ఒకరోజు యమధర్మరాజు హుటాహుటిన తన అకౌంటు పుస్తకాలు అన్ని తీసుకొని ద్వారక బయలుదేరాడట. ఎందుకంటే? కృష్ణునికి తన పుస్తకంలోని నియమ నిబంధనల గురించి వివరించి చెబుదామని. కృష్ణ భగవానునితో ఇలా అన్నాడట పరమాత్ముడైన కృష్ణుడు, నేరాలను క్షమిస్తూ పోతూ ఉంటే, ఇక పాపులెవరు ఉంటారు? నాకు యమపురిలో స్థానం ఎక్కడిది? కనుక ఈ అకౌంట్ పుస్తకాలన్నీ మీ వద్దనే ఉంచండి, ఇందులో ఈ భూమిపై జీవించే అన్ని రకాల జీవరాశుల కర్మలు, కర్మ ఫలాలు రాయబడ్డాయి, ఇది మీతోనే ఉంచండి., అని నిష్టూరంగా అన్నాడట.
తన అందమైన చిరునవ్వుతో 'కన్నయ్య'., యమధర్మ రాజా! నీ బాధకు కారణం ఏమిటో చెప్పవయ్యా? అన్నాడట. కృష్ణా! పేదవాడు ఆకలి కోసం తప్పులు చేయాలి, ఆ కర్మ ఫలాలు అనుభవించడానికి చనిపోయాక, మా యమపురికి రావాలి. అటువంటిది భగవంతుడైన నీవు ఈ నియమ నిబంధనలకు విరుద్ధంగా పాపులందరినీ క్షమిస్తూ పోతూ ఉంటే, అందరూ నీ వైకుంఠం పోయే వారే తప్ప నా యమపురికి వచ్చేవారు ఎవరు స్వామి? అన్నాడట!.
పేద బ్రాహ్మణుడైన 'సుధామ' కృష్ణుని చిన్ననాటి స్నేహితుడు. కడు పేదరికంతో జీవనం సాగించలేక, తన భార్య సలహా మేరకు అభిమానం చంపుకొని, తన బాల్యమిత్రుడైన 'ద్వారకాపతి' శ్రీకృష్ణుని సాయం కోసం వచ్చాడు. స్నేహితులిద్దరూ... ప్రేమ భరిత హృదయాలతో కౌగిలించుకుని కన్నీటి పర్యంతమైనారు. మిత్రుని పాదాలను కడిగి అతిధి మర్యాదలతో సతి సమేతంగా గౌరవించాడు, కృష్ణ పరమాత్ముడు. అతను ప్రేమగా అందించిన అటుకులను భుజించారు, ఆ దంపతులు.
ఇదంతా అర్థం కాని యమధర్మరాజు కృష్ణుని చర్యను తప్పు పట్టడానికి బయలుదేరాడు. సుధామా ను భాగ్యవంతునిగా ఎలా చేస్తారు? అతను దురదృష్టవంతునిగా అనగా 'shrikshay' గా... నా పుస్తకంలో రాసి ఉన్నది అనగా జన్మంతా 'అభాగ్యునిగా దరిద్రంలో జీవించాలని' అర్థం,
అన్నాడు. అందుకు బదులుగా కృష్ణుడు మరలా పుస్తకాన్ని చూడు, యమా! అది 'yakshasri' అని స్వయంగా మార్చి వేశాడు. అనగా భాగ్యవంతుడు అని అర్థం, అని కృష్ణుడు బదులిచ్చాడు.
సుధామ అయినా, భక్తులమైన మనమైనా ఆ పరమాత్మునికి స్నేహితులమే. ఆయన మనలను ఎంత కష్టంలో కూడా చేయి విడనాడడు. ఎన్నో ఏళ్ల తర్వాత కలిసిన సుధామా లో ప్రేమను, కృష్ణుడు ఎలా హృదయపూర్వకంగా స్వీకరించాడో, అలానే తన భక్తుల పరిచర్యలో ప్రేమానుభూతిని పొందుతాడు. "పుట్టించిన వాడు గిట్టేదాకా... గట్టెక్కిస్తూనే ఉంటాడు".
Bagundi😍
రిప్లయితొలగించండిThank u dear
రిప్లయితొలగించండి