ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

Sindhu nagarikatha లేబుల్ గల పోస్ట్‌లను చూపుతోంది

సింధు నాగరికత మిగిల్చిన తీపి గుర్తులు

                                          Bhagyamati ✍️                                        Anil సౌజన్యంతో...     సింధూ ప్రజలు పండించిన గోధుమ, బార్లీ, వరి తదితర పంటలు ఇప్పటికీ... మన వ్యవసాయ రంగంలో ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి.      వారు పూజించిన స్త్రీ దేవతలు 'ఆదిశక్తి' గా... పశుపతిని 'శివుని'గా... వృషభాన్ని 'నంది'గా... ఆరాధిస్తూనే ఉన్నాము. 'లింగ పూజ', 'అమ్మ తల్లి'  ఆరాధన, శక్తి ఆరాధన, నాగపూజ, రావిచెట్టు పూజ... ఈనాటికీ భారతీయ సమాజం పై ప్రభావాన్ని చూపుతున్నాయి. అప్పటికి, ఇప్పటికీ...పూజించే పద్ధతులు మారాయే తప్ప, ఆరాధించే దైవాలు మాత్రం మారలేదు.     హిందీ లో 'మొహెంజొధారో ' సినిమా ని చూస్తే... సింధూ నాగరికత కళ్ళ ముందే జరుగుతున్నట్లు అనిపిస్తుంది. గ్రీకు శిల్పంలా... హృతిక్ రోషన్, అందమైన దేవతలా... పూజా హెగ్డే, కనులకు ఇంపుగా ఉంటారు. మళ్ళీ మళ్ళీ ఆ సింధూ ప్రజలు గుర్తుకు వస్తూనే ఉంటారు.     ఆ కాలంలో వివిధ జాతుల వారి మధ్య సాంస్కృతిక ఏకతా, పరస్పర గౌరవ భావాలు, ఈనాటికీ... భారతీయ సమాజంలో ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.     భారతదేశంలో 'భిన్నత్వంలో ఏకత