ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

నా మొదటి ప్రేమ... మా నాన్న!

 ఒక అమ్మాయి ఏ వయసులో అయినా ఉండొచ్చు కానీ ఆమె ఎప్పటికీ తన తండ్రికి చిన్ని యువరాణిగానే ఉంటుంది. తండ్రీ కూతుళ్ల మధ్య ఉన్న ఈ ప్రత్యేక బంధం... ఆరాధ్య బంధం!. ఒక తండ్రి తన కూతురిపై ఉంచే హద్దులు లేని ప్రేమ ఎప్పటికీ తిరిగి చెల్లించలేనిది. 



బెస్ట్ ఫ్రండ్ తో షాపింగ్:

 నేను రత్నం జూనియర్ కాలేజి లో చదివేటప్పుడు కాలేజి వ్యాన్, ఇల్లు తప్ప ఏం తెలియదు. డిగ్రీ కి వచ్చాక న బెస్ట్ ఫ్రెండ్ శ్వేత తో మొదటిసారి బయటకి వెళ్ళాను. ఫస్ట్ టైం వెళ్ళడం, నాన్నకి trunk road లో కనిపించాను.నా మైండ్ బ్లోక్ అయ్యి రెడ్ అయ్యి, బ్లూ అయ్యింది. మా నాన్న మాత్రం సింపుల్ గా షాపింగ్ కి వచ్చావా? డబ్బులు ఉన్నాయా? అంటూ 2000 ఇచ్చేసి వెళ్ళాడు. నాన్న అంటే అంతే మరి, నెక్స్ట్ లెవెల్. 

నేను పెద్ద చిరంజీవి అభిమాని ని. నాన్న ఫస్ట్ డే ఫస్ట్ షో చిరంజీవి మూవీ కి తీసుకుని వెళ్తాడు. నేను తిరుపతి లో M.SC చేసేప్పుడు నాకోసం dairy milk బాక్స్లు కొరియర్ చేసేవాడు. చిరంజవి గ్రీటింగ్స్ పంపేవాడు. నాన్నకి నేను ఎప్పటికీ చిన్న పిల్లనే.



నేను అబద్ధాలు చెప్పను. ఇప్పటికీ చెప్పను. అందుకే నన్ను మా అమ్మ, నాన్న బాగా నమ్ముతారు.

నా ప్రాణ స్నేహితుడు నాన్న:

చిన్నపుడు ప్రతి ఆదివారం నాన్న, నేను మధ్యాహ్నం గాంధీ పార్క్ లో ఆడుకోవడం, బాబు ఐస్క్రీమ్ లో ఐస్క్రీమ్ తినడం, సినిమా కి వెళ్ళిపోతాం. అప్పట్లో ప్రతి ఆదివారం మాకోసం కొత్త సినిమా ఉండేది కాదు. చూసిన సినిమాలే చూసే వాళ్ళం. నాకు హైస్కూల్ లో ఉన్నపుడు సైకిల్ కావాలని అడగగానే ఇప్పటిదాకా నువ్వు చూడని సైకిల్ తెచ్చిస్తాను అని lady Bird సైకిల్ తెచ్చాడు. అప్పట్లో నెల్లూరు లో మనమే ఫస్ట్ ఆ సైకిల్ లో తిరిగింది. 



నాకొక పవర్ ఉంది, నేను కల కన్నది, ఇంటికి వచ్చేస్తుంది. అది మా నాన్న తీసుకుని వచ్చేస్తాడు. నేను నాన్నకి చెప్పను, కానీ నాన్న మనసుకు తెలుస్తుంది. అనిల్ కి, చారుమతి కి ఈ  విషయం అర్ధం కాదు, ఇది మానసిక ప్రసారము. మేమిద్దరం ఒకే ఆత్మ తో కనెక్ట్ అయి ఉన్నాము. ఈ ప్రసారము హైదరాబాద్ వరకు సిగ్నల్స్ ఇవ్వలేక పోయింది. అందుకే నాన్న కోసం హైదరాబాద్ లో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ లో జాబ్ వదిలేసి వచ్చేసాను. నెల్లూరు లో పంచాయతీ సెక్రెటరీ గా ఉండి పోయాను. అక్కడ నెలకు లక్ష వచ్చిన ఇక్కడ నాన్న తో సమానం కాదు.

కోరే లోపు కోరుకున్నది ముందుకు వస్తుంటే ఇక కోరికలు ఎందుకు ఉంటాయి? నాది సంతృప్తికరమైన జీవితం. ఇక చాలు ఏమి వద్దు అనుకునేంత హ్యాపీ గా ఉన్నాను.

నాన్న...నువ్వే నా ప్రాణం,

నాన్న... నువ్వే నా లోకం,

నీతోనే నేనుంటాను,

నువ్వు లేని రోజు ఇక ఉండబోను.


కూతురికి మొదటి ప్రేమ ఆమె నాన్న:

నాన్న మరియు కుమార్తె మధ్య ప్రేమ విడదీయరానిది. నాన్న, నా జీవిత మార్గదర్శకుడు, స్నేహితుడు, సంరక్షకుడు, నా హీరో. ప్రపంచానికి మీరు ఒక తండ్రి. నాకు మాత్రం మీరే ప్రపంచం. 

ఒక తండ్రిగా ఆయన నన్ను, నేను నమ్మిన దానికంటే ధైర్యవంతురాలిగా, నేను అనుకున్నదానికంటే తెలివైనదానిగా, నాకు నన్ను కొత్తగా... గొప్పగా పరిచయం చేస్తుంటారు. నా లైఫ్ లో చిన్న విజయాన్ని నాన్న పెద్దగా సెలబ్రేట్ చేస్తాడు. అప్పుడు నాన్న కళ్ళు చూసి ఒకే! ఇది చాలా పెద్ద దేమో అనుకుంటాను. ఇప్పటికీ నాకు కోపం, బాధ, అసూయ రావు. నాన్న, ప్రేమ, సంతోషం... ఇవి మాత్రమే ఉంటాయి నా లైఫ్ లో. నాకిష్టమైన వాళ్ళు నన్ను దూరం చేస్తునప్పుడు వెంటనే నా బ్రైన్ switch off అవుద్ది. ఆ... తొక్కలే! నాకు మా నాన్న ఉన్నాడు అనుకుంటాను. 

అనిల్ ని ప్రేమించడం - నాన్న ను ఒప్పించడం:

నేను నా కూతుర్ని ప్రపంచం కోసం మార్చుకోను, కానీ నా కూతురు కోసం ప్రపంచాన్ని మార్చాలని నేను కోరుకుంటున్నాను:

నేను అనిల్ ని ప్రేమించి, హైదరాబాద్ లో... అనిల్ ని తీసుకుని వచ్చి నాన్నకు ఇలా పరిచయం చేశాను. నాన్న, చిన్నపుడు నీ చేయి పట్టుకుని నడిచేటప్పుడు ఎంత సేఫ్ గా ఫీల్ అయ్యానో... ఇప్పుడు అనిల్ తో అలా ఫీల్ అవుతున్నాను అని. నాన్న మౌనంగా నవ్వాడు, అది నాకు అంగీకారం. ఈ కులాంతర మతాంతర వివాహం లోకం కోసం బంధువుల కోసం కాదు, నా కూతురి కోసం అన్నాడు. ఆమె ఇష్టమే నా ఇష్టం అన్నాడు. నాన్న నాలానే ఏది ఏమైనా సరే దృఢంగా నిలబడుతాడు. అంటే! నేనే ఆయన లాగా అనుకోండి.

మా లవ్ స్టోరీ వెనక ఉన్నాడు నాహీరో. 

ఒక మగాడు భార్యకి, సమాజానికి ఆదర్శవంతమైన వ్యక్తి కావొచ్చు, కాకపోవచ్చు, తన కూతురికి మాత్రం అంత ఎత్తులో ఆకాశం లో కనిపిస్తుంటాడు. ఎంత గొప్ప వాళ్ల గురించి విన్నా... అబ్బా! మా నాన్న కంటే కాదులే అనుకుంటాం. చిన్నపుడు ఇది బయటకు చెప్పేసేవాళ్ళం, ఇప్పుడైతే లోపలే అనుకుంటాం. ఇంకేం మారలేదు.

ఫాదర్స్ డే అని నాన్న కి ఒక రోజు ఇస్తుంటాం. మనం బ్రతుకున్న రోజులన్నీ ఆయన ఇచ్చినవే. నాలాగా ప్రేమ ని చెప్పలేని వాళ్ళు, ఆరోజైన చెబుతారు అని ఆ రోజు కానుకలతో సెలబ్రేట్ చేసుకుంటున్నాం అంతే!

Thank you 🙏

✍️Bhagyamati.



కామెంట్‌లు

  1. Sreegremeva manovaanchaa pala siddhirasthu

    రిప్లయితొలగించండి
  2. ఒక కూతురు/కొడుకుగా అమ్మానాన్నలకు ఎంత చేసినా తక్కువే...

    రిప్లయితొలగించండి
  3. there is no father without a daughter but your article photo lacks such a daughters face.whats your reply for it?

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఇప్పటికి మేల్కున్నావా స్వామి?!

 తడిసి నీళ్ళోడుతున్న చీర కొంగును పిండుకుంటూ... అల్లంత దూరాన ఉన్న అతనిని చూసాను. కడవ నడుముకెత్తి తిరిగి మళ్ళీ మళ్ళీ చూసాను. ఎదుట ఏటుగట్టు వెనకనుంచి చుమ్మలు చుట్టుకుంటూ... తెల్లని పొగతెరలు, చెట్ల ముసుగులు దాటి వచ్చాను.  మామిడి చెట్టు ఆకుల గుబురుల్లోంచి, సన్నగా పడుతున్న నులి వెచ్చని సూర్యకిరణాలు.... మడత మంచంపై మాగన్నుగా పడుకుని ఉన్న నా మన్మధుడు. ఓయ్... అని కేక వేయాలనుంది, వాలుగాలిలో మాట కొట్టుకుని పోదా అని ఆగిపోయాను. తడక మీద ఆరవేసిన తుండువా లాగి దులుపుదామనుకున్నాను. గడుసుదనుకుంటాడని గమ్మునుండి పోయాను. పొగమంచు మేఘాల మధ్య చాచుకునే ఉంది. పసిడి పువ్వులు నా పిరికితనం చూసి నవ్వుకుంటున్నాయి. చెట్టు కొమ్మన కౌగిలించుకున్న రామచిలుకలు నీ మాటేమిటి? అని ఆరా తీశాయి.  సరే! నడుము మీద కడవ నిలవకుంది, అతనితో గొడవ పడమంది. నెత్తిన కుమ్మరిస్తే మేలుకొంటాడుగా?! అమ్మో కయ్యాలవాడు మాటలే కట్టేస్తాడు. వద్దులే రేగిపోయిన జుట్టును ముడి వేసుకుంటూ పక్కనే ఓ పూచిక పుల్ల కోసం వెతికాను. ఈ పడుచు వాడి కలలో ఏమొస్తుందో... నిద్రలోనే నవ్వాడు. చక్కనోడు చెంప మీద చంద్రవంకలు పూచాయి. మర్రి చెట్టు కాయలు ముసిముసిగా నవ్వుతూ... పుల్ల ఒకటి వ

ఇది యుగాలనాటి ప్రేమ!.

 రాధంటే... ఉత్తదేహం కాదు, ఉత్త మనసే కాదు, రాధంటే ఆత్మ. కృష్ణుని ప్రేమలో లీనమైన ఆత్మ. ప్రపంచానికి అర్థం కాని ఎన్నో విషయాలలో వీరి ఇరువురి ప్రేమ కూడా ఒకటి. వీరి శృంగారం మానసికమే! కానీ ఆత్మసంబంధం. ఏ ప్రేమ కథకైనా వీరే ఆదర్శం. ప్రేమ యొక్క గొప్పతనం పట్టాలంటే... కథలో చిత్రించే పాత్రలను రాధాకృష్ణలను ఊహించే రాయాలి. కృష్ణుని పై ఆశలు రేకెత్తించుకొని మనసును కృంగ దీసుకున్న రాధ ప్రేమ లోంచి విరహం అనే పదం పుట్టుకొచ్చిందేమో?! ప్రేమంటే మనసంతా కాముఖత్వం పులుముకోవడం కాదు, దేహవసరాలను తీర్చుకోవడం కాదు, ప్రేమంటే విశాలత్వం, దైవత్వం, విరహం, తపన, వేదన, ఎడబాటు, త్యాగం, కృష్ణుని రూపు కోసం పరితపించే రాధ దినచర్య. అందుకే రాధాకృష్ణుల ప్రేమ ఉత్త ప్రబంధ కథగా కాకుండా... యుగాలు చెప్పుకునే గొప్ప ప్రేమగాధ గా మిగిలింది. ఒక ప్రేమ కథను పైకెత్తి ఆకాశంలో ప్రవేశపెట్టాలన్నా... ఒక ప్రేమ గీతాన్ని, స్వర్గాన్ని తాకేంత ఆనందంగా ఆలాపించాలన్నా... రాధాకృష్ణుల ప్రేమే ప్రేరణ. ఇంత గొప్పగా మనం ప్రేమించాలంటే రోజు మనసుకి మెదడుకి మధ్య దేవాసుర యుద్ధమే జరుగుతుంది, అయినా నిలబడితేనే ప్రేమ గెలుస్తుంది. ఇక్కడ గెలవడం అంటే ఇద్దరు పెళ్లి చేసుకొని జీవించటం