ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

నా కలల సహచరుడు

 మిరుమిట్లు గొలిపే ఓ స్వప్నం, బంగారు రథం పై వచ్చే నా రాజాధిరాజు, రాత్రి పరిమళ దినాలలో అరణ్య మార్గాల వెంట వస్తున్నాడు, నిరంతరం వస్తూనే ఉన్నాడు. విప్పారిన కనులతో నేను రెప్ప వేయలేదు. అమాంతం నా ముందే వచ్చి ఆగిన రథం. జ్వాల వలే మెరిసే అతని కన్నులు, తీక్షణమైన చూపులు, మెడలో సుగందాల రోజా మాల, పన్నీరు జల్లినట్టు దేహ పరిమళం. శక్తి పూర్ణమైన శరీరం, అలా వచ్చి రోజూ కలలో ఇలా వెళ్ళేవాడు. ఎవరీ రాకుమారుడు, నిజం కాదని అతని రాకను ఎలా నమ్మను. వచ్చిన వాని జాడలు ఇక్కడే మిగిలి ఉన్నాయి. రాలిపోయిన రోజా పులరేకులు దోసిలిలో పట్టుకుని చూస్తున్నాను. నా ప్రియుని రాక నిజమని తెలుపుటకు ఇవే ప్రేమ పూర్వక సాక్షాలు.


తెల్లవారక ముందే లేచి ఉదయ విహంగమై అలా ఒకసారి గాలిలో ఎగురుతుంటాను. ఆ పూల సుగంధాలు, పన్నీటి గాలులు నాపై జల్లిన వానికోసం మరల మరలా... కలగంటాను. మధురమైన స్వప్నం మరల వచ్చింది. మనుజుడేనా వీడు? దేహమంతా... దైవ కణములు నింపుకున్న పురుష పుంగవుడా? కలలో కానుకగా... నా కరములు అడిగాడు, నన్నా నువ్వు అడిగేది? అనేలోగా పరిహాసంగా నవ్వి మాయమయ్యాడు. అతనిని ప్రేయాబిక్షిత్తున్ని చేయగల అవకాశమే రాకున్నది. ఇతనిని హృదయంలో బరిస్తూ... హత్తుకోడానికి వీలు లేక చతికలబడుతూ ఇలా ఎంతకాలం? 


నాకిక ఈ నిరీక్షణలు, విలాపాలు ఎందుకు? ఈ మన్మధుని ప్రేమ సల్లాపాలలో మనసుని కుదుటపరచాలి. మౌనంలో ముగ్ధ మనోహర దృశ్యాలు లోలోనే పడే వ్యదలు, ప్రేమ రాయబారం పంపలేని పాట్లు, అగచాట్లు ఇక చాలు. నిరూపమానమైన తేజస్సుతో, నక్షత్ర కాంతులతో వెలిగిపోతున్న నీ కన్నులు నన్ను కట్టిపడేశాయని, నీ కలవరము వెనక నా హృదయము విరహ జ్వాలలో దగ్ధ మవుతోందని, వెల్లడించి తనని ఆశ్రయించాలి.


రానే వచ్చింది ఈ రాతిరి స్వప్నం. నా రాకుమారుడి అందాల రూపం. నిజంగా అయితే ఇది చిమ్మ చీకటి, నడి రాతిరి, ఓ పెద్ద జడివాన. విశాలమైన రెక్కల లాగా మెరుపులు మెరుస్తున్నాయి, ఆకాశంలో... తన వీపు వెనకే!. తన చెవిలో నా పేరు చెప్పి, మౌనంగా, దూరంగా నిలుచుండిపోయాను. ఈ వాన శబ్ధం ముసుగేసింది నా మాటలకు. నా చమత్కారమంతా... రాతలలోనే, చేతలలో కాదు. తనపై పడ్డ నా చూపుల దిగులైనా చూడలేదు అతడు, ఆ చిమ్మ చీకటి తన కనులు కప్పింది. విన్నట్టే ఉంది తన అడుగుల చప్పుడు. సెలవైనా అడగలేదు నన్నతడు. ఏటవాలుగా పడ్డ చెట్టు నీడలో ఏకాంత గా నిలబడి ఉన్నాను. ఉన్న చోటునే మాయమయ్యాడు. దోసిట్లో కొన్ని పూల రేకులు మిగిలాయి. ఉన్నపళంగా కలలోంచి ఉలిక్కిపడి లేచాను.

Thank you ☺️,

Bhagyamati ✍️.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నా మొదటి ప్రేమ... మా నాన్న!

  ఒక అమ్మాయి ఏ వయసులో అయినా ఉండొచ్చు కానీ ఆమె ఎప్పటికీ తన తండ్రికి చిన్ని యువరాణిగానే ఉంటుంది.  తండ్రీ కూతుళ్ల మధ్య ఉన్న ఈ ప్రత్యేక బంధం... ఆరాధ్య బంధం!.  ఒక తండ్రి తన కూతురిపై ఉంచే హద్దులు లేని ప్రేమ ఎప్పటికీ తిరిగి చెల్లించలేనిది.   బెస్ట్ ఫ్రండ్ తో షాపింగ్:  నేను రత్నం జూనియర్ కాలేజి లో చదివేటప్పుడు కాలేజి వ్యాన్, ఇల్లు తప్ప ఏం తెలియదు. డిగ్రీ కి వచ్చాక న బెస్ట్ ఫ్రెండ్ శ్వేత తో మొదటిసారి బయటకి వెళ్ళాను. ఫస్ట్ టైం వెళ్ళడం, నాన్నకి trunk road లో కనిపించాను. నా మైండ్ బ్లోక్ అయ్యి రెడ్ అయ్యి, బ్లూ అయ్యింది. మా నాన్న మాత్రం సింపుల్ గా షాపింగ్ కి వచ్చావా? డబ్బులు ఉన్నాయా? అంటూ 2000 ఇచ్చేసి వెళ్ళాడు. నాన్న అంటే అంతే మరి, నెక్స్ట్ లెవెల్.  నేను పెద్ద చిరంజీవి అభిమాని ని. నాన్న ఫస్ట్ డే ఫస్ట్ షో చిరంజీవి మూవీ కి తీసుకుని వెళ్తాడు. నేను తిరుపతి లో M.SC చేసేప్పుడు నాకోసం dairy milk బాక్స్లు కొరియర్ చేసేవాడు. చిరంజవి గ్రీటింగ్స్ పంపేవాడు. నాన్నకి నేను ఎప్పటికీ చిన్న పిల్లనే. నేను అబద్ధాలు చెప్పను. ఇప్పటికీ చెప్పను. అందుకే నన్ను మా అమ్మ, నాన్న బాగా నమ్ముతారు. నా ప్రాణ స్నేహితుడు నాన్న: చిన్నపుడ

ఇప్పటికి మేల్కున్నావా స్వామి?!

 తడిసి నీళ్ళోడుతున్న చీర కొంగును పిండుకుంటూ... అల్లంత దూరాన ఉన్న అతనిని చూసాను. కడవ నడుముకెత్తి తిరిగి మళ్ళీ మళ్ళీ చూసాను. ఎదుట ఏటుగట్టు వెనకనుంచి చుమ్మలు చుట్టుకుంటూ... తెల్లని పొగతెరలు, చెట్ల ముసుగులు దాటి వచ్చాను.  మామిడి చెట్టు ఆకుల గుబురుల్లోంచి, సన్నగా పడుతున్న నులి వెచ్చని సూర్యకిరణాలు.... మడత మంచంపై మాగన్నుగా పడుకుని ఉన్న నా మన్మధుడు. ఓయ్... అని కేక వేయాలనుంది, వాలుగాలిలో మాట కొట్టుకుని పోదా అని ఆగిపోయాను. తడక మీద ఆరవేసిన తుండువా లాగి దులుపుదామనుకున్నాను. గడుసుదనుకుంటాడని గమ్మునుండి పోయాను. పొగమంచు మేఘాల మధ్య చాచుకునే ఉంది. పసిడి పువ్వులు నా పిరికితనం చూసి నవ్వుకుంటున్నాయి. చెట్టు కొమ్మన కౌగిలించుకున్న రామచిలుకలు నీ మాటేమిటి? అని ఆరా తీశాయి.  సరే! నడుము మీద కడవ నిలవకుంది, అతనితో గొడవ పడమంది. నెత్తిన కుమ్మరిస్తే మేలుకొంటాడుగా?! అమ్మో కయ్యాలవాడు మాటలే కట్టేస్తాడు. వద్దులే రేగిపోయిన జుట్టును ముడి వేసుకుంటూ పక్కనే ఓ పూచిక పుల్ల కోసం వెతికాను. ఈ పడుచు వాడి కలలో ఏమొస్తుందో... నిద్రలోనే నవ్వాడు. చక్కనోడు చెంప మీద చంద్రవంకలు పూచాయి. మర్రి చెట్టు కాయలు ముసిముసిగా నవ్వుతూ... పుల్ల ఒకటి వ

ఇది యుగాలనాటి ప్రేమ!.

 రాధంటే... ఉత్తదేహం కాదు, ఉత్త మనసే కాదు, రాధంటే ఆత్మ. కృష్ణుని ప్రేమలో లీనమైన ఆత్మ. ప్రపంచానికి అర్థం కాని ఎన్నో విషయాలలో వీరి ఇరువురి ప్రేమ కూడా ఒకటి. వీరి శృంగారం మానసికమే! కానీ ఆత్మసంబంధం. ఏ ప్రేమ కథకైనా వీరే ఆదర్శం. ప్రేమ యొక్క గొప్పతనం పట్టాలంటే... కథలో చిత్రించే పాత్రలను రాధాకృష్ణలను ఊహించే రాయాలి. కృష్ణుని పై ఆశలు రేకెత్తించుకొని మనసును కృంగ దీసుకున్న రాధ ప్రేమ లోంచి విరహం అనే పదం పుట్టుకొచ్చిందేమో?! ప్రేమంటే మనసంతా కాముఖత్వం పులుముకోవడం కాదు, దేహవసరాలను తీర్చుకోవడం కాదు, ప్రేమంటే విశాలత్వం, దైవత్వం, విరహం, తపన, వేదన, ఎడబాటు, త్యాగం, కృష్ణుని రూపు కోసం పరితపించే రాధ దినచర్య. అందుకే రాధాకృష్ణుల ప్రేమ ఉత్త ప్రబంధ కథగా కాకుండా... యుగాలు చెప్పుకునే గొప్ప ప్రేమగాధ గా మిగిలింది. ఒక ప్రేమ కథను పైకెత్తి ఆకాశంలో ప్రవేశపెట్టాలన్నా... ఒక ప్రేమ గీతాన్ని, స్వర్గాన్ని తాకేంత ఆనందంగా ఆలాపించాలన్నా... రాధాకృష్ణుల ప్రేమే ప్రేరణ. ఇంత గొప్పగా మనం ప్రేమించాలంటే రోజు మనసుకి మెదడుకి మధ్య దేవాసుర యుద్ధమే జరుగుతుంది, అయినా నిలబడితేనే ప్రేమ గెలుస్తుంది. ఇక్కడ గెలవడం అంటే ఇద్దరు పెళ్లి చేసుకొని జీవించటం