ఆకాశం అంచులు తిరిగి, నా ఆరాధనకు హద్దులు వెతకాను. పుష్పక విమానంలో వచ్చి, పంకజ నేత్రుని కనులతో... ఎత్తుకెళ్ళాలని చూశాను. నీలి మబ్బుల్లో ఎర్ర మెరుపులొచ్చినట్లు, నా గుండెలో ఈ భక్తి దీపాలేంటని అడగాలి? మహా గొప్ప మాటలన్నీ మూట కట్టి తెచ్చి, ఆయన కాలికింద ఉంచి, అంత హక్కేంటి నీకు? నా సర్వము నీవయ్యావని, అడగాలను కున్నాను. చిత్తము నందు నీవెవరు? నా చిద్విలాసమందు నీవెవరు? చివరివరకు నాకు నీవెవరు? అని అడగాలనుకున్నాను. హృదయ భారమోపలేక పరుగులీడి వచ్చాను.
చుక్కలని అడిగాను నీ జాడ, చెప్పమన్నాయి. పాల పుంతని అడిగితే... పాల సముద్రం వెళ్ళాడన్నాయి. క్షీర సాగరాన్ని అడిగితే... క్షీరసాగరమథనం అయిపోయింది, హాయిగా... లక్ష్మి తో వెళ్ళిపోయాడంది. విష్ణు దేవేరి కోసం విశ్వమంతా వెతికాను, నా విష్ణువేడని? భూలోకమందు కృష్ణుడయ్యాడంది. ఏం చేయను? నా గుండె సేద్యం చేసి వేదన మిగిల్చినవాని పట్టుకుందామని, భువికి బయలుదేరాను. ఇంతలో నారదుడు, నారాయణ మంత్రోపాసనలో మునిగితేలుతూ... ఎదురు పడ్డాడు. అవ్యక్తబావతరంగాలు మా ఇద్దరిలోనూ, ఒకే విష్ణు దేవుని కోసం వెతుకులాడుతూ... ఆయన ప్రసన్నానుగ్రహాల కోసం పరితపించే వారము. ఇరువురమి బయలుదేరాము.
బ్రహ్మమానస పుత్రుడు, త్రిలోక సంచారుడు ఈ నారదుడు, మరి నేనేమో ముక్తికోసం పాకులాడే పరమ విష్ణు భక్తురాలిని. నారదుని వీణ "మహతి" పాడింది, విష్ణు అష్టోత్తరం, నా కొద్ది చతురతతో నే చెప్పుకొచ్చాను... కృష్ణ వశమైన నా చిత్తము. కృష్ణ జన్మభూమి వచ్చాము, మధుర దాటించానన్నాడు వసుదేవుడు. సరేపో... సర్ధుకున్నామిక!. కంసుని కనులు గప్పి కాలికి బుద్ధి చెప్పాము. విష్ణు భక్తులకి తప్పదీ వెతుకులాట. వేదములలో దొరికెటి వాడు కాదుకదా ఈ మాధవుడు, కటినమైన శోధనలో... మాత్రమే దొరుకును.
అందుగలడు, ఇందుగలడు, ఎందైనా కలడీ స్వామి! కానీ కోరినంతనే దొరకడు, కోవెల దీపపు కనులవాడు. గుండెని గుడి చేసి వెతికాను. అదిగో బృందావనము, నంద నందనుడు ఆడి దోగాడిన స్థలము. అమ్మ యశోదమ్మది ఎంతటి పుణ్యము? అంతెత్తు విష్ణురూపుని పసిబాలుని చేసి, చెంగు చాటు కడుపు నింపెటి భాగ్యము. విశ్వమంతటి వానిని చిన్న బాలుడిగ చూశాను. తన సొగసు వేళ్ళ మధ్య పిల్లనగ్రోవి పెట్టాను. నా మనసులోని మాటలన్నీ ఈ చిన్నవానికి ఏమని చెప్పను? అతని కనులు గాంచును, కరుణ జూపును, చాలది. జన్మకు!
హరే కృష్ణ 🙇🏻♀️,
Thank you 🙏,
Bhagyamati ✍️.
👌👌🎈🎈💐💐
రిప్లయితొలగించండిThank you
తొలగించండి👌👏👏
రిప్లయితొలగించండిThank you
తొలగించండి👌👌👌👏👏🫡🫡
రిప్లయితొలగించండి