మాది "చాటగొట్ల" గ్రామం. ఇది పొదలకూరు మండలం, నెల్లూరు జిల్లాలో ఉంది. మా గ్రామంలో ప్రజలు వ్యవసాయము, నిమ్మ తోటలు సాగు చేయడం ప్రధాన వృత్తిగా చేసుకుని జీవనం సాగిస్తున్నారు. వ్యవసాయం తరువాత ప్రధాన వృత్తిగా పాడి పరిశ్రమ ఉంది.
ఇక్కడ చాలామందికి ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు మరియు కోళ్లు ఉన్నాయి. ఊరు చుట్టూతా మంచి పచ్చిక బయళ్లు, తోటలు, అడవులు మా ఊరికి అందాన్నిస్తుంటాయి. ఈ పచ్చిక బయళ్ళలో పుష్కలంగా గడ్డి లభించడం వలన పాడి పశువులు చక్కగా... శక్తివంతమైన, ఆరోగ్యకరమైన పాలు ఇచ్చుచున్నాయి.
ఇచ్చట యాదవులు... పశువులను, ఆహారం కోసం... త్రోలుకొని పోవుచూ... వాటికి కావలసిన పెద్ద మొత్తంలో నీరు మరియు దాన్యపు పిండిని సమకర్చుచూ... వాటి ద్వారా వచ్చే పాలను అమ్ముచూ... జీవనోపాధిని గడుపుతున్నారు.
వేకువ పొడిచినప్పటి నుండి, ఈ గేదెలకు నీరు ఆహారం అందించడంతో వీరి రోజు మొదలవుతుంది. ఈ మూగ జీవులను ఆహారం కోసం అడవికి తోలుచూ... మరలా సాయంత్రం కాలం నాటికి తిరిగి ఇంటికి చేరుకుంటారు. దారి తప్పిన పశువులు ఇంటికి చేరుకోకపోతే, పిల్లలు జాడ తెలియని తల్లిదండ్రులలా తల్లడిల్లి పోతారు, ఇక్కడివారు.
ఎన్నో కష్టనష్టాలకు ఓర్చుకొని వంశపారంపర్యంగా వస్తున్న కులవృత్తిని వదిలిపెట్టకుండా కొనసాగిస్తున్నారు.
"వీరు నిజమైన శ్రమజీవులు".
ఎంతోమంది పెద్ద చదువులు చదువుకొని పట్టణాల్లో ఉద్యోగాలు చేస్తూ, విదేశాలలో నివసిస్తున్నారు. అయినా కూడా కుటుంబంలో ఎవరో ఒకరు, గ్రామాన్ని అంటిపెట్టుకొని, వారి కులవృత్తిని వదిలిపెట్టకుండా... ఈ పాడి పశువులను పెంచుతూ తమ జీవనాన్ని సాగిస్తున్నారు. లాభం కోసం కాకుండా వారి వృత్తిని వదులుకోకూడదు అని ఇదే గ్రామంలో సంతోషంగా జీవిస్తున్నారు.
చాటగొట్ల మీద మీ ప్రేమ,వూరి జనం పై మీ అభిమానం,
రిప్లయితొలగించండివారి వృత్తి పై మీ గౌరవం అర్థమవుతుంది.. పల్లెటూర్లు దేశా నికి పట్టు కొమ్మలు అని చాలా చక్కగా వివరించారు...
Superb 👏👏👏
రిప్లయితొలగించండిఅనగనగా ఒక పల్లెటూరు.....మళ్లీ చిన్ననాటి రోజులు గుర్తుకు వచ్చాయి. నేను రోజు చూసే ఊరిని, ఆహ్లాదకరంగా వివరించావు keep going.
రిప్లయితొలగించండిThank you🙏
తొలగించండి