వ్యవహారిక భాషా ఉద్యమానికి శ్రీకారం చుట్టి తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు... సవర గిరిజనుల అభ్యుదయకారుడు "గిడుగు రామ్మూర్తి."
✍️ Bhagyamatiఎక్కడో ఊరి చివరన ఉన్న గిరిజనులు 'savara' జాతి వారి కోసం ఊరిలో నుండి ఉద్యమించాడు. అడవి తప్ప ఊరు తెలియని వారికి ఊతమిచ్చాడు... రాత నేర్పాడు.
మన భాష నేర్పాలంటే ముందుగా వారి భాష నేర్చుకున్నాడు. వారి విద్యాభివృద్ధికి కృషి చేశాడు. తన సొంత డబ్బుతో సవర భాషలో పుస్తకాలు రచించి, ప్రచురించాడు. సవరజాతీయుల కోసం పాఠశాలను కూడా స్థాపించాడు. ఈయన కృషి ముందు ప్రభుత్వం ఇచ్చిన బంగారు పథకాలు 'రావు బహదూర్' బిరుదులు చిన్నబోతాయి.
"సామాన్యులు తమకోసం, తమ కుటుంబం కోసం శ్రమిస్తారు. అసామాన్యులు ఇతరుల కోసం శ్రమిస్తారు."
ఒక జాతి కోసమే కాదు, మన భాష కోసం కూడా ఉద్యమించారు గిడుగు రామూర్తి.
ఆనాటి గ్రాంథిక భాషా వాదులు స్థాపించిన 'ఆంధ్ర సాహిత్య పరిషత్తు' గిడుగు ఆశయాన్ని బలహీనపరచడానికి చూసింది. కార్యదీక్షాపరుడైన రామ్మూర్తి నిరాశ, నిస్పృహలకు లోను కాలేదు. దేశమంతటా పర్యటించి ఆంధ్ర భాషా పండితులచే తన వాదాన్ని అంగీకరింప చేశాడు. వర్తమానాంధ్ర భాషా ప్రవర్తక సమాజాన్ని నెలకొల్పాడు. ఈయన స్ఫూర్తితో గురజాడ, ఉన్నవ... వ్యవహారిక భాషలో రచనలు గావించారు.
తెలుగు భాషకు ఈయన చేసిన కృషికి గాను గిడుగు జన్మదినం 'ఆగస్టు 29' ని తెలుగు భాషా దినోత్సవం గా జరుపుకుంటాం.
తెలుగుదనానికి వెలుగు చూపిన గిడుగు రామమూర్తి గారి గురించి తెలియచేసినందుకు , మీకు మా ధన్యవాదాలు.👍👌
రిప్లయితొలగించండిThank you
తొలగించండి