ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

నీ నవ్వుల సవ్వడి ఎక్కడయ్యా?

 సెలయేటి గలగల లలో నీ నవ్వును వింటున్నాను, గులక రాళ్లపై పారేటి స్వచ్ఛమైన నీళ్లలో... నీ కళ్ళను చూస్తున్నాను. రెపరెపలాడే తుమ్మెద రెక్కల్లో... నీ కంటి రెప్పలను, రంగుకోక కట్టిన సీతాకోకలో... నీ పెదవి ఎరుపును చూస్తున్నాను. నిగనిగలాడే ముత్యపు ఛాయను నీ నవ్వులో చూస్తున్నాను.


చిగురుటాకుల మధ్య దాగిన చిన్ని పూవులా... నీ పెదవుల మధ్య ఆ చిరునవ్వుని చూస్తున్నాను. నీ చిన్ని అడుగులు తాకిన నేలపై నేను కుంకుమ అద్దుకుంటున్నాను. నీ చేతి వేళ్లపైన చిట్టి వెంట్రుకలను నా శ్వాసతో  ఆడుకుంటున్నాను. నీ కోర మీసపు కొనలను నా వేళ్ళతో చుట్టి, సంపెంగ చమురులద్ది సరసమాడుతున్నాను. కొంటె కబురులు చెప్పే నీ మెడ వంపులో నా పెదవులు అద్ది పెట్టుకున్నాను. నీ వొంపులు తిరిగిన బుజముపై, నా చంపలనానించాను. నీ నవ్వుల విరజాజులు, విడివడి, నా జడపై జారి... మరికొన్ని నా మెడలో మాలై... పూల వానై...కురిసి తడిసిపోతుంటే... ఆ గాలివానలో కొట్టుకు పోతూ... సాయం కోసం నీ చేయి నందబోతే, నీ జాడలేదు. ఈ జడివాన ఒక కల్లబొల్లి స్వప్నమేనా! నే మీననై ఈదింది ఈ కలల కొనేటి లోనా...

సాయంత్రపు గాలులొచ్చి నీ పేరు నడిగితే... నా పేరే పెదవులపై పలుకమన్నాను. కొంగుచాటు కనులు దాచుకుని, వేకువొచ్చే దాకా... వేలికొనలతో... ముగ్గులేస్తూ ఉన్నాను. మిణుకు మిణుకుమనే తారలను కునుకు తీయక చూస్తున్నాను. కలువల కన్ను గీటే చందమామను నీ కబురులు అడుగుదామంటే... అసూయ పడతాడని అడగలేదు. చెట్ల నీడలో ఆడుకునే ఎండుటాకుల చప్పుడు మాత్రమే వినిపిస్తోంది. నల్ల కలువల కళ్ళు ఎరుపు నులుము కుంటున్నాయి. నిర్మలమైన ఆకాశం నిట్టూర్పులు వదులుతోంది. చీకటి అలుముకున్న నేలంతా... చిక్కగా నన్ను చుట్టుకుంది. చుక్కలన్నీ చెల్లచదురై నీ నవ్వు కోసం నిక్కి ఏడుస్తున్నాయి. 

ఎక్కడయ్యా ? ఓ చక్కనయ్యా... కొంచెం దరికి రావయ్యా. ముక్కలైన భూమిని కొంచం నయం చేయవా? నీ అదరాల దవాఖానాలో కొన్ని మధురాల మందులిచ్చి ఆదుకోవాయ్యా... పాపం, కాస్త పుణ్యం చేసుకొనివ్వు ప్రకృతిని, నీ నవ్వులో కొన్ని ముత్యాలను ఏరుకుని తన సాగర గర్భంలో దాచుకోనివ్వు. నీ నవ్వు, రత్నాల గని కాదా? కొన్ని భూగర్భంలో దాచుకోనివ్వు. పొగరుబోతువేలే... కానీ కొంచెం కరుణ చూపవయ్యా... 


Thank you 😊,

Bhagyamati ✍️.

కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఇది యుగాలనాటి ప్రేమ!.

 రాధంటే... ఉత్తదేహం కాదు, ఉత్త మనసే కాదు, రాధంటే ఆత్మ. కృష్ణుని ప్రేమలో లీనమైన ఆత్మ. ప్రపంచానికి అర్థం కాని ఎన్నో విషయాలలో వీరి ఇరువురి ప్రేమ కూడా ఒకటి. వీరి శృంగారం మానసికమే! కానీ ఆత్మసంబంధం. ఏ ప్రేమ కథకైనా వీరే ఆదర్శం. ప్రేమ యొక్క గొప్పతనం పట్టాలంటే... కథలో చిత్రించే పాత్రలను రాధాకృష్ణలను ఊహించే రాయాలి. కృష్ణుని పై ఆశలు రేకెత్తించుకొని మనసును కృంగ దీసుకున్న రాధ ప్రేమ లోంచి విరహం అనే పదం పుట్టుకొచ్చిందేమో?! ప్రేమంటే మనసంతా కాముఖత్వం పులుముకోవడం కాదు, దేహవసరాలను తీర్చుకోవడం కాదు, ప్రేమంటే విశాలత్వం, దైవత్వం, విరహం, తపన, వేదన, ఎడబాటు, త్యాగం, కృష్ణుని రూపు కోసం పరితపించే రాధ దినచర్య. అందుకే రాధాకృష్ణుల ప్రేమ ఉత్త ప్రబంధ కథగా కాకుండా... యుగాలు చెప్పుకునే గొప్ప ప్రేమగాధ గా మిగిలింది. ఒక ప్రేమ కథను పైకెత్తి ఆకాశంలో ప్రవేశపెట్టాలన్నా... ఒక ప్రేమ గీతాన్ని, స్వర్గాన్ని తాకేంత ఆనందంగా ఆలాపించాలన్నా... రాధాకృష్ణుల ప్రేమే ప్రేరణ. ఇంత గొప్పగా మనం ప్రేమించాలంటే రోజు మనసుకి మెదడుకి మధ్య దేవాసుర యుద్ధమే జరుగుతుంది, అయినా నిలబడితేనే ప్రేమ గెలుస్తుంది. ఇక్కడ గెలవడం అంటే ఇద్దరు పెళ్లి చేసుకొని జీవి...

నా మొదటి ప్రేమ... మా నాన్న!

  ఒక అమ్మాయి ఏ వయసులో అయినా ఉండొచ్చు కానీ ఆమె ఎప్పటికీ తన తండ్రికి చిన్ని యువరాణిగానే ఉంటుంది.  తండ్రీ కూతుళ్ల మధ్య ఉన్న ఈ ప్రత్యేక బంధం... ఆరాధ్య బంధం!.  ఒక తండ్రి తన కూతురిపై ఉంచే హద్దులు లేని ప్రేమ ఎప్పటికీ తిరిగి చెల్లించలేనిది.   బెస్ట్ ఫ్రండ్ తో షాపింగ్:  నేను రత్నం జూనియర్ కాలేజి లో చదివేటప్పుడు కాలేజి వ్యాన్, ఇల్లు తప్ప ఏం తెలియదు. డిగ్రీ కి వచ్చాక న బెస్ట్ ఫ్రెండ్ శ్వేత తో మొదటిసారి బయటకి వెళ్ళాను. ఫస్ట్ టైం వెళ్ళడం, నాన్నకి trunk road లో కనిపించాను. నా మైండ్ బ్లోక్ అయ్యి రెడ్ అయ్యి, బ్లూ అయ్యింది. మా నాన్న మాత్రం సింపుల్ గా షాపింగ్ కి వచ్చావా? డబ్బులు ఉన్నాయా? అంటూ 2000 ఇచ్చేసి వెళ్ళాడు. నాన్న అంటే అంతే మరి, నెక్స్ట్ లెవెల్.  నేను పెద్ద చిరంజీవి అభిమాని ని. నాన్న ఫస్ట్ డే ఫస్ట్ షో చిరంజీవి మూవీ కి తీసుకుని వెళ్తాడు. నేను తిరుపతి లో M.SC చేసేప్పుడు నాకోసం dairy milk బాక్స్లు కొరియర్ చేసేవాడు. చిరంజవి గ్రీటింగ్స్ పంపేవాడు. నాన్నకి నేను ఎప్పటికీ చిన్న పిల్లనే. నేను అబద్ధాలు చెప్పను. ఇప్పటికీ చెప్పను. అందుకే నన్ను మా అమ్మ, నాన్న బాగా నమ్ముతారు. నా ప్ర...

అతగాడి రూపేదని ??

 ఆ పేరు ఎవరు పెట్టారో.. కానీ, కళ్ళు మూసుకుంటే పగటిపూట సూర్యకిరణాలకు మెరిసే... పచ్చ పవిట కప్పుకున్న పైరులా... కనిపిస్తాడు. చల్లగాలి, ఏటి నీటిని తాకి తగిలినట్టు హాయిగా ఉంటాడు. నవ్వితే దాన్నిమ్మకాయ పగిలినట్టు నోటి నిండా ముత్యాల రవ్వలతో కనువిందు చేస్తాడు. మాట మాటను మంచు కప్పి చల్లగా చెబుతాడు. చెవిపై చెక్కిలిగింతలు పెడుతాడు. రూపమేమో తెలియదు నాకు?! అంతగా చూడలేదు. ఒక్కసారైనా కలవాలని కాలం తొందర పెడుతోంది. కళ్ళతో మాట్లాడుకోవాలని ఆశపడుతోంది. పరిచయమైనది కొంతకాలమైనా... ప్రేమలో అడిగిడి చాలా కాలమైనట్టుంది. ఈ మనసు గందరగోళంలో పడింది, ఆ సుందరవదనుని తలపులు తప్ప ఏ తిండి, నిద్ర వద్దంది. నక్షత్రాలను లెక్కబెడుతూ రాత్రంతా... ఎన్నో క్షణాలను భారంగా గడుపుతున్నాను. ఎప్పుడూ... మాటలు విని సంతోషపడడమే తప్ప, ఒక్కసారి కలుద్దామా? అని అడిగే ధైర్యము చనువు లేవు. కలిస్తే బాగుండు! ఆ కొన్ని గంటల్ని ఇంకొన్ని జ్ఞాపకాలుగా మలుచుకొని అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటాను. నేను అనే నా రెండక్షరాలను నీతో కలుపుకోనుగాని, నీలోని కొన్ని క్షణాలను నాలో కలుపుకుంటాను. వెన్నెల వెలుగుల్లో నిన్ను చూసి నాలోని చీకటిని తరిమేసుకుంటాను. నా గుండె నిండ...