ఒకరోజు యమధర్మరాజు హుటాహుటిన తన అకౌంటు పుస్తకాలు అన్ని తీసుకొని ద్వారక బయలుదేరాడట. ఎందుకంటే? కృష్ణునికి తన పుస్తకంలోని నియమ నిబంధనల గురించి వివరించి చెబుదామని. కృష్ణ భగవానునితో ఇలా అన్నాడట పరమాత్ముడైన కృష్ణుడు, నేరాలను క్షమిస్తూ పోతూ ఉంటే, ఇక పాపులెవరు ఉంటారు? నాకు యమపురిలో స్థానం ఎక్కడిది? కనుక ఈ అకౌంట్ పుస్తకాలన్నీ మీ వద్దనే ఉంచండి, ఇందులో ఈ భూమిపై జీవించే అన్ని రకాల జీవరాశుల కర్మలు, కర్మ ఫలాలు రాయబడ్డాయి, ఇది మీతోనే ఉంచండి., అని నిష్టూరంగా అన్నాడట. తన అందమైన చిరునవ్వుతో 'కన్నయ్య'., యమధర్మ రాజా! నీ బాధకు కారణం ఏమిటో చెప్పవయ్యా? అన్నాడట. కృష్ణా! పేదవాడు ఆకలి కోసం తప్పులు చేయాలి, ఆ కర్మ ఫలాలు అనుభవించడానికి చనిపోయాక, మా యమపురికి రావాలి. అటువంటిది భగవంతుడైన నీవు ఈ నియమ నిబంధనలకు విరుద్ధంగా పాపులందరినీ క్షమిస్తూ పోతూ ఉంటే, అందరూ నీ వైకుంఠం పోయే వారే తప్ప నా యమపురికి వచ్చేవారు ఎవరు స్వామి? అన్నాడట!. పేద బ్రాహ్మణుడైన 'సుధామ' కృష్ణుని చిన్ననాటి స్నేహితుడు. కడు పేదరికంతో జీవనం సాగించలేక, తన భార్య సలహా మేరకు ...
Telugu and English writings