🌸 సతీ దేవి🌸
దక్షిమహారాజు, అతని భార్య ప్రసూతి సంతానం కోసం బ్రహ్మ దేవుని సలహా మేరకు, అది పరాశక్తి ని ప్రసన్నం చేసుకునేందుకు, కటోరమైన అడవులలో నిద్రాహారాలు మాని తపస్సు చేస్తారు.
ఆదిపరాశక్తి ప్రత్యక్షమై నేనే మీకు సంతానంగా కలుగుతాను కానీ ఒక షరతు. నాకు అవమానం కలిగితే... నేను తిరిగి వెనక్కి వెళ్ళిపోతాను, ఇక మరల రాను అని చెబుతుంది. అలా సతీదేవి జన్మిస్తుంది.
ఈమె చిన్నప్పటినుంచి శివుడిని ప్రేమించి, పెళ్లి చేసుకోవాలని కోరికతో అడవులకు వెళ్లి తపస్సు చేస్తుంది. శివుడు ఆమె ప్రేమ కు ముగ్ధుడై, వివాహం చేసుకుంటాడు. శివుడిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని దక్షుడు, తన ఇంట్లో హోమాన్ని ఏర్పాటు చేసి సకల దేవతలను పిలిచి, శివున్ని మాత్రం ఆహ్వానించడు. సతీదేవి ఈ విషయాన్ని అవమానంగా భావించి యజ్ఞంలో దూకి చనిపోతుంది.
🌸 శైలపుత్రీ 🌸
సతీదేవి యోగాగ్నిలో తనువును త్యజించి, పిదప పర్వత రాజైన హిమవంతుని యింట పుత్రిక యై అవతరించినందున ఆమెకు శైలపుత్రి అను నామము వచ్చింది.
వృషభవాహనారూఢయైన ఈ మాతకు కుడిచేతిలో త్రిశూలము, ఎడమచేతిలో కమలము విరాజిల్లుచుండును. తలపై చంద్రవంకను ధరించి యుండును. పార్వతి, హైమవతి అనునవి ఆమె పేర్లే. శైలపుత్రి మహిమలు, శక్తులు అనంతములు...
🌸 గంగా దేవి 🌸
సగర చక్రవర్తి యొక్క 16000 కుమారులకు స్వర్గ ప్రాప్తి కల్పించడం కోసం వారి మనుమడు భగీరథుడు ఘోరమైన తపస్సు చేసి బ్రహ్మ ను ప్రత్యక్షం చేసుకుంటాడు.
అయితే గంగా ప్రవాహాన్ని భూమి తట్టుకోలేని కారణంగా శివుడు, గంగ ను తన జటాజూటంలో భండిస్తాడు. తన జటాజూటంలో లో ఒక పాయ ను మాత్రమే తీసి ప్రవహింప చేస్తాడు.
ఆమె ఉద్రుతిని తగ్గించడానకి మొత్తం గంగను మింగిన భగీరథుడు, తన చెవి గుండా ప్రవహింప చేస్తాడు.
✍️ Bhagyamati.
Super madam
రిప్లయితొలగించండిThank you
తొలగించండి