మానవ సమాజం పురుషాధిక్య సమాజం కాబట్టి సహజంగానే పురుషులు స్త్రీలపై ఆదిపత్యాన్ని చలాయించడం జరుగుతుంది. చాలా వరకు స్త్రీలను దాదాపుగా వారి ఆస్తిలో భాగంగానే పురుషుడు చూస్తాడు. మహిళలను మానవ శక్తిగా ముందుకు నడిపించాలంటే ముందుగా వారిపై జరిగే దురాగతాలను, సంఘంలో వారి దుస్థితిని గృహంలో జరిగే హింసను, వారి పట్ల జరిగే అన్యాయాలను చర్చించాలి. 1974లో కేంద్ర ప్రభుత్వం నియమించిన 'మహిళల స్థితిపై విచారణ కమిటీ' తన నివేదికలో మహిళలపై అత్యాచారాలు, భార్యను వేధించటం, వరకట్న చావులు, పడుపు వృత్తి... అంశాలను వివరించింది. మహిళలను ప్రధాన ఆర్థిక స్రవంతిలో చేర్చాలంటే... ముందుగా వారికి సమానత్వాన్ని, సాంఘిక న్యాయాన్ని సాధించే మార్గం చూపాలి. రాజ్యాంగంలోని 14వ ప్రకరణ - 'చట్టం ముందు అందరూ సమానమే' అని చెబుతోంది. మరి సమాజంలో అందరూ సమానమేనా? స్త్రీ, పురుషులు సమానమేనా? స్త్రీ పురుష సమానత్వం అంటే వ్యక్తిత్వ...
Telugu and English writings