ఏతాము బాయి లోన, నే నిడిసి బెట్టాను!
నూతెనక నిను సూసి నోరెళ్ళ బెట్టాను!
మూతి మీన మీసాలు నిమురుతూ సూసావు,
కొత్త కోక కట్టినానని కవ్విస్తూ సూశావు.
ఓమారు పిలిశావు, ఓరకంట సూశావు.
వయ్యారి రావే... ఊటీకి పోదామన్నావు.
ఏరు తప్ప, ఊరు తప్ప నాకేటి తెలుసు?!
ఊటీకి పోయేటి ఊసులెందుకు లేయ్యా!?
వెన్నెల కాసేటి మేడ సాలు.
కమ్మని ఊసులాడేటి ఏల సాలు.
తీయని నీ మాటల్నే తిప్పితిప్పి ఇంటాను.
ముద్దొచ్చే నీ మోమునే మైమరసి సూస్తాను.
మల్లెమాలను జడను సుట్టి,
మంచి గంధము సేత బట్టి,
ఇంటి ముంగిట కూసుంటే...
మనసుదీర చూస్తావు... మైమరిసిపోతావు.
నీ సూపు సోకంగా... నే తబ్బిబ్బులవ్తాను.
నీ వైపే సూస్తూ... సిగ్గుమొగ్గ లేస్తాను.
నువ్వు వెళ్ళిపోతుంటే... ఉండమని సెప్పలేను.
గుండెలోనె మాటలన్నీ, నొక్కుకుంటూ సూస్తాను!.
ఒకనాటిది కాదిది బంధం,
వరుస జన్మల వృత్తాంతం.
నా యెనకే నువ్వు బుట్టినా...
నీ యెనకే బడతా ...
నిన్నే గట్టుకుంటా...
Thank you 🙏
✍️Bhagyamati.
చాలా బాగుంది ........
రిప్లయితొలగించండిChala baga rasaru
తొలగించండిThank you
రిప్లయితొలగించండి👏👏👏
రిప్లయితొలగించండిThank you
తొలగించండి