తెల్ల కాగితం తమరి పేరు రాయమని తపన పడుతోంది.
మల్లెపూలు జడన మోయమని,
జామురాతిరి కబురు పంపింది.
నిన్న మొన్న నీకోసం రాసిన కవిత తదుపరి భాగమేది? అంటోన్ది.
చల్లగాలి చెంప తాకి చిన్నగా ఏదో చెప్పి పోయింది.
నీ కనులు చెప్పిన కబురులతో నన్ను
కథలు రాయమంది.
చంద్రుడల్లే... నువ్వు మబ్బులలో దాక్కుంటే!
యెంకి లా నన్ను పాడమంది.
చంద్రవంకలో నిన్ను చూడమంది.
ఆకలైన మనసు నీ ఆచూకీ చెప్పమంది.
ఆతృతతో నా గుండె ఆగకుండా కొట్టుకుంది.
పరుగు తీసి పాదాలు అలసిపోయాయి,
పెదవులైతే... వనికి వనికి వేశారాయి.
మధువులిక నేల పొర్లి వృధా అయ్యాయి.
నిన్ను నాలో నింపుకొని బ్రతుకుతున్న,
బ్రతుకులోంచి లేచి నీ వెనకే నడిచిపోతూ ఉన్నా...
నవ్వు అయినా... కన్నీరు అయినా... సాగిపోతూనే ఉన్నా.
నిన్ను తలుచుకున్నప్పుడు రోజా మొగ్గలా ముడుచుకు పోతూ ఉన్నా...
కాలం నేర్పలేదు నాకు, కటినత్వం
నీ వైపు ఎప్పుడూ ఒంగే ఉంది నా ప్రాణం.
ఎప్పుడో ఒకసారి క్షణ మాత్రం,
నీ చూపు సోకితే చాలని,
తపియించే మనసుకు చాలు ఆ ఒక్క క్షణం.
బహుశా నీకు అది తృణప్రాయమే కావచ్చు,
నాకు మాత్రం ఒక పండుగ, గుండె నిండుగా...
నీ నీడ పడే చోట నే నిలుచున్నా,
నీ చూపు నన్ను వెతుకుతున్నా,
నీ చేయి నన్ను తాకుతున్నా,
గుండెలలో నిండుకున్న ప్రేమ కన్నులలో జారుతుంది.
ఆకలి, దాహం లేని ఈ ప్రేమ,
కన్నీటి దారలలో ఆవిరవుతుంది.
కాదని నువ్వు చెప్పిన మాట
కాకతాలీయమని తెలుసు.
నీ నిట్టూర్పు సెగ కు ఆవిరైపోయే నేను,
నీ చేదు మాటలలో చచ్చిపోతుంటాను.
నీ నీడలో ప్రేమ మేడ కట్టు కున్నాను.
అది కూల్చగలిగే చొరవ నీకివ్వను.
తొక్కి వెళ్ళిపోతావు కనుక నా దేహం అడ్డు పెట్టాను.
ఇది ఎన్ని జన్మలకైనా నీకు అలివి కానివ్వను.
నువ్వు రాజువో... రాక్షసుడివో...
నా గుండెలో బంధీ వయ్యావు.
నువ్వు తెంపితే తెగేవి కాదు ఇవి,
జన్మ జన్మల ప్రేమ సంకెళ్లు.
Thank you❤️
Bhagyamati ✍️.
చాలా బాగుంది...very nice 👍
రిప్లయితొలగించండిThank you
తొలగించండి