ఊటీ కి పోదామా, ఉసులాడుకుందామా? ఊపిరాడని చలిలో ఉక్కపోతల మవుదామా. ఉరికేటి జలపాతం లో పాల నురగలమవుదామా? పచ్చని కోనల్లో... పచ్చిక బయళ్ళలో... పక్షులమవుదామా? వెచ్చని ఊపిరిలో... నిట్టూర్చుకుందామా! కరిగి నీరై పోదామా? ఆ కాగితాల చెట్ల మధ్య కారి జారి పోదామా!
మంచుకురిసే స్వర్గసీమలో, మల్లె పూవుల మాటలు విని, మంచి గంధము చంపన పూసి, మళ్ళీ మళ్ళీ మేల్కొందామా? మేఘమడ్డుపెట్టి సూర్యుణ్ణి దాచేద్దామా, రాతిరెంట రాతిరేనని, రాదికపొద్దని గోడలపై రాద్దామా!. మంచోడు నా మొగుడు, మంచులాగ చల్లనోడని, నువ్వు నేను ఒక్కటైతే ప్రేమ ఒంటరవుతుందని లోకానికి చాటి చెబుదామా...
మరొక్కసారి పోదామా...నువ్వు నేను పోదామా. మాటలు వినపడని చలిలో, మబ్బులు వేలికందే నిశిలో.... నీళ్లలో నావ నడుపు కుందామా! ఉత్తుత్తి ఆటలాడి ఊరకనే అలసిపోదామా! ఓర కంట చూసుకుంటూ వయసు ఉడకపెడదామా! తొలిరోజు మాటల్ని గుర్తు తెచ్చుకుందామా, తొలి మంచు జడిలోన తడిసి ముద్ద అవుదామా!.
మిణుగురుల వెలుగుల్ని మైమరచి చూద్దామా! మనసులోని కోర్కెలన్ని చీకటింట్లో పెడదామా! గుడ్డి దీపపు వెలుగుల్లో గుస గుసలు ఆడుదామా! గివ్వలమై మనం గూటిలోన దాక్కుందామా! గుర్తుకొచ్చే ఆ రోజుల్ని గిచ్చి గిచ్చి లేపుదామా, శివరాతిరి జాగారం ఈరోజే చేద్దామా! శివ శివా అంటూ చలి కాద్దామా?
మేఘమొచ్చి కొండపై పడ్డట్టు, కొండచరియ విరిగి పడ్డట్టు కిందికొరిగిపోదామా? చంద్రవంక బోర్లా పడ్డట్టు మూతి ముడుచుకుందామా, చేతి గీతల్లో చక్కిలిగింత పెట్టుకుందామా? నువ్వు నేను ఒక్కటై నింగి నేలకొంచుదామా, నివ్వెరై లోకమంతా నోరెళ్ళ బెట్టేల నవ్వు కుందామా!
చిగురంత నా పెదవి ఎరుపు, చేకటింట వెలిగిస్తాను. చిగురుమావి కొమ్మపై కోయిలల్లే నువ్వు, నా చిలక పలుకుల కులుకులన్ని కునుకు తీయక వింటావా? మామిడాకుల పందిరి కింద నులక మంచమేయమంటావా! ఓయ్ అని పిలిచినా... ఓహోయ్ అని పలుకుతావా? వచ్చే పోయే మబ్బుల్ని చేతికంది ఇస్తావా? హరివిల్లు వంచి నా మెడలో మాల వేస్తావా!
నువ్వలిసిపోయిన వేళ నీ కాళ్ళు పడతాను, రోజూ కమ్మని కవితల్ని వార్చి వడ్డిస్తాను. నీ గుండె రెమ్మనే కాదు, నీ కడుపు నింపే అమ్మను కూడా! నీ మూతబడని కనులకి జోలపాట పాడుతాను. రాతిరంతా... నిదుర కాస్తాను. నిన్నే చూస్తూ, నీకోసమే రాస్తూ, నువ్వే నేనుగా బతుకుతాను.
Thank you 💞
Bhagyamati ✍️
Super 👍
రిప్లయితొలగించండిThank you
రిప్లయితొలగించండినాన్న గురించి రాశారు, హస్బెండ్ గురించి ప్రతి సారి రాస్తున్నారు.. కానీ ఆడపిల్లకి అమ్మతో అనుబంధం ఎక్కువట అని అంటుంటారు.. మీరు అలా ఎప్పుడూ అలా రాయలేదేమి..?
రిప్లయితొలగించండిFor sure, thank you
తొలగించండి