మౌనమేలనోయి పరి పరి విధముల కదిపిన, పలుకవు, ఉలుకవు. పదములు పాటగా కూర్చిన, చేర్చిన, పెదవిని విప్పవు, బదులును చెప్పవు. ఎదలో మాటను ఎదురుగా చెప్పిన, ఎర్రని కన్నులు ఎదుటగా నిలిచిన, ఎందులకడగవు, ఏమని పలుకవు. ఎగిరే పిట్టగ రెక్కలు కట్టుకు కాలిని మొక్కిన దిక్కును చూపవు అక్కున చేరవు. పక్కన నవ్విన వెక్కిగా ఏడ్చిన నీకని కానవు. నాలో చేరవు. దిక్కులు తెలియని చుక్కను నేనై చెక్కిలి చేరిన, పక్కున నవ్వవు, కౌగిలినివ్వవు. అందం నా ప్రేమ బంధం అందానికి అందని అందమది. అతిశయమన్నను చందదది. అద్భుతమే తన సరి అన్నది. అందరికందని అందమది. చెందిన కొందరు పొందిన కనువిందు అది. గంధపు సంద్రము అందెలతాకిన ఆనందమది. బందిగ నాకు పందిరి మంచపు బంధము అయినది. తొలిప్రేమ హృదయాంతర మందిరమందున, నిదురించిన ఆశను లేపి, పెదవందిన భాసల తోడ పలికా ఒక పల్లవిగా... తడి ఆరిన పెదవుల పైన అదరామృత మందివ్వమని, అధరాదర కౌగిలి యందు...
Telugu and English writings