Bhagyamati✍️ హరిత విప్లవ పితామహుడు, భారతరత్న గ్రహీత, భారతదేశపు ఆధునిక వ్యవసాయ అభివృద్ధి విధాన రూపకర్త... ఎం.ఎస్ స్వామినాథన్ ఈ రోజు మరణించారు. నేడు ప్రపంచంలో గోధుమ పంటను ఉత్పత్తి చేసే దేశాలలో భారతదేశం ముందు వరుసలో ఉంది. 1960 లలో ఇదే భారతదేశం గోధుమలను, అమెరికా నుండి దిగుమతి చేసుకునేది అంటే నమ్మడం కష్టమే. గోధుమలను దిగుమతి చేసుకునే స్థాయి నుండి ఎగుమతి చేసే స్థాయి వరకు తీసుకురావడానికి కృషి చేసిన వారు స్వామినాథన్. ఈయన హరిత విప్లవం ద్వారా మనదేశంలో కొత్తరకం గోధుమ మరియు వరి వంగడాలను ప్రవేశపెట్టడం ద్వారా వరి, గోధుమ, జొన్న, మొక్కజొన్న, బాజ్రా పంటల ఉత్పత్తిని తారాస్థాయిలో పెంచగలిగారు. అందుకే ఇది హరిత విప్లవం కాదు వ్యవసాయ విప్లవం అంటారు. 1966లో ప్రారంభించిన ఈ హరిత విప్లవ ప్రభావం ఆహార ధాన్యాల ఉత్పత్తిని 81 మిలియన్ టన్నుల నుంచి ఇప్పటికీ 300 మిలియన్ టన్నులకు పెంచిందంటే ఆశ్చర్యమే. భారతదేశంలో జీవనోపాధిగా ఉన్న వ్యవసా...
Telugu and English writings