయే, ఇటుపోయే పురుష పుంగవుల గుండెలకు, ఈ కన్నెపిల్లల నవ్వులే దోపిడీ దొంగలు. మావి చిగురు ఎరుపులా బుగ్గన సిగ్గుల కెంపులు, ఎంత దూరమైనా ప్రకాశించి మనసు కొళ్లగొట్టును. పరికిణీల పరుగులు, మూతి మురుపులు, పొగరు చూపులు, నయగారపు నడుము కులుకులు, చిలిపి చూపుల కంటి విరుపులు, కనుబొమ్మల వెక్కిరింతలు, పాలదారలా పంటి మెరుపులు, అతి సున్నితంగా ఆ అడుగుల జాడలు. నేల కందక ఇసుక రేణువులు, కాలి గజ్జలను ముద్దులాడును.
అందమైన అతివలైనా, అమృతమిచ్చే అమ్మలైనా, నాన్న ఒడిలో చిన్ని కూనలైనా, కూనిరాగాల కన్నెలైనా... పురుషుని చుట్టూ అల్లుకునే పుత్తడి తీగలే!. ప్రేమ పరిమళాలను వయసు నిడివిలో ఒక్కొలాగా వెదజల్లే వారే. ఎందుకంత అలుసో ఆడదాని ప్రేమ? కాసులిచ్చి మరీ వస్తుంది కనుకా? లేక కాపురమున్నాల్లు కాలి కిందే పడుంటుంది కనుక. కడదాకా... కన్నీళ్ళతోనే కరిగిపోతుందా! ఈ ప్రేమ కానుక.
Thank you 🙏,
Bhagyamati ✍️.
Super
రిప్లయితొలగించండిThank you
తొలగించండి👌👌💐💐💐
రిప్లయితొలగించండిThank you
తొలగించండిNice 🙂
రిప్లయితొలగించండిThank you dear💕
తొలగించండి