ఆడదాని మనసు అగాధమంత లోతు... ఆమె మనసులో ఏముందో? ఎవరికి తెలుసు! సెలయేటి నడకల్లే ... ఆమె ఒళ్ళు, కొంగార బట్టేను, పొంగేటి అలలు. తంగేడు మొగ్గల్లే... బంగారు భరిణల్లే... సింగారి నడుము, వొంగేను విళ్ళల్లే... కొండ చివరన కురిసిన వానలా... వెండి మబ్బును చీల్చిన మెరుపులా... చంద్రుడేదో...అరచేత చిక్కినట్టు, అందమైన ఆమె మోము!. పరితపించేను, ప్రేమ కోసం... పడతి సీత, రాముని కోసం!. పరుగు పెట్టగా... దారి తెలియదు. పట్టుబడ్డ కోట తప్ప. ఎవరికి తెలుసు? ఆమె మనసు!. నిండైన నదిలా... కన్నీటి కుండలు, నిప్పుల కొలిమిలో... నివురుగప్పిన గుండెలు. కనురెప్ప చాటులో కౌగిలింతల కలలు... కనుపాపపై కన్నీటి పొరలు. ఎవరికి తెలుసు? ఆమె మనసు!. ఇందులో నాకు చాలా నచ్చిన పాట:- నా చెలి రోజవే.... నా చెలి రోజావే నాలో ఉన్నావే.. నిన్నే తలిచేనే నేనే.. నా చెలి రోజావే నాలో ఉన్నావే.. నిన్నే తలిచేనే నేనే.. కళ్ళల్లో నీవే కన్నీట నీవే.. కనుమూస్తే నీవే ఎదలో నిండేవే.. కనిపించవో అందించవో తోడు.. నా చెలి రోజావే నాలో ఉన్నావే.. నిన్నే తలిచేనే నేనే... గాలి నన్ను తాకినా నిన్ను తాకు జ్ఞాపకం.. గులాబీలు పూసినా చిలిపి నవ్వు జ్ఞాపకం.. అలలు పొంగి పారితే చెలియ పలుకు జ్ఞాపక...
Telugu and English writings