మానవ సమాజం పురుషాధిక్య సమాజం కాబట్టి సహజంగానే పురుషులు స్త్రీలపై ఆదిపత్యాన్ని చలాయించడం జరుగుతుంది. చాలా వరకు స్త్రీలను దాదాపుగా వారి ఆస్తిలో భాగంగానే పురుషుడు చూస్తాడు.
మహిళలను మానవ శక్తిగా ముందుకు నడిపించాలంటే ముందుగా వారిపై జరిగే దురాగతాలను, సంఘంలో వారి దుస్థితిని గృహంలో జరిగే హింసను, వారి పట్ల జరిగే అన్యాయాలను చర్చించాలి. 1974లో కేంద్ర ప్రభుత్వం నియమించిన 'మహిళల స్థితిపై విచారణ కమిటీ' తన నివేదికలో మహిళలపై అత్యాచారాలు, భార్యను వేధించటం, వరకట్న చావులు, పడుపు వృత్తి... అంశాలను వివరించింది.
మహిళలను ప్రధాన ఆర్థిక స్రవంతిలో చేర్చాలంటే... ముందుగా వారికి సమానత్వాన్ని, సాంఘిక న్యాయాన్ని సాధించే మార్గం చూపాలి.
రాజ్యాంగంలోని 14వ ప్రకరణ - 'చట్టం ముందు అందరూ సమానమే' అని చెబుతోంది. మరి సమాజంలో అందరూ సమానమేనా? స్త్రీ, పురుషులు సమానమేనా?
రాజ్యాంగంలోని 39 (డి) ప్రకరణ ప్రకారం స్త్రీపురుషులకు ఇరువురికి సమానమైన పనికి సమాన వేతనం ఇవ్వాలి రాజ్యాంగం అందరికీ తెలియదు. కాబట్టి పేద స్త్రీలు దొరికిందే మహా ప్రసాదం అన్నట్లు తక్కువ వేతనానికే పని చేస్తుంటారు.
73, 74 సవరణల వల్ల 50% రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో, 33% చట్ట సభల్లో కల్పించినా... నామ మాత్రపు ప్రజాప్రతినిధులుగానే మిగిలారు...మహిళలు.
నెల్లూరు జిల్లాలో చిన్నకు గ్రామంలో సారా నిషేధం కోసం పెద్ద ఉద్యమం ప్రారంభించింది స్త్రీలే. అలాగే ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కూడా ఉద్యమించారు. పురుషులకంటే స్త్రీలు బలవంతులు, నీతిమంతులు, సున్నిత మనస్కులు.
"స్త్రీ పురుషునితో సమానత్వం కోరుకోవడం అంటే ఒక అడుగు వెనకకు వేయడమే., పురుషుడినే తనతో పాటు ముందుకు నడిపించాలి."
Thank you 🙏🏻
✍🏻 Bhagyamati.
నిజమే.....స్త్రీ పురుషునితో సమానత్వం కోరుకోవడం అంటే ఒక అడుగు వెనకకు వేయడమే. మనం వెనుకబడి వున్నాం అని మనమే ఒప్పుకోవడం అవుతుంది...... చక్కగా వివరించారు..
రిప్లయితొలగించండిThank you
తొలగించండిNice words for women empowerment and this may inspire thousands of women and girls like me . good work mam👌👍. write as many writings you can to inspire lakhs of people
రిప్లయితొలగించండిThank you 👍
రిప్లయితొలగించండి