Bhagyamati ✍️
Anil సౌజన్యంతో...
సింధూ ప్రజలు పండించిన గోధుమ, బార్లీ, వరి తదితర పంటలు ఇప్పటికీ... మన వ్యవసాయ రంగంలో ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి.
వారు పూజించిన స్త్రీ దేవతలు 'ఆదిశక్తి' గా... పశుపతిని 'శివుని'గా... వృషభాన్ని 'నంది'గా... ఆరాధిస్తూనే ఉన్నాము. 'లింగ పూజ', 'అమ్మ తల్లి' ఆరాధన, శక్తి ఆరాధన, నాగపూజ, రావిచెట్టు పూజ... ఈనాటికీ భారతీయ సమాజం పై ప్రభావాన్ని చూపుతున్నాయి. అప్పటికి, ఇప్పటికీ...పూజించే పద్ధతులు మారాయే తప్ప, ఆరాధించే దైవాలు మాత్రం మారలేదు.
హిందీ లో 'మొహెంజొధారో ' సినిమా ని చూస్తే... సింధూ నాగరికత కళ్ళ ముందే జరుగుతున్నట్లు అనిపిస్తుంది. గ్రీకు శిల్పంలా... హృతిక్ రోషన్, అందమైన దేవతలా... పూజా హెగ్డే, కనులకు ఇంపుగా ఉంటారు. మళ్ళీ మళ్ళీ ఆ సింధూ ప్రజలు గుర్తుకు వస్తూనే ఉంటారు.
ఆ కాలంలో వివిధ జాతుల వారి మధ్య సాంస్కృతిక ఏకతా, పరస్పర గౌరవ భావాలు, ఈనాటికీ... భారతీయ సమాజంలో ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
భారతదేశంలో 'భిన్నత్వంలో ఏకత్వం' అనేది సింధు నాగరికత కాలం నాటి నుంచే కొనసాగుతుంది అని చెప్పటానికి ఇదే మంచి ఉదాహరణ.
వీరి ఇంటి నిర్మాణాలు... వరండా చుట్టూ గదులు, గృహాల్లో బావి సౌకర్యం, వరదల తాకిడిని తట్టుకోవడానికి ఇళ్లను ఎత్తైన వేదికలపై రక్షణ కొరకు నిర్మించుకోవడం, ఇళ్ళ ముందు భాగంలో తొట్టెలు, ఇంటి చుట్టూ ప్రహరీ నిర్మాణ వ్యవస్థ... గుజరాత్ లోని కొన్నిచోట్ల ఇప్పటికీ... పాటిస్తూనే ఉన్నారు.
మొహంజదారో లో లభ్యమైన కంచు నాట్యగత్తె విగ్రహంలో వలె భారతీయ స్త్రీలు హారాలు, గాజులు ఇప్పటికీ ధరిస్తూనే ఉన్నారు మరియు పురోహితుని విగ్రహం లోని వేషధారణను, ఈనాటికీ మన పురోహితులు పాటిస్తూనే ఉన్నారు.
'ఫ్యాషన్ ప్రపంచం' లో ప్రతి 20 సంవత్సరాలకి ఒకసారి ఫ్యాషన్ మారుతూ ఉంటుంది అంటారు!. కానీ... సిందూ నాగరికత కాలం నాటి ఫ్యాషన్ ఇప్పటికీ... కొనసాగుతూనే ఉంది., అంటే ఆశ్చర్యం!.
హరప్పా ప్రజలు మరణించిన వ్యక్తిని పూడ్చి పెట్టడం, తలను ఉత్తరం భాగంగా ఉంచి ఖననం చేయడం, మృతకలేబరాలను చక్కపెట్టలో పెట్టి ఖననం చేయడం మరియు అందులో... నిత్యజీవితంలో ఆ మనిషి ఇష్టపడే వస్తువుల్ని ఉంచడం వంటి పద్ధతుల్ని భారత ఉపఖండం లో... కొన్ని ప్రాంతాల్లో... ఇప్పటికీ పాటిస్తూనే... ఉన్నారు.
వీరు ధాన్యాల నిలువ కోసం దాన్యాగారాలు నిర్మించారు. వీటినే నేటి కాలంలో 'కోల్డ్ స్టోరేజీ' లుగా నిర్మించి ధాన్యాలను, పండ్లను నిల్వ చేస్తున్నాము. సింధు నాగరికత చేసిన దిశా నిర్దేశాలు. ఇళ్ళ నిర్మాణంలో కాల్చిన ఇటుకల వాడటం... కృత్రిమ ఓడరేవులు నిర్మించడం...
Excellent description about Sindhu nagarikatha
రిప్లయితొలగించండిThank you mam. I have been studying for group-1 and this information is so useful for the exam.great job 👍
రిప్లయితొలగించండిExplained very well about IVC tradition..... will follow our future generations also....
రిప్లయితొలగించండి