భూమి పుట్టుక - Birth of Earth:-
మానవుడు అనే మాట పుట్టక ముందే భూమి పుట్టింది. మానవుని ఉనికిని తెలుసుకోవడానికి డార్విన్, అరిస్టాటిల్ వంటి గొప్ప శాస్త్రవేత్తలు, చరిత్రకారులు ఎందరో ఉన్నారు. మానవుని పుట్టుక, ఉనికి, మనుగడ, అభివృద్ధి... ఇవన్నీ మానవ సమాజం అనే పదం లోనివే. ఇవన్నీ అర్థం కావాలంటే అంతకంటే ముందు నుండి ఉన్న భూమి గురించి తెలుసుకోవాలి.
భూమి గురించి చెప్పాలంటే ఒక ఖగోళ శాస్త్రవేత్త గ్రహం గాను, ఒక చరిత్రకారుడు చరిత్రకు పునాది గాను, ఒక పురావస్తు శాస్త్రవేత్త సంపదల గని గాను, ఒక సాధారణ రైతు అన్నం పెట్టే అమ్మ గాను, భావిస్తారు. అదే మనలాంటి సాధారణ ప్రజానికం భూమిని దేశంగా భావిస్తాం. ఈ భూమి కోసం చేసిన స్వతంత్ర పోరాటాలు మనలో ఈ దేశం పట్ల, నేల పట్ల దేశభక్తిని, ఐక్యతను పెంపొందించాయి.
భూమి పై జీవుల పుట్టుక -
ఎన్నో లక్షల ఏళ్ల క్రితమే భూమి పుట్టింది. మానవుడి మనుగడ లేక ముందే భూమి పుట్టిన 100 కోట్ల సంవత్సరాలకు, అంటే క్రితం 350కోట్ల సంవత్సరాలప్పుడు ఏకకణ జీవులు అంటే బాక్టీరియా కేంద్రక పూర్వ జీవులు ఆవిర్భవించాయి. పక్షులు, ఎన్నో రకాల జీవులు మనుగడ సాగించాయి, అంతరించాయి కూడా. కానీ యుగాలు గడిచాక మానవుని జననం, ఉనికిని ఈ భూమిపై తెలుసుకున్నాము.
అభివృద్ధి చెందిన జీవరాశి గా మానవుడు భూమిపై జీవనశైలిని మామూలు జీవరాశుల లాగే ఆరంభించి, పూర్తిస్థాయి నాగరికుడిగా మారాడు. ఏ జీవరాశి కూడా భూమిపై స్వయంగా ఆహారం తయారు చేసుకునే ప్రయత్నం చేయలేదు. చిన్న జీవుల్ని పెద్ద జీవులు, వాటిని మరింత పెద్ద జీవులు ఆహారంగా వినియోగించుకుంటూ జీవనం సాగించాయి. దీనినే మనం పర్యావరణ శాస్త్రంలో ఆహారపు గొలుసు గా చదువుకున్నాము.
భూమిని సాగుచేయడం:-
మానవుడు మాత్రం భూమిని దున్నడం, విత్తనం నాటడం, సాగు చేయడం, పంటలు పండించడం, ఉత్పత్తులు, వినియోగాలు ఇలా ఎన్నో వాణిజ్య పదాలకు నాంది పలికాడు. మొట్టమొదటి పాత రాతి యుగపు మానవుడు ఆహారపు గొలుసు జీవన శైలిలో జీవించినా, మధ్యయుగ కాలం నాటికి భూమిని దున్నడం, సాగు చేయడం, పంటలు పండించడం నేర్చుకున్నాడు. భూమిపై పూర్తిగా ఆధారపడ్డ మనిషి భూమిని తల్లిగా 'భూమాత'గా భావించి పూజించాడు.
ఆధునీకరణ:-
ఆధునిక కాలం నాటికి అంతా తారుమారైన మనిషి జీవనశైలి, భూమి ని ఆహారం పండించే నేలగా, తల్లిగా మాత్రమే చూడలేదు. మైదానాలు పీఠభూములుగా విభజించబడ్డ భూమి వైనం, మానవుడి మేధాశక్తిని పోరాటాల వైపు తిప్పింది. విశాలమైన జీవ నదులు గంగా, యమునా, గోదావరి, కృష్ణా ప్రవహించే నేల బంగారు భూమిగా పేరుగాంచింది. ఈ నేల మైదానాలుగా, ఈ నేలపై పండించే మనిషి ధనవంతుడిగా, ఆ నేల ఉన్న దేశం సంపన్న దేశంగా గుర్తింపు పొందాయి. ఈ మైదానాలు కలిగిన భూమి కోసం జాతులుగా, ప్రాంతాలుగా విడిపోయిన మానవులు పోరాటాలు చేశారు, యుద్ధాలు చేశారు. రాజ్యాలు, దేశాలు ఏర్పడ్డాయి. రాజులు, సామంతులు తయారు గావించబడ్డారు.
ఈ భూమిపై పంట పండించడం, ఆహారం ఉత్పత్తి చేసుకోవడం కాక మనిషి మరెన్నో అద్భుతాలు చేశాడు. భూమి లో లోపల భూగర్భంలో దాగి ఉన్న వజ్రాలు, రత్నాలు, బంగారం, ఇనుము వంటి లోహాలను వెలికి తీయడం నేర్చుకున్నాడు. వీటితో సంపాదన సృష్టించాడు. అంతటితో తృప్తి చెందని మనిషి ఈ సంపదతో విదేశీ వ్యాపారాలు, ఆక్రమణలు చేశాడు. సృష్టించిన లేదా కొల్లగొట్టిన సంపదతో ఇదే నేలపై భూతల స్వర్గాలను నిర్మించాడు. తాజ్ మహల్ లాంటి ఎన్నో అద్భుతాలను ఈ నేల పై మనం ఎన్నో చూడగలం.
రత్నాలు, లోహాలు కాక పెట్రోల్, డీజిల్ వంటి ఎన్నో ఇంధనాలను ఈ భూమి నుంచి వెలికి తీయడం నేర్చుకున్నాడు. ఇంధనాలను వాడే యంత్రాలను, పరికరాలను, వాహనాలను కనుగొని నాగరికతలో భాగంగా మనిషి ఎన్నో ఏళ్ల నుంచి ఉపయోగిస్తున్నాడు.
అంతరిక్ష పరిశోధన:-
మనిషి జననం... ఈ భూమిపై ఎంత అద్భుతమో... మనిషి ఉన్నతి, అభివృద్ధి, నాగరికత కూడా అద్భుతాలే!. భూమిపై ఎన్నో జీవరాసులు చేయలేని ఘనతను మానవుడు సాధించాడు. భూమిపై ఎన్నో పరిశోధనలు గావించాడు. సూర్యుడు, చంద్రుడు భూమిపై జీవరాశులకు ఆధారమని తెలుసుకున్న తొలియుగం మానవుడు వీరిని దేవతలుగా భావించి పూజించారు. నేడు ఇదే మానవుడు శాస్త్రవేత్తగా మారి గ్రహ మండలాన్ని కనుగొన్నాడు. భూమిని ఒక గ్రహంగా దానికి ఆధారమైన గ్రహాలుగా సూర్యుడు, చంద్రుడు మన విజ్ఞానానికి తారసపడతారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకున్న మనిషి అంతరిక్ష శాస్త్రాన్ని కూడా కనుగొన్నాడు.
అంతరిక్షానికి వెళ్లడం, ప్రయోగాలు చేయడం, చంద్రునిపై కాలు మోపడం, చంద్రయాన్ ప్రయోగాలు ఇందుకు మంచి ఉదాహరణలు. ఇంకా భావితరాలు ఇదే నేలపై పుట్టి ఎంతో ఎత్తుకు ఎదిగి చంద్రునిపై కాలు పెట్టడమే కాదు, మరెన్నో అద్భుతాలు సాధించాలి.
అభివృధి - భూమి కాలుష్యం:-
" మార్కెట్ ఎల్లప్పుడూ సరైనది" అనేది అభివృద్ధి చెందిన మరియు అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక విధానాలలో ఒకే విధంగా ప్రబలంగా ఉన్న ఆలోచన. పరిశ్రమలు ఒక విప్లవం లా... రావడం, వాతావరణ మార్పు మరియు భారీ స్థాయిలో పర్యావరణ క్షీణత కు కారణమైంది. స్థానిక ప్రజలు భూమి, నీరు మరియు అనేక ఇతర వనరులకు సంరక్షకులుగా ఉన్నారు, కానీ నీరు ప్రభుత్వాల బాధ్యతగా ఉండటం తో నీటి కాలుష్యం నుండి రక్షణ కరువైంది. నీరు కూడా కొనుక్కునే స్థితికి వచ్చాము. ఈ ఆలోచనా విధానం మారాలి మానవుల ఆధ్యాత్మిక కోణాలను, విశ్వంలోని అన్ని అంశాల అనుసంధానంతో మనిషి లో కొత్త ఆలోచన రావాలి. సహజ వనరులను కాపాడుకోవాలి.
ఎన్ని చేసినా, ఎంత చేసినా... ఈ నేల నాకు 'తల్లి' అనే భావన ప్రతి మనిషిలో అలానే ఉండాలి. ఎందుకంటే భూమికి మనిషి అవసరం లేదు, మనిషికే భూమితో అవసరం. ఇదే నేలపై, ఇదే మట్టిలో జన్మిస్తాము, జీవిస్తాము, మరణించి ఇదే మట్టిలో ఒక రేణువై కలిసిపోతాం. నేల తల్లికి వందనం, నా తెలుగుతల్లి కి వందనం. దేశమoటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయి. జైహింద్🙏🙏🙏
Thank you 🙏🏻 Bhagyamati✍🏻
Heartful meditation theme
రిప్లయితొలగించండిGood topic 👏awesome bhagi 🥰 keep it up......
రిప్లయితొలగించండిThank u dear 😊
రిప్లయితొలగించండి