Colorism discrimination:
వర్ణ వివక్ష లేదా చాయ వివక్ష.
భారతీయులంతా అందమైన వాళ్ళే, ఎందుకంటే మనది భారత దేశం. ఈ దేశమే అందమైనది అయినప్పుడు, ఈ భూమి మీద పుట్టిన మనమంతా అందమైన వాళ్ళమే కదా... ఇక్కడ మనవారు బంగారు, పసుపు వర్ణాలు కలిపి పుట్టాము. మన వారిది కంటికి ఇంపైన రంగు.
✍️Bhagyamati
బ్రిటిష్ కాలం నుండి నిన్న మొన్నటి తరాల వరకు మనమంతా సమాజంలో కులం మతం పేరుతో వర్గాలుగా విడిపోయి ఉండేవాళ్లం. చదువు, సంస్కారం మనల్ని వాటి నుంచి బయటకు తీసి భారతీయులం అని చాటింది.
నాడు దక్షిణాఫ్రికాలో మహాత్మా గాంధీని రైలు నుంచి గెంటి వేసింది ఆయన ఒంటి రంగు కారణంగానే. అమానుషమైన వర్ణ వివక్షను అంతమొందించాలని పాటుపడిన మహాత్ముని మాతృభూమి లోనే తామిప్పుడు జాతి వివక్షను ఎదుర్కొంటున్నట్లు ఆఫ్రికన్ జాతీయులు ఆరోపిస్తున్నారు.
Dark-skinned Indians
ఈ ఘటన జరిగి నేటితో 125 ఏళ్లు నిండాయి. అది దక్షిణాఫ్రికాలో గాంధీని రైలు నుంచి బయటకు గెంటివేయడం. ఒకరకంగా జాతివివక్ష లోని రాక్షసత్వాన్ని గాంధీకి రుచి చూపింది ఆ అవమానమే. ఈ జాతివివక్ష భారతీయుల రంగులో నుండి పుట్టిందే.
నాడు తాను ఎదుర్కొన్న అవమానం, అప్పుడు ఆయన పడిన వేదన, మనసులోని కల్లోలం ఆయన ఆత్మకథ 'ద స్టోరీ ఆఫ్ మై ఎక్సపరిమెంట్స్ విత్ ట్రూత్' ద్వారా తెలుసుకోవచ్చు.
జాతి వివక్షను రూపు మాపాలని ఆయన అప్పుడే కంకణం కట్టుకున్నారు. అందుకు ఎందాకైనా పోరాడాలని నిర్ణయించుకున్నారు. ఇక్కడ నుంచి మొదలైన గాంధీ పోరాటం భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చే వరకు ఆగలేదు.
Fair & Lovely
ఇండియాలో దాదాపుగా ఈ బ్రాండ్ అన్ని వర్గాలకూ చేరువై.. కాస్మోటిక్ రంగంలో దాదాపు 50శాతం-70శాతం వాటాను కలిగి ఉంది. మన చిన్నప్పటినుండి టీవీలలో వచ్చే ఫెయిర్ అండ్ లవ్లీ ప్రకటన మనకు బాగా గుర్తుంది. ఒక డాన్స్ గ్రూపులో తెల్లటి చర్మం ఉన్న అమ్మాయి ముందు లైన్ లో ఉంటుంది. అదే టాలెంట్ ఉన్న నల్లటి చర్మ చాయ కలిగిన అమ్మాయి వెనకాల లైన్లో ఉంటుంది.
ప్రకటన చివరిలో... ఫెయిర్ అండ్ లవ్లీ వాడి తెల్లగా మారి, ముందు లైన్ లోకి వస్తుంది.అంటే తెల్లగా ఉంటేనే ఏ రంగంలో అయినా మనం ముందుకు వస్తాము అనే సందేశం.
మరో ప్రకటనలో నల్లగా ఉన్న అబ్బాయిని చూసి అమ్మాయి పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది. ఒక బాలీవుడ్ హీరో వచ్చి ఇతనికి ఫెయిర్ అండ్ లవ్లీ / ఫెయిర్ అండ్ హ్యాండ్సం ఇస్తాడు. అది వాడిన అతను ఈసారి అమ్మాయికి కనిపించినప్పుడు అమ్మాయి "హాయ్ హ్యాండ్సమ్" అంటుంది.
ఇలాంటి ప్రకటనలే మనదేశంలో మనకు వచ్చిన స్వతంత్రాన్ని... గాంధీజీ తెచ్చిన స్వతంత్రాన్ని కూడా వాడుకొని ఎదగడానికి లేకుండా చేస్తున్నాయి. చర్మం రంగు ఆత్మ నున్యతకు గురిచేస్తోంది.
రంగు లో గొప్పతనం ఉంటే చిరంజీవి, రజినీకాంత్ కి ఇన్ని కోట్ల మంది అభిమానులు ఉండరు కదా!
Soo nice
రిప్లయితొలగించండిNice message mam.thank you for giving courage 👍
రిప్లయితొలగించండి