తామర తూడులా తేమగా తేలేటి దరహాసం,
చీమలు పట్టిన చక్కెర ముక్కలా... నువ్ నా కోసం.
దట్టమైన పొగమంచు నవ్వు...
దక్కెను నా కంటికే నువ్వు.
మొనదేలి కనుగీటే కనుబొమ్మలు,
కొడవలి కత్తుల మీసాలు,
మసక మబ్బుల ముంగురులు...
అరవిచ్చి పద్మం అతనినే చూసేను,
అరమోపెడు కన్నులతో తల నేల వాల్చేను.
తనువై నేను తపసు చేసేను,
తపోవనం బగ్గున మండేను.
సుకుమారమైన అతని చెక్కిళ్ళు,
సుధలు కారేటి పెదవులు,
సుందరమతని అందం,
చంద్రుని కన్నా మధురం.
సువిశాల జగతి నందు...
అందానికి తానొక్కటే సవివరమైన సమాధానం,
అతని పేరు మాత్రమే నా గొంతు గర్వం.
కావాలనే కలలు కంటాను,
అతని రూపుని.
కాగితపు పడవనై ఈదుతాను,
నా కంటి సరోవరాన్ని.
నిశబ్దపు ఏకాంతంలో వింటుంటాను,
అతని గుండె చప్పుడుని.
నివేదిస్తుంటాను నిమిష నిమిషమూ నా ప్రేమని.
నీది కానిదేది నా యందు లేదని,
నీవే నా సర్వాంతర్యామివని,
నిరూపించుకుంటాను ప్రతి జాముని.
వదులు కురులను సవరించే నీ వేళ్ళు,
గుటకలు వేసేను నా గొంతు గదులు.
నీ మోహమనే... ఈ స్నేహమ్,
నా స్థితిగతుల నేమార్చు.
నా గుండె జతులనే... మార్చు.
మోయజాలని భారమతనిపై ఈ మోహం,
నా మూగ ప్రేమకది తార్కాణం.
చూడజాల మెన్నడూ...
ఈ శరత్ చంద్రుని సోయగం,
హంసలీదేను సరస్సని,
అతని మందహాసం.
సొగసు మీటేటి ఇంద్ర ఛాపం.
ఒడ్డు దొరుకదు వయసుకిక,
ఒడ్డింపుల విస్తరతడు.
గడ్డి పూవునై నేల బారున పూసి,
ఇక పదములద్ది పుణ్యమేదో చేస్తాను.
Thank you 🥰
Bhagyamati✍️
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి