కనుల వాకిటే కాపురముంటావు,
కళ్ళు మూస్తే మాయమవుతావు.
నల్ల మిరియాల కన్నులోడా...
నమిలేటట్టు ఏం చూస్తావు?
నూరి నూరి కారమంతా...
నా కనులు ఎర్రగ చేస్తావు.
కలలోనే గమ్ముగుంటావు,
కళ్ళ ముందుకొస్తే కసిరి కొడతావు.
కస్సు బస్సులతోనే కాపురముంటావు.
చింత చిగురులా చిలిపి పిల్లనోయి
చిగురుమావిలా కందిపోతనోయి.
నీ సొగసు చూపులో కరిగిపోతనోయి.
చిలిపి కబురులింక చెప్పఓయి.
కసిరినా యిసిరినా నీ ఆలినే నేను,
నీ పిసరంత నవ్వు కోసం ఆశపడతాను.
అసలేది? సిసలేది? మన మధ్య,
కొసిరి కొసరి ఇచ్చే ముద్దు కన్నా!
ఎంతేసి మాటలన్నా...
ఇంతలోనే శాంత మయ్యే...
నీ చూపు కన్నా ఏది మిన్న!
పైకిలేచే పౌరుషాలు ...
నీ ముక్కు చివరే ఉంచవోయి.
అవి తాకే లోపే నే పారిపోతాను,
నీ మీసమెంటే నడిచిపోతాను,
నీ పెదవి పైనే నిదుర పోతాను.
పొద్దు పొడిచేది నీ పెదవిపైనే,
ఒద్దికుండేది నీ గుండె పైనే.
వద్ద కొచ్చే ప్రేమను నేను,
వద్దు అంటే వెడలి పోను.
దిద్దరాని తప్పులు చేసినా...
సుద్దు బుద్దులు నేర్పుతాను,
ముద్దు మోమొలో ముంచుతాను.
వేడి చందమామవు నువ్వు,
వెచ్చగా ఉరిమేవు.
పూలు పుట్టే పుడమి నేను,
మత్తుగా విరిసేను.
నిన్ను హత్తుకుని ఒడిన దాచేను.
నీ కోపమోర్చే ఓపికుంది.
నీ కౌగిలోర్చే కోరుకుంది.
నా కాల మిచ్చే తీరికుంది.
ఈ జన్మమంతా నీ ప్రేమ బంధీ!
Thank you🙂
Bhagyamati ✍️.
అదిరింది ....
రిప్లయితొలగించండిThank you
రిప్లయితొలగించండిNice baagi
రిప్లయితొలగించండిThank you
తొలగించండిThank you
తొలగించండి