మాది "చాటగొట్ల" గ్రామం. ఇది పొదలకూరు మండలం, నెల్లూరు జిల్లాలో ఉంది. మా గ్రామంలో ప్రజలు వ్యవసాయము, నిమ్మ తోటలు సాగు చేయడం ప్రధాన వృత్తిగా చేసుకుని జీవనం సాగిస్తున్నారు. వ్యవసాయం తరువాత ప్రధాన వృత్తిగా పాడి పరిశ్రమ ఉంది. ఇక్కడ చాలామందికి ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు మరియు కోళ్లు ఉన్నాయి. ఊరు చుట్టూతా మంచి పచ్చిక బయళ్లు, తోటలు, అడవులు మా ఊరికి అందాన్నిస్తుంటాయి. ఈ పచ్చిక బయళ్ళలో పుష్కలంగా గడ్డి లభించడం వలన పాడి పశువులు చక్కగా... శక్తివంతమైన, ఆరోగ్యకరమైన పాలు ఇచ్చుచున్నాయి. ఇచ్చట యాదవులు... పశువులను, ఆహారం కోసం... త్రోలుకొని పోవుచూ... వాటికి కావలసిన పెద్ద మొత్తంలో నీరు మరియు దాన్యపు పిండిని సమకర్చుచూ... వాటి ద్వారా వచ్చే పాలను అమ్ముచూ... జీవనోపాధిని గడుపుతున్నారు. వేకువ పొడిచినప్పటి నుండి, ఈ గేదెలకు నీరు ఆహారం అందించడంతో వీరి రోజు మొదలవుతుంది. ఈ మూగ జీవులను ఆహారం కోసం అడవికి తోలుచూ... మరలా ...
Telugu and English writings