నీ కన్నుల కాచే వెన్నెల చంద్రుడు నేనని చెప్పాను.
ఆ పున్నమిలోన పూసిన కలువలు నా నవ్వని చెప్పాను.
ఆ నవ్వున రాలిన రతనాల రంగువు, నువ్వని చెప్పాను.
రంగు రంగుల ఈ లోకం రమ్యమైనది అయితే...
నా అంతరంగమందున్న నీవు ఏ రంగని చెప్పాలి?!
కృష్ణుని నీలి వర్ణమా...
సాయంకాలపు మేఘ వర్ణమా...
లేత పూవుల పసిడివర్ణమా...
పూతరేకుల శ్వేత వర్ణమా...
రాత రాతలో నీపై ప్రీతి చెప్పగలను తప్ప,
నా గుండె లోతులో నీకై పడే వ్యధను చెప్పగలనా...
రొధను చెప్పగలనా...
ఏటి గట్టున ఎంకిలాగా... ఏళ్ల తరబడి పాడుతున్నా!
నీటిజల్లు కనుల వెంట ఏరులై పారుతున్నా!
నీ చెవిన పడ్డ జాడలేదు,
నీకై పరుగులీడే నా అడుగులు తప్ప.
తప్పొప్పుల తడికలు పక్కకు తీసి,
కప్పిన రెప్పల చాటున కనుపాపలు విప్పి చూడు.
గుప్పున వచ్చే ప్రేమ పరిమళాలు.
నీ మెప్పుకు వేచేదే తప్ప,
నిన్ను నొప్పించేటిది కాదు ప్రియ!
Thank you 🙏🏻
✍️Bhagyamati.
Excellent poetry 👏👏
రిప్లయితొలగించండిThank you
తొలగించండిమీ కమ్మని కవిత కు నా వందనం
రిప్లయితొలగించండిThank you
రిప్లయితొలగించండిబాగా రాశారు, అద్భుతం.
రిప్లయితొలగించండిThank you
తొలగించండిబాగా రాశారు
రిప్లయితొలగించండిThank you
తొలగించండి