పచ్చని చేను పైట, పుడమి వేసింది,
వెచ్చని నీ శ్వాస, నా వయసు తడిమిన్ది.
మెరుపల్లే... నీ చూపు మెరిసింది,
జడి వాన నాలోన కురిసింది.
గాలి కైన నీ కౌగిలి ఇవ్వనంది.
ఊపిరాడనంత దగ్గరగా నా హృదయముంది.
ఆక్సిజన్ అందనంతగా...
ఒకరికొకరమే చాలును,
ప్రాణవాయువు లెందుకు?!
ఉత్త మాటల ఊసులు కాదివి,
కొత్త పాటలు రాసుకొచ్చాను.
పత్తి పూలవలే మెత్తని పదాలను,
వతైన పెదవుల మధ్య చుట్టి చుట్టి చెబుతాను.
చిత్తరువై నువ్ చూసేవేళ...
చిలిపిగా నవ్వే వేళ...
అరచేతులు అడ్డు పెట్టుకుంటాను.
బొంగరమల్లె చుట్టు తిరుగుతాను.
ఒక్క నీ నవ్వు చాలు,
పెక్కు సుఖములు నాకు,
ఒక్క నీ మెప్పు చాలు,
కోటి వరములు నాకు.
మానల్లే నువ్వుంటే...
తీగల్లే చుట్టుకుంటాను.
నిన్నంటుకుని అల్లుకొని...
పూల కిరీటమై మోస్తాను,
వసంతమై విరబూస్తాను,
సిశిరమై పాదమంటుతాను.
నీ నఖ సిఖము నేనొక్కదాన్నే...
నోము నోస్తాను,
పూజ చేస్తాను.
ఈ జన్మ చాలదు నాకు,
నీ రూపు చూచుటకు.
మరు జన్మ కోరు కోను,
నీలోనె కరిగిపోదును.
గుండె మోయలేని ప్రేమ నాది,
లోన దాచలేను, వెలికి తీయలేను.
మాటలెరుగని పసి పాపను!.
నా గుండె చప్పుడు ఎప్పుడూ...
నీకై కొట్టుకుంటుందని,
నువ్వు నా ప్రాణమని,
ప్రతి రక్తపు బొట్టుకు చెప్పుకుందని,
కవితలల్లి కథలు రాశాను!.
కాగితాల పైనే... ఈ ప్రేమ కబురులు,
నీకు చూపకుండానే... దాచుకున్నాను.
నీ వలపు నిండిన తలపులు చాలును,
నీకై పిలుపునైనా ఇవ్వబోను.
మనసంటిన నీ పాదము చాలును,
మురిసిపోదును, మైమరచిపోదును.
అడుగులద్దిన చోటునే ఆగిపోదును,
అక్కరుండదు నాకిక ఏ బంధము.
Thank you😍
Bhagyamati✍️.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి