నిర్వచనం:-
సాధారణంగా... చుట్టూ ఉన్న సంఘటనలను బట్టి సమాజాన్ని చదవడం ద్వారా జ్ఞానాన్ని పొందడం. పొందిన జ్ఞానాన్ని సమస్యలు వచ్చినప్పుడు ఎదుర్కొనే లాగా ఉపయోగించటమే మేధస్సు. మన ఎమోషన్స్ ని నిలకడగా ఉంచుకుంటూ మన చుట్టూ ఉన్న మనుషుల నుండి స్వతంత్రంగా, ప్రశాంతంగా బ్రతకడమే ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్.
ఆత్మ విశ్వాసం, సౌశీల్యం గల కొందరి మానవుల చరిత్ర యే ప్రపంచ చరిత్ర. ప్రతి వ్యక్తి లోనూ ఉండవలసిన లక్షణాలు మూడు.
1. స్పందించే మనసు
2. ఆలోచించే మనసు
3. పని చేసే చేయి
- వివేకానందుడు
'హూ వర్డ్ గార్డెనర్' అనే పాశ్చాత్య మానసిక శాస్త్రవేత్త ఈ సిద్ధాంతాన్ని ప్రచారంలోకి తెచ్చాడు. మానవ సంబంధాలు, మనిషి యొక్క వ్యక్తిగత జ్ఞానం అనే రెండు కోణాల్లో దీన్ని విశ్లేషించాలి.
ఒక వ్యక్తి తన ప్రవర్తన ద్వారా, తన జీవన విధానం ద్వారా, శీల సంపద ద్వారా సమాజంలో ఆదర్శప్రాయుడిగా పేర్కొనబడతాడు. శీల సంపద అంటే క్రమశిక్షణ, నీతి, నిజాయితీ, నిబద్ధత.
విశ్లేషణ:-
"వినదగునెవ్వరు చెప్పిన వినినంతనే వేగపడక వివరింపదగున్ కని, కల్లా, నిజము తెలిసిన మనుజు డేపుడో నీతిపరుడు మహిలో సుమతి!" అన్నాడు సుమతి శతక కారుడు.
అంటే ఏదైనా ఒక విషయాన్ని వినగానే... కోపతాపాలు, సుఖదుఃఖాలు వీటికి ప్రభావితం కాకుండా మనలోని ఆవేశాన్ని, భావోద్వేగాలని అధ్యయనం చేసుకుని విశ్లేషించుకోవడం ద్వారా ఆ సమస్య పరిష్కారానికి కృషి చేయడం. దీనినే IQ అని కూడా అంటారు.
స్వీయ ప్రేరణ - Self Motivation:
భావోద్వేగాలని తటస్థంగా ఉంచుకోలేక, మన కింద ఉద్యోగులపై ఎగిరి పడడం, దూషించటం... ఇంటికి వచ్చాక భార్యా, పిల్లలపై కోపాన్ని చూపించటం... మనల్ని మనుషులకు దూరం చేస్తుందే తప్ప, మనుషుల మధ్య అనుబంధాన్ని నిలపలేదు.
తన కోపమే తన శత్రువు
తన శాంతమే తనకు రక్ష, దయచుట్టంబవ్
తన సంతోషమే స్వర్గము
తన దుఃఖమే నరకమండ్రు తద్యము సుమతి!
అనుసరణ:
మనసు తటస్థంగా ఉంచుకోవడం అనేది గొప్ప కళ ఏం కాదు, అది ప్రతి మనిషిలో ఉండాల్సిన అలవర్చు కోవాల్సిన మంచి అలవాటు. ఇది బయట నుంచి ఎవరో వచ్చి మన మనసులో చేసేది కాదు. స్వీయ ప్రేరణ ద్వారా మనల్ని మనం తటస్థంగా ఉంచుకోవాలి. ఎందుకంటే ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది. సమస్య మన లోనిది అయినప్పుడు పరిష్కారం కూడా మనలోనే ఉంటుంది.
తాళంతో పాటే తాళం చెవి కూడా తయారు చేయబడుతుంది అలాగే పరిష్కారం లేకుండా సమస్యను భగవంతుడు సృష్టించడు.
-స్వామి వివేకానంద
అదికమించడం:-
పెంపుడు జంతువులతో ఆడుకోవడం, పుస్తకాలు చదవడం, మంచి సంగీతాన్ని వినడం, చిన్నచిన్న గేమ్స్ ఆడటం, పిల్లలతో ఆడుకోవడం... ఇలాంటి అలవాట్లు వల్ల మన కోపాన్ని మనం అధిగమించవచ్చు.
బావావేశాన్ని స్థిరపరచుకొని, సంకల్ప సిద్ది కోసం ప్రయత్నించాలి. చేసిన తప్పుకు క్షమాపణ అడిగినవాడు ధైర్యవంతుడు. ఎదుటివారి తప్పులను క్షమించగలిగిన వాడు బలవంతుడు.
- స్వామి వివేకానంద
Thank you 🙏
✍️ Bhagyamati
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి