ముందు జనమలో నువ్వు - నేను అంటావు. ముందరకొస్తే... ముసిముసిగా నవ్వుతావు. ఇన్ని మాటలన్నీ ఏడికెళ్లి తెచ్చావు? ఎన్ని ఇన్నా చెబుతూనే... ఉంటావు. రొంత రొంత ప్రేమనిచ్చి చెంత కొస్తావు. గంతులేసే నా మనసుకు కళ్ళమేస్తావు. అంత దూరమున శందురిడిలా ఎన్నెలై పూస్తావు. ఇంతలోనే సూరీడల్లే నిప్పులు గక్కుతావు. ఎన్నెన్ని కథలు పడతావు? ఎన్నెల పురుషుడా! నిన్ను గన్న నీయమ్మ ఎవరు రా? సుందరవదనుడా! నిన్ను సూసి సూసి సూపింక పోయేను. మాటలాడక గొంతు వంతెన కట్టేను. చెయ్యి ఇంకా ఇయ్యవయ్యా! చెలగాట లెందుకు! కసిరి ఇసిరినా నీ దానినయ్యా! మోమాట మెందుకు! నీ చేయి పట్టే ఏల సలువ రాతి నౌతాను. నువ్వు సెక్కితే జక్కనలా... శిల్పమవుతాను. నొక్కు నొక్కు లో నీ పేరే రాసుకుంటా... ఒక్కదాన్నే నీ పాటే పాడుకుంటా... శిలగా నేను ఎల్లకాలముంటా! కదిలెల్లే నిన్ను కనులారా... కౌగిలించుకుంటా! మట్టిలోన నువ్వు కలిసి పోతే... మళ్ళీ మళ్ళీ పుడుతుంటే.... మొత్తమంతా చూస్తు ఉంటా... నీ ఎదుగు బొదుగులో సాక్ష్యమవుతా! ఒకనాటిది కాదిది బంధం, వరుస జన్మల వృత్తాంతం. నా యనకే నువ్వు బుట్టినా... నీ యెనకే బడతా... నిన్నే గట్టుకుంటా!. Thank you 😊 ✍️Bhagyamati.
Telugu and English writings