ప్రపంచవ్యాప్తంగా మహిళల్లో 60% మంది మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారు. దీనికి కారణం ఆహారంలో ఐరన్ లోపం, పౌష్టికాహార లోపం. దీనిని అధిగమించాలంటే విటమిన్ సి, విటమిన్ ఏ అధికంగా ఉన్న ఆహార పదార్థాలను, పచ్చి కూరగాయలను, పండ్లను తీసుకోవాలి. క్యారెట్లు మరియు బీట్రూట్లు పచ్చగా తినడం ద్వారా లేదా జ్యూస్ చేసుకొని తాగడం వల్ల రక్తహీనతను అధిగమించవచ్చు. బీట్రూట్ జ్యూస్ ను సేవించటానికి చాలామందికి ఉన్న అభ్యంతరం ఏమిటంటే బీట్రూట్ జ్యూస్ వగరుగా అనిపించడం, దాని పచ్చివాసన నచ్చకపోవడం. అందుకని బీట్రూట్ ని రుచికరంగా మనకు నచ్చే విధంగా జ్యూస్ చేసుకోవడం ఎలాగో చెబుతాను.
ఇందుకు కావాల్సిన పదార్థాలు-
- బీట్రూట్ 1,
- టమోటాలు 2,
- అల్లం హాఫ్ ఇంచ్,
- 1 స్పూన్ తేనె.
టమోటాలను, బీట్రూట్ ను కట్ చేసి అల్లం ను జోడించి మిక్సీకి వేసి ఫిల్టర్ చేసుకొని అందులో మనం ఒక కప్పు నీటిని జత చేస్తాం. పడపోసిన తర్వాత ఇందులో ఒక స్పూను తేనె ను కలుపుకుని సేవించాలి. ఇలా రోజు చేసినట్లయితే నెల రోజులు తర్వాత మనకి హిమోగ్లోబిన్ మరియు ఎర్ర రక్త కణాల సంఖ్య బాగా పెరుగుతుంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి