Bhagyamati✍️
హరిత విప్లవ పితామహుడు, భారతరత్న గ్రహీత, భారతదేశపు ఆధునిక వ్యవసాయ అభివృద్ధి విధాన రూపకర్త...
ఎం.ఎస్ స్వామినాథన్ ఈ రోజు మరణించారు.
నేడు ప్రపంచంలో గోధుమ పంటను ఉత్పత్తి చేసే దేశాలలో భారతదేశం ముందు వరుసలో ఉంది. 1960 లలో ఇదే భారతదేశం గోధుమలను, అమెరికా నుండి దిగుమతి చేసుకునేది అంటే నమ్మడం కష్టమే. గోధుమలను దిగుమతి చేసుకునే స్థాయి నుండి ఎగుమతి చేసే స్థాయి వరకు తీసుకురావడానికి కృషి చేసిన వారు స్వామినాథన్. ఈయన హరిత విప్లవం ద్వారా మనదేశంలో కొత్తరకం గోధుమ మరియు వరి వంగడాలను ప్రవేశపెట్టడం ద్వారా వరి, గోధుమ, జొన్న, మొక్కజొన్న, బాజ్రా పంటల ఉత్పత్తిని తారాస్థాయిలో పెంచగలిగారు. అందుకే ఇది హరిత విప్లవం కాదు వ్యవసాయ విప్లవం అంటారు.
1966లో ప్రారంభించిన ఈ హరిత విప్లవ ప్రభావం ఆహార ధాన్యాల ఉత్పత్తిని 81 మిలియన్ టన్నుల నుంచి ఇప్పటికీ 300 మిలియన్ టన్నులకు పెంచిందంటే ఆశ్చర్యమే. భారతదేశంలో జీవనోపాధిగా ఉన్న వ్యవసాయాన్ని, వ్యవసాయ పరిశ్రమగా మార్చింది ఈ హరిత విప్లవం.
వ్యవసాయ రంగానికి పారిశ్రామిక రంగానికి అనుబంధం పెరిగేలా... వ్యవసాయానికి అవసరమైన విత్తన, ఎరువుల, పనిముట్ల పరిశ్రమ స్థాపన దేశంలో ఊపందుకుంది. ఈ హరిత విప్లవం వ్యవసాయ రంగ అభివృద్ధికే కాదు, మన దేశంలో పారిశ్రామిక రంగ అభివృద్ధికి కూడా తోడ్పాటు చేసింది.
ఆంగ్లేయులు, మొఘలులు ఊడ్చేసి పోగా... మిగిలిన పేదరికం దేశమంతా... వ్యాపించి ఉన్నపుడు...
తిండి గింజలు దొరకక పేదవాడు ప్రాణాలు వదిలేటప్పుడు...
సరిపడా ఆహార ధాన్యాలను దేశమంతటా అందించగలిగింది., ఈ హరిత విప్లవం. సాధారణ రైతును ధనవంతునిగా మార్చి సాంఘిక హోదాను తెచ్చిపట్టింది ఈ విప్లవం.
2006లో మరల ప్రధాని మన్మోహన్ సింగ్ రెండవ హరిత విప్లవం కోసం స్వామినాథన్ కు పిలుపునంపారు. ఈసారి స్వామినాథన్ జాతీయ వ్యవసాయ కమిషన్ అధ్యక్షునిగా 'యవర్ గ్రీన్ రెవల్యూషన్' కి పిలుపునిచ్చారు. ఇందులో సేంద్రియ వ్యవసాయానికి కూడా పెద్దపీట వేశారు. బయోటెక్నాలజీ ని, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ని రైతులు ఉపయోగించుకునేలా... రైతులపై జాతీయ విధానాన్ని ప్రవేశపెట్టారు. ప్రస్తుతం వీరు.. స్వయంగా స్థాపించిన 'ఎం.ఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్' కు చైర్మన్ గా వ్యవహరిస్తూ ఉన్నారు.
Wow mam,you must be good at science👍👌.but rest in peace sir
రిప్లయితొలగించండిThank you
రిప్లయితొలగించండి