ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

2024లోని పోస్ట్‌లను చూపుతోంది

కళ్ళు కాదవి, అయస్కాంతాలు!

ఇత్తడి రేకుల్లా...దగదగా మెరిసే కళ్ళున్న ఈ పుత్తడి బొమ్మను ఎవరు చేశారో గానీ, ఆ చూపు ఒంటికి తగిలితే ఒళ్ళు జిల్లుమని వణుకు వస్తుంది. ఆ కళ్ళు అధికార చిహ్నాలేమో! ఇంత అందమైన విగ్రహానికి. ఇవి పద్మ దళాలో లేక పద్మ పత్రా లో!?నల్లని వలపు దారాలను విసిరి గుండెను చుట్టుకుంటాయి. గుమ్మంలో పడక కుర్చీ వేసుకుని పడుతులెవరైనా పోతారా? పడవేద్దామా? అని ఎదురుచూసే కుర్రాళ్ళలా... ఆ కనుల వాకిట్లోనే కౌగిలింతల చూపులు సిద్ధంగా ఉంటాయి. కాసేపు అలా చూస్తూ ఉంటే... నీటి చుక్క అగుపడని ఎడారిలా ఉంటుంది. గొంతు ఆర్చుకుపోతుంది. చలికాలం కూడా ఎండ మండిపోతున్నట్టు ఉంటుంది. నాభి నుండి పదియంగుళాల పైన నాకు పెద్దగా పనిలేని ఒక హృదయముండేది. నా శరీరంలోని జీవుడికి తప్ప నాకు పనికి రానిది. అప్పుడే ఈ ఉత్తముని చూపులు నా గుండెతో ఉత్తర ప్రత్యుత్తరాలు చేశాయి. ఏదైనను ఈ గుండెకు ఇన్నాళ్ళకి స్పందన కలిగింది. ఈ ఒక్క చూపు నా గుండెలోకి, నాడీమండలంలోకి, నా శరీరమంతా జీవం నింపింది. శ్రేష్టమైన ప్రేమను, అమృతత్వమును నింపింది, అంటే ఆజన్మాంతం సరిపడ శాశ్వత ప్రేమను నింపింది. ఇది ఎప్పటికీ విడిపోనిది అని నమ్మకం కలిగింది. అయినా ఎందరు యత్నించారో ఈ చందమామ కోసం, నా చేతు...

ఒక మహనీయుడు- నా మిత్రుడు

అతని కోసం ఏదో రాయాలని చూస్తున్నాను. నిన్న సాయంత్రం సమీరంలా వచ్చిపోయిన వాడు నేడు వస్తాడా? రాడా? అని ఎదురుచూపులతో ఈ మధ్యాహ్నం నిట్టూర్చి చల్లబడింది.  అతను కొన్ని పుస్తకాల సమూహం. కొన్ని అనుభవాల సమాహారం. ఎంత వింటున్నా ఇంకా ఏదో చెబుతూనే ఉంటాడు. ఆసక్తితో కళ్ళు విప్పారి చూస్తూ ఉంటాను. ఎవరో గొప్ప మహర్షి ఆత్మ కథ వింటున్నట్టు ఉంటుంది. నేర్చుకోదగిన విషయాలు కచ్చితంగా ఎన్నో ఉన్నాయి. ఈ విషయాలు ఏ పుస్తకాల్లోనూ దొరకవు. అతని మాటలకు కొన్నిసార్లు చిన్నబుచ్చుకున్న, అతని దృష్టితో చూస్తే ఖచ్చితంగా అంగీకరించాల్సిందే!. నిజమేనా? కాదా? అని పదేపదే అడిగి మరీ అంగీకరింప చేస్తాడు. ఇన్ని మాటలు వింటుంటే నాకు అర్థం కానిది! ఇంతకాలం నేను రాసింది ఏంటి? అని. ఇన్ని సత్యాలను మాట్లాడే నిజాయితీ అందరిలోనూ ఉండదు. అమ్మాయిలు కథల పుస్తకాలు, నవలలు చదివేటప్పుడు అందులోని నాయకుని లక్షణాన్ని చూసి అలాంటి నాయకుడే కావాలని కోరుకుంటారు. నిజ జీవితంలోకి ఆ కథలో నాయకుడే వచ్చి మరిన్ని కథలు చెబుతుంటే!!! ఇతనిలా... ఉంటాడు.  ఇతను గొప్ప రచయిత. ఇతను మాట్లాడే మాటలు, నేను ఏ పుస్తకాల్లోనూ... చూడలేదు. ఏ సినిమాలోను వినలేదు. ఈ రచయితతో అంత స్నేహం చేయ...

నా మనసు మారాజుకి...

 పసుపు గడపకు, ఎదురుచూపుల ఎరుపు రంగులద్ది, తళుకుతారల పవిట కప్పుకుని, తమరి కోసం చూస్తు ఉన్నాను. నీలిరంగు చీరపై నా నీలాల కురులు పరచి, నచ్చినవాడు దొరికాడని ఈ వెచ్చని రాతిరికి కబురులు చెబుతున్నాను. పసిడి బొమ్మగా మారి పలుకు తేనెల చిలుకనై కొత్త పలుకులు నేర్చుతున్నాను. కులుకు నగవుల బిగువులు, నుదుట కుంకుమ జిలుగులు.... నా అదురు బెదురు చూపులు, అన్నీ మీవే!. నా పెదవులపై ఒలికే ఈ మధువుల చినుకులు మీ అదరముల చేర్చే త్రోవున్నదేమో చెబుతారా?! మిమ్ము చూసిన నాటి నుంచి ఈనాటి వరకు, మీ చూపు జల్లిన సప్తవర్ణాల వానలో తడిసిపోతున్నాను. నా విశాల ప్రపంచానికి కొత్త వర్ణాల నద్దుకున్నాను. గతం తాలూకు నలుపు తెలుపుల రాతిరులు, నన్నిక గాయం చేయలేవు. మీ తీపి పలుకుల మబ్బుల తెరలు నా మనో ఆకాశమంతా పరుచుకున్నాయి. వెన్నెల్లో చిన్న పిల్లనై అల్లిబిల్లి తిరుగుతున్నాను. కళ్ళకపటమెరుగని మీ మనసు నాకు కమ్మని కథలు చెప్పింది. మీ మాటల్లోని నిజం, నా మనసు గాయాలపై మందు పూసింది. కళ్ళముందు మీరున్నట్టు కొత్తగా ఏదో రాయమంది.  నా కళ్ళ ముందటి ఆ రూపుని నేను మరువనే లేదు. మసకగానే మోసుకొచ్చిన కొన్ని రూపురేఖలను మళ్లీ మళ్లీ తలుచుకుంటూ వెన్నెల పేరు పెట...

అతగాడి రూపేదని ??

 ఆ పేరు ఎవరు పెట్టారో.. కానీ, కళ్ళు మూసుకుంటే పగటిపూట సూర్యకిరణాలకు మెరిసే... పచ్చ పవిట కప్పుకున్న పైరులా... కనిపిస్తాడు. చల్లగాలి, ఏటి నీటిని తాకి తగిలినట్టు హాయిగా ఉంటాడు. నవ్వితే దాన్నిమ్మకాయ పగిలినట్టు నోటి నిండా ముత్యాల రవ్వలతో కనువిందు చేస్తాడు. మాట మాటను మంచు కప్పి చల్లగా చెబుతాడు. చెవిపై చెక్కిలిగింతలు పెడుతాడు. రూపమేమో తెలియదు నాకు?! అంతగా చూడలేదు. ఒక్కసారైనా కలవాలని కాలం తొందర పెడుతోంది. కళ్ళతో మాట్లాడుకోవాలని ఆశపడుతోంది. పరిచయమైనది కొంతకాలమైనా... ప్రేమలో అడిగిడి చాలా కాలమైనట్టుంది. ఈ మనసు గందరగోళంలో పడింది, ఆ సుందరవదనుని తలపులు తప్ప ఏ తిండి, నిద్ర వద్దంది. నక్షత్రాలను లెక్కబెడుతూ రాత్రంతా... ఎన్నో క్షణాలను భారంగా గడుపుతున్నాను. ఎప్పుడూ... మాటలు విని సంతోషపడడమే తప్ప, ఒక్కసారి కలుద్దామా? అని అడిగే ధైర్యము చనువు లేవు. కలిస్తే బాగుండు! ఆ కొన్ని గంటల్ని ఇంకొన్ని జ్ఞాపకాలుగా మలుచుకొని అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటాను. నేను అనే నా రెండక్షరాలను నీతో కలుపుకోనుగాని, నీలోని కొన్ని క్షణాలను నాలో కలుపుకుంటాను. వెన్నెల వెలుగుల్లో నిన్ను చూసి నాలోని చీకటిని తరిమేసుకుంటాను. నా గుండె నిండ...

ఇది యుగాలనాటి ప్రేమ!.

 రాధంటే... ఉత్తదేహం కాదు, ఉత్త మనసే కాదు, రాధంటే ఆత్మ. కృష్ణుని ప్రేమలో లీనమైన ఆత్మ. ప్రపంచానికి అర్థం కాని ఎన్నో విషయాలలో వీరి ఇరువురి ప్రేమ కూడా ఒకటి. వీరి శృంగారం మానసికమే! కానీ ఆత్మసంబంధం. ఏ ప్రేమ కథకైనా వీరే ఆదర్శం. ప్రేమ యొక్క గొప్పతనం పట్టాలంటే... కథలో చిత్రించే పాత్రలను రాధాకృష్ణలను ఊహించే రాయాలి. కృష్ణుని పై ఆశలు రేకెత్తించుకొని మనసును కృంగ దీసుకున్న రాధ ప్రేమ లోంచి విరహం అనే పదం పుట్టుకొచ్చిందేమో?! ప్రేమంటే మనసంతా కాముఖత్వం పులుముకోవడం కాదు, దేహవసరాలను తీర్చుకోవడం కాదు, ప్రేమంటే విశాలత్వం, దైవత్వం, విరహం, తపన, వేదన, ఎడబాటు, త్యాగం, కృష్ణుని రూపు కోసం పరితపించే రాధ దినచర్య. అందుకే రాధాకృష్ణుల ప్రేమ ఉత్త ప్రబంధ కథగా కాకుండా... యుగాలు చెప్పుకునే గొప్ప ప్రేమగాధ గా మిగిలింది. ఒక ప్రేమ కథను పైకెత్తి ఆకాశంలో ప్రవేశపెట్టాలన్నా... ఒక ప్రేమ గీతాన్ని, స్వర్గాన్ని తాకేంత ఆనందంగా ఆలాపించాలన్నా... రాధాకృష్ణుల ప్రేమే ప్రేరణ. ఇంత గొప్పగా మనం ప్రేమించాలంటే రోజు మనసుకి మెదడుకి మధ్య దేవాసుర యుద్ధమే జరుగుతుంది, అయినా నిలబడితేనే ప్రేమ గెలుస్తుంది. ఇక్కడ గెలవడం అంటే ఇద్దరు పెళ్లి చేసుకొని జీవి...

ఇది స్వప్నమా?! లేక సత్యమా?

 నీ తలపుల వానలో... తడిచిన దేహము, వలపుల పువ్వులు విచ్చిన మోహము, ఇహము - పరము లేవన్నవి. ఈవల- ఆవల వద్దన్నవి. వెయ్యి కలువలు ఒక్కసారి విచ్చినట్టు, వేయి కన్నులు ఒక్కసారి తెరిచినట్టు, ఆ జిలుగుల వెలుగుల చూపులు, నా ముందట మెరిసిన క్షణమున, నా గుండె దొర్లి, పొంగిపొర్లి, ఎటువైపు వెళ్లిందో తెలియదు! నీకు కనిపిస్తే తెచ్చి ఇవ్వు. వద్దులే! నీచోటే... ఉండనివ్వు. విరజాజులు కొమ్మ పై ఆడే సరసాలు చూస్తూ... మన మధ్య సాగిన సల్లాపాలను గుర్తు తెచ్చుకుంటున్నాను. నీ విసురులు, కసురులు, ముసి ముసి నవ్వులు, కసి తలపుల కన్నులు, వశ మగు చూపులు, నా ఉసురు తీసి వెళ్లినవని ఈ నిశి రాతిరికి చెప్పుకుంటూ ఉన్నాను. ఆ రోజు నుంచి ఈరోజు దాకా ప్రతి మాటను, గడియారానికి అప్ప జెబుతున్నాను. గడిచిన గడియ గడియను, గడియలో ప్రతి నిమిషమును, నిమిషములో ప్రతి సెకనును, క్షణకాలమైనా... నిన్ను చూడక రెప్ప వేసానా? ఆ కనురెప్ప పాటులో... నీ కదలికను కోల్పోయానా?! గంధర్వ కన్య నైనా కాకపోతిని! రెప్పవేయని వరముండేదని. నీ అరుణ వర్ణపు అధరములను, అవి గాంచి పైన వేసుకున్న బిడియపు తెరలను, నీ భుజములపై వాల్చిన ముఖమును, మన వెచ్చని చేతుల కౌగిలిలో వచ్చిన స్వేదమును, మన మనసులో మా...

నా శ్రీరాముని కోసం🙏

 ఆ విశ్వరూపుని గుణగణాలను వెల్లడించే... వేయి నామాలను, గుండెలో ప్రతిధ్వనించుకుంటూ... ఈ విష్ణు సహస్రనామం చదువుతున్నాను. ఇది నా రాముని కోసం, నా దేవుని కోసం. జగత్ ప్రభువైన ఈ భగవానుడు నా కనుల ముందే అగుపించుచున్నాడు. ఈ ధ్యానంలో... మౌనముద్రలో... అతి సుందరమైన అతని నిజరూపును, చిరునగవును చూసిన ప్రత్యక్ష సాక్షిని నేను. దేవునితో నాకు గల సంబంధాన్ని, సమన్వయాన్ని ఉదాత్తంగా రాసుకుంటున్నాను. ఇందులోని ప్రతి అక్షరం అతని మందహాసం నుంచి ఆవిర్భవించినవే!!. నిలకడ చూపుల వాడు, నిర్మల నేత్రముల వాడు,  నవనీతము వంటి దేహము కలవాడు, నిరాడంబరుడై... నింగి వరకు ఎత్తైనవాడు.... ఈ సర్వేశ్వరుడు. గేయమై, గీతమై, నా గొంతులో గానమై, ప్రతి వాక్కును నాతో ఇలా రాయిస్తూ ఉన్నాడు. ఇతని అసమాన్యమైన కథ సామాన్యులకు అంతుపట్టదు. ఈ రాముని చిరంతర సిద్విలాసాన్ని, శ్రేష్టంగా భావించి ఆంతర్యం గ్రహిస్తే తప్ప పూర్తిగా బోధపడడు.  భగవద్గీత సారాంశాన్ని గ్రహించిన వారికి తెలుస్తుంది శ్రీకృష్ణుడితో అర్జునుడికి గల బాంధవ్యము, సఖ్యము, సాహద్యము, సారథ్యము. అదేవిధంగా మనము కూడా ధన్యజీవులను కాగలము. దేవుని యొక్క మమతకు లోబడి ధర్మనిరతిని పాటించిన వారికి, అత...

ఓ చూపు చాలు మన్మధుడా!

 నిన్ను చూసిన క్షణం నుంచి గుండెలో అలజడి, జలజల జలపాతమై మెదడు నుంచి అరికాలుకు ప్రవహిస్తోంది. పుష్పక విమానమై పుడమి అంతా నన్ను తన ఒడిలో దాచుకుంటోంది. మృదుస్వరంతోపాటు రిథమిక్ గా సాగే సంగీతం...., బిగబట్టిన ఊపిరిని తేలికగా వదులుతూ... అతనికేసి చూశాను. మరింతగా ఇంకొంతగా ఆ కళ్ళలో... ఆ కనుల కౌగిళ్ళలో ఒదిగి పొమ్మని మనసు చెబుతోంది. చుట్టూ ఉన్న వాతావరణం ఒక్కసారిగా వెచ్చబడిపోయింది. స్వేద బిందువులు ముఖంపై ఆవిర్భవించాయి. నా కనురెప్ప చాటులో నీతో కాపురం ఉండే నేను, నీకనుచూపు సోకగానే... కరిగి మాయమైపోయాను. చలికి వనికే చిగురుటాకుల పెదవులను అరచేతులలో అదిమిపట్టుకున్నాను. సిగ్గు మోయలేక రెప్పులు వాలిపోతుంటే, అరవిరిసిన కన్నులతో ఏదో అంతరార్థాన్ని అలవికాక నీకు ఏలానో... చెప్పుకున్నాను. అల్లంత దూరంలో నిన్ను చూసినప్పుడు అగుపించని ఈ సిగ్గు, ఇప్పుడిప్పుడే అడుగులు నేర్చుకుంటోంది. నీ వెలుతురు నిండిన కన్నులు జల్లే వెలుగుల రేఖలు, నన్ను కాల్చి బూడిద చేస్తున్నాయి. పరిహాసమా నీకు ఈ ప్రణయ ప్రళయము!. వెన్నులో వచ్చే ఈ భయాన్ని మిన్నుకేసి చూసి ఆపుకుంటున్నాను. దొరికిపోవడం ఇష్టమే ఇలా నీ కళ్ళకు. కానీ సిగ్గులో దొర్లిపోతూ... ఎలా చెప్పు...

రెండు గుండెల దూరం

 ఇద్దరం కలిస్తే నిండు పున్నమిలా ఉంటుంది. అందుకే విధికి అసూయ పుట్టి అప్పుడప్పుడు దూరం చేస్తుంది. కనుమరుగైన వాని కథలు రాస్తూ... కనిపించక పోతాడా అని కూనిరాగం తీస్తూ... ఈ కవ్వింపుల సవారీ చేస్తుంటాను, ఈ గతం తాలూకు గమనంపై, నా కలం తాలూకు కవనంపై. ఏ నందనం నుండి ఈ నారు తెచ్చుకుని నాటుకున్నానో... నా హృదయ మందిరమంతా... అతని పూజా మందిరమైంది. ఈ వికశించిన పూవుల తీరులో... ఈ తియ్యనిదనం, అతను నింపి వెళ్ళినదే. వెన్నెల వెలుగులు, రవిబింబ దీప్తులు... అల్లంత దూరాన మెరుస్తుంటే... అతని కన్నులే జ్ఞాపకమొస్తాయి, అస్తమానం... అనుదినం.  సగం చదివిన పుస్తకంలా ఎప్పటికీ నాకు పూర్తిగా అర్ధం కానివాడు, అర్థమైతే ఆరాధించడం మనేస్తానేమోనని మధ్య మధ్యలో మాయమౌతాడు. ఈ మాయమయ్యే రోజుల్లో నా తడి రెప్పల మీద పాకేటి ఈ కన్నీటి చుక్కలు, అతని చేత పొదిగిన ముత్యాలే. వెళ్లినవాడు వస్తాడని తెలుసు. అయినా మనసు ఊరుకోదే?! వెదకడం మొదలెడుతుంది. పక్షి రెక్కలు ఛాచుకుని ఈ పచ్చని కొమ్మల మధ్య ఎగరలేక ఎగురుతుంటాను. ఎగిరేటి దూరం ఏందాకో? యదకే తెలుసు, రెక్కలకేం తెలుసు?. ఆకాశమంతా... చాచుకుని అలిసిపోయేదాక ఎగురుతాయి. అంది అందని అందమే ముద్దు అన్నట్లు, చేతి...

నిశ్శబ్దపు సంగీతం

 ఏ శూన్యం కేసి అట్లా చూస్తున్నాను? వసంతం పుష్పించడం ముగించుకొని సెలవు తీసుకుందనా? వాడిన వ్యర్థమైన పువ్వుల భారంతో గుండె చతికలబడిందనా? నిర్నిద్రమైన నీలాకాశం కళ్ళు మూసుకుని నేలపైకి కృంగి పడిందనా? ఎందుకీ నిశ్శబ్దం నాలో??? నన్ను వదిలి వెళ్లి ఏకాకైన ప్రియుడు ఈ నిర్జనమైన వీధిలో తానొక్కడే... వస్తాడని, నా ఇంటి తలుపు తెరిచి ఉంచాను. కలవలే మాయమై జారిపోతే కన్నీటిని ఎవరితో పంచుకోను? ఉండుండి తలుపు తెరిచి చూస్తున్నాను, ఈ దారిలో ఎక్కడైనా ఎదురొస్తాడని. ఈ చీకటి చిక్కుల లోతుల గుండా ఎందుకీ నిశ్శబ్దం నాలో?? చీకటి మేలి ముసుగు కప్పినప్పుడు తామరాకులన్నీ తలవంచుకొని దగ్గరగా ముడుచుకున్నాయి, నిద్ర దేవికి నన్ను అర్పించుకుందామని దుప్పటి కింద దాక్కున్నాను. అతను వచ్చి నా పక్కనే కూర్చున్నట్లు, అతని స్వరం నా చెవుల మారి మ్రోగినట్టు, అతని పరిమళం నా చుట్టూ ఆవరించినట్లు, ఆ కలలోంచి లేచాను. నాలో నన్నిలా కలవరపరిచేది వ్యదేంటో నాకు తెలియడం లేదు. మండే ఈ తపనాగ్నిలో ఎందుకీ నిశ్శబ్దం నాలో? క్షణికమైన విద్యుత్ కాంతి మేఘాలను కోసుకుంటూ మెరుపై మెరిసింది. అతని రాక కోసం రాయబారమా? ఇది. హృదయం తడుముకున్నాను. నా గదినిండా పేరుకున్న అతని ఆలో...

అతడొక హిమశిఖరం

 జీవితంలో ఒక గాఢమైన ఇష్టం కలిగినప్పుడు ఆ ఇష్టం కలిగించే తన్వయత్వమే ప్రేమ. దాని ముందు ప్రపంచంలో మరేది ఎక్కువ కాదు. ఇప్పుడు మనసు దృష్టి ఇంకా విశాలమవుతుంది. ఇంకా హాయిగా... గొప్పగా... అనిపిస్తుంది. కానీ అతను మాత్రమే కనిపిస్తుంటాడు. అతని అందం, గుణం ఆపై ప్రేమ కప్పిన మోహం. జీవితంలోని ప్రతి అడుగు, ప్రతి కదలిక అతని కోసం ఏదోక త్యాగం చేయమంటాయి. త్యాగం ప్రేమకు దర్పణం. ఒక శిల్పి తన ఉలితో చెక్కినట్టు... అందమైన ముఖం, చక్కటి కనుబొమ్మలు, కళ్ళలో నెమలి కనుల మెరుపు, తీయటి గొంతు, మాటలలో ఒక సన్నని సంగీతం. సంభాషణలో మృదుత్వం, బింకం కొంచెం కొంచెంగా తొనికిసలాడుతుంటాయి. మనసులోకి తొంగి చూసే అతని ఆలోచన తీరు, ఇంకొంచెం అతని వైపు లాగుతుంటాయి. అప్పుడప్పుడు మాటలకు దొరకక ఎక్కడో వెళ్లి దాక్కుంటాడు. ఈ చిన్ని పావురం నీకోసం ఎన్ని ప్రేమ లేఖలు రాసిందో తెలుసా? అని అడగగానే, పెదవులపై విరబూసే చిరునవ్వే సమాధానం అంటాడు. ఆవేళ అతని కనులలో మెరుపేదో కదలాడుతుంది, అది మనసుకు మాత్రమే కనబడుతుంది. ఆ నవ్వు విని సిగ్గుపడి ముఖం ఎర్రబారిపోతుంది. ఎంతో ఎడబాటు నుంచి మనసును తేలిక పరిచే సంగీతం ఆ నవ్వు. ముఖాన్ని అరచేతుల్లో దాచుకొని అద్దానికి చూపె...

అతడే కేశవుడు, అతడే నా ప్రభువు!.

 మెరుపు కొరడాలతో నల్లని ఆకాశాన్ని జులిపించి నాపై ప్రేమ వర్షాన్ని కురిపించు. నా పెదవులలో ప్రాణవాయువును నింపు. బీటలు వారిన నా హృదయంలో మెత్తని మబ్బు తరకను మొలిపించు. నా ప్రేమకాశాన్ని ఈ మూల నుంచి ఆ మూలకి మేల్కొలుపు. భరించలేని నిరాశతో ఈ గుండెను రగిలిస్తున్న అగ్నిని నీ ఊపిరితో చల్లార్చు. తల్లి కన్నీటి చూపు వంటి నీ అనుగ్రహాన్ని నాపై వర్షించు. నా పూల సజ్జలో పువ్వులన్ని నువ్వు వచ్చే తోవలో అలంకరించి ఉన్నాను. నీకోసం నైవేద్యాన్ని ముందు పెట్టుకుని కాచుకొని కూర్చుని ఉన్నాను.  నా ఈశ్వర పీఠమెక్కి పూజలు అందుకునే నీకోసం, దీపాలు వెలిగించి ఉన్నాను.  నిన్ను ఊరేగింప కోరి నా ప్రేమ రథంపై బంగారు కేతనాలు కట్టాను. వసంత మారుతంలోని పూల తీగ వలె గర్వంగా వికసించి పులకిస్తున్నాను. నీ ఆకర్షణ యొక్క వైభవాన్ని మనసు నిండా ఊరేగించుకోవాలని నీ రూపు కోసం వెతుకుతూ ఉన్నాను. సాయం సమయం, తగ్గుతున్న కాంతి లోకి వాలిపోతుంది సూర్యాస్తమయపు కడపటి కాంతిరేఖలు రాత్రిలోకి మాయమవుతున్నాయి. నక్షత్రం నుంచి నక్షత్రానికి ప్రతిధ్వనించే అతని స్వరమును వింటున్నాను. నా పేరును వింటున్నాను. సడి లేని అతని అడుగులు నా వైపే వస్తున్నాయి . అతని అ...

ఇప్పటికి మేల్కున్నావా స్వామి?!

 తడిసి నీళ్ళోడుతున్న చీర కొంగును పిండుకుంటూ... అల్లంత దూరాన ఉన్న అతనిని చూసాను. కడవ నడుముకెత్తి తిరిగి మళ్ళీ మళ్ళీ చూసాను. ఎదుట ఏటుగట్టు వెనకనుంచి చుమ్మలు చుట్టుకుంటూ... తెల్లని పొగతెరలు, చెట్ల ముసుగులు దాటి వచ్చాను.  మామిడి చెట్టు ఆకుల గుబురుల్లోంచి, సన్నగా పడుతున్న నులి వెచ్చని సూర్యకిరణాలు.... మడత మంచంపై మాగన్నుగా పడుకుని ఉన్న నా మన్మధుడు. ఓయ్... అని కేక వేయాలనుంది, వాలుగాలిలో మాట కొట్టుకుని పోదా అని ఆగిపోయాను. తడక మీద ఆరవేసిన తుండువా లాగి దులుపుదామనుకున్నాను. గడుసుదనుకుంటాడని గమ్మునుండి పోయాను. పొగమంచు మేఘాల మధ్య చాచుకునే ఉంది. పసిడి పువ్వులు నా పిరికితనం చూసి నవ్వుకుంటున్నాయి. చెట్టు కొమ్మన కౌగిలించుకున్న రామచిలుకలు నీ మాటేమిటి? అని ఆరా తీశాయి.  సరే! నడుము మీద కడవ నిలవకుంది, అతనితో గొడవ పడమంది. నెత్తిన కుమ్మరిస్తే మేలుకొంటాడుగా?! అమ్మో కయ్యాలవాడు మాటలే కట్టేస్తాడు. వద్దులే రేగిపోయిన జుట్టును ముడి వేసుకుంటూ పక్కనే ఓ పూచిక పుల్ల కోసం వెతికాను. ఈ పడుచు వాడి కలలో ఏమొస్తుందో... నిద్రలోనే నవ్వాడు. చక్కనోడు చెంప మీద చంద్రవంకలు పూచాయి. మర్రి చెట్టు కాయలు ముసిముసిగా నవ్వుతూ.....

ఒంటరైతే... ఓటమి కాదు!.

 జల్లు జల్లుగా నాపై వెన్నెల కురిపిన అతని ప్రేమని, తుల్లిపడి తన కౌగిలిలో ఒళ్ళు విరుచుకున్న రేయిని, ఒంటరితనపు సంకెళ్ళతో ఓదార్చు కుంటున్నాను. నడి రాతిరి జాములొస్తునాయి, అతని జాడలడిగి పోతున్నాయి. పొడిబారిన కన్నులు ఎదురు చూపులతో అలిసిపోతున్నాయి. తడి ఆరని చెంపలు మళ్ళీ మళ్ళీ తనకోసం తడిచిపోతున్నాయి. ఎడబాటు ఎంత గొప్పదో... కన్నీటిని ఏరై పొంగించగలుగుతుంది. వేయిసార్లు అతని మోముని తనివితీరా చూడాలని ఉంది. అరచేతులతో... తన చెంపలను తాకి నుదిటిపై ముద్దాడాలని ఉంది. నీ కనురెప్పల చాటున కలగానైన ఉన్నానా? నీ మెదడు పొరలలో జ్ఞాపకమైనా ఉన్నానా? అని మనసుతీరా అడగాలని ఉంది. ఈ రాత్రి, పగళ్ళు వస్తూనే ఉన్నాయి. నిరంతరం వస్తూనే ఉన్నాయి. నిన్ను నాతో కలపలేక దూరం నుండే వెళ్లిపోతున్నాయి. అవతలి ఒడ్డు నుంచి వచ్చే గాలి పులకరింత ఒక్కసారైనా నీ పరిమళాన్ని మోసుకురాలేకుంది. ఈ నల్లనైన నదీ తీరం నావైపు నువ్వు నడిచే తోవ కూడా మూసివేసిందా? ఈ వియోగం, ఈ అన్వేషణ... వినోదమా నీకు? నీ ఆకర్షణలో మరిగించి ఈ ఒడ్డునే వదిలి వెళ్ళిపోతావా? నాతో ఆడే ఈ దాగుడుమూతలు ఇంకెన్నియుగాలు?. తల్లికి ఎడమైన బిడ్డలా... నీ కోసం విలపిస్తున్నాను. నువ్వు నా కళ్ళపై కప్...

కళ్ళు తెరవని సీతలెందరో?!

 భర్త గారి గాలి మాటలు, గాలి వాగ్దానాలు విని మళ్ళీ మోసపోయి, కాపురానికి వెనక్కు వెళ్లే భార్యలెందరో! ఇంతకాలం భరించడం నా అజ్ఞానం, ఇక భరించలేను అని సుజ్ఞానంగా పలుకుతూనే మరల తమ విజ్ఞానాన్ని కోల్పోయి, అతని వెనక వెళ్లిపోతుంటారు. అతగాడి నుంచి అదనపు జ్ఞానం పొందటానికే ఈ అగచాట్లన్ని. అమ్మగారింటికి పోవడానికి మొహం చెల్లక, సిగ్గుపడి అతనితోనే కాలం వెళ్ళబుచ్చుకుంటారు. ఇక్కడ ఈమె అభిప్రాయాన్ని మార్చుకోవడం తప్ప, అతని ప్రవర్తనలో మార్పేమీ రాదు. ఆమె నోరు మూసుకుని ఉన్నంతకాలం, దెబ్బలకు ఓర్చినంత కాలం ఇది పండంటి కాపురమే!. పక్కవారికి ప్రేరణ కూడా ఈ అన్యోన్య దాంపత్యం. రంగనాయకమ్మ గారి "కళ్ళు తెరిచిన సీత" బుక్ చదువుతుంటే నాకెందుకో ఇలా రాయాలనిపించింది. బట్టలు, సర్టిఫికేట్లు సర్దుకుని నెలకోసారి పుట్టింటికి పారిపోయే భార్యలున్నారు. ఇరుగుపొరుగు వారి మాటలు విని, అత్తరింటి రాయబారాలతో... మళ్ళీ తిరిగు ముఖం పడుతుంటారు. మళ్లీ వారం తిరగక ముందే ఈ విముక్తి నుంచి ఎవరు బయట వేస్తారు వారికి ఆ జన్మాంతం  రుణపడి ఉంటాము, అని దేవుని ప్రార్థిస్తూ ఉంటారు. మనం ఆపదలో ఉన్నప్పుడు ఎదుటివారు సహాయం మనకు అంతలా అనిపిస్తుంది.  పడి పడి లే...

అందమైన కనులవానికి అంకితం(100th blog).

 మారువేషంలో ఉన్న కృష్ణుడు నా ముందే తిరుగుతూ ఉంటే, జన్మలు మారినా ప్రేమని మర్చిపోలేని రాధగా అతని ముందే తిరుగుతూ ఉన్నాను. ఇది లౌకిక ప్రేమనో లేక అలౌకిక ప్రణయమో? నేను వర్ణించలేను. గొంతు గంభీరంగా ఉన్నా అతను మాటలో మధురమైన వాడు. నా యోగక్షేమాలు అడగకున్నా... నా ప్రేమ యాగంలో పూజ్యుడైన వాడు. నాకు ఈశ్వరుడైన వాడు, నా యందు దేవుడైన వాడు. ఏ దూప దీపములు, మంత్ర జపములు కోరనివాడు. నా అంతరంగమందు అనందరూపుడు. నిర్మలుడు, నిర్భయుడు, నిమీలిత నేత్రములతో నన్ను వరించి, హరించే నీరాజక్షుడు. అతడే నా ప్రియుడు, కలల వరుడు. నువ్వు నాకు పలకనంత దూరంలో ఉన్నా...నీ మౌనంలో నా హృదయాన్ని నింపుకుని, ఓర్చుకుని ఊరుకుంటాను. ఏదో ఒక రోజు నీ చూపులు, స్వర్ణదారలై నాపై వర్షిస్తాయి. ఆరోజు నా మనసులోని మాటలు రెక్కలు కట్టుకుని పాటలై నీ చెవులను చేరుతాయి. ఆరోజు నీ ముఖాన్ని ముద్దాడి, నీ చిరునవ్వుని దొంగిలిస్తాను. నా ప్రాణానికి ప్రాణమైన చెలికాడి చెంత ఒక్క నిమిషమైనా కూర్చునే చనువు కావాలని కోరుకుంటున్నాను. అతని చేతి స్పర్శ తగిలి నా హృదయంలో జరిగే విద్యుత్ ప్రవాహాన్ని చూడాలని ఉంది. తన గుసగుసలు, నిట్టూర్పులు తగిలేంత దగ్గరగా నా మాట సాగాలి. పగటి కాంత...

జ్ఞానం- ధ్యానం, నా గ్రంథాలయం(99th blog)

 ఇది నా 99వ Blog, నేను కథలు రాయను, కవితలు రాయను, రచనలు చేయను. రోజు ఒక ఆరు పేరాగ్రాఫ్లు రాసి అందులో నా అమాయకపు ఫోటో ఒకటి పెట్టి ఏదో చదివిస్తూ ఉంటాను మీ చేత. అలా ఇది నా 99వ బ్లాగ్. ఇలా ఏదో ఒకటి రాయగలిగాలి అంటే దానికి ఒక ప్రేరణ ఉంటుంది.  రాయడానికి నాకు ప్రేరణ ఇచ్చిన వాటిల్లో మొదటివారు, మా తాత, రామచంద్రయ్య. ఆయన ఊటుకూరు గ్రామంలో గవర్నమెంట్ స్కూల్లో తెలుగు టీచర్ గా చేసేవారు. చాలా కవితలు రాసారు. తాత రాసిన సంక్షిప్త రామాయణం- శ్రీరామ శతకం అనే పేరుతో ఉంటుంది. అందులో రామాయణాన్ని మొత్తం 100 పద్యాలలో తాత సంక్షిప్తంగా రాశారు. ఈ పుస్తకాన్ని టిటిడి దేవస్థానం వాళ్ళు లక్ష కాపీలు అచ్చు వేశారు. తాత ఇప్పుడు లేరా? అంటే ఉన్నారు. ఆ పుస్తకంలో. కవులెక్కడికి వెళ్తారు? వారి రచనల్లో అలానే ఉంటారు. రెండవది నెల్లూరు, రేబలవారి వారి వీదిలో ఉన్న గ్రంథాలయం. ఇలా గ్రంథాలయం వెళ్లడం కూడా తాత నేర్పించిందే. చిన్నప్పుడు ఎలిమెంటరీ స్కూల్ చదివేటప్పుడు వేసవి సెలవుల్లో తాత వాళ్ళ ఊరికి వెళ్లే వాళ్ళం. రోజు సాయంత్రం గ్రంథాలయం తీసుకెళ్లేవాళ్లు. రెండు గంటలు గడిపే వాళ్ళం. అది నాకు బెస్ట్ టైం అన్నట్టు. ఇప్పటికీ RAIN(ధియేటర్) లో మ...

మరల తెలుపనా ప్రియా! (98వ బ్లాగ్)

నీ తీపి తలపులు నింపుకున్న ఆ తెల్లవారు జాముల తలుపులు, మళ్ళీ తెరవనా ప్రియా... మసక వెలుతురులో, మంచు తెరలలో, ప్రేమ పొరల మధ్య మనం ఆడిన దోబూచులాటలు... దొరకక నువ్వు తిరిగిన చెట్ల దారులు, దొరికి పోతూ జారిపోయిన నీ చేతి స్పర్శలు,  మరల మరల నీ వెనక పరుగులీడిన నా అడుగులు. ఈ కొంటె తలుపులన్నీ మరల తెలుపనా ప్రియా... నలువైపులా... విచ్చిన తోటలలో... తెంచి తెచ్చిన పువ్వుల గంపలు, మరుమల్లెల గుంపులు మనలను గుమికూడిన వేళ, తప్పించుకు త్రోవ లేక పట్టుబడ్డ మన బిడియపు కౌగిళ్ళను మరల తెలుపనా ప్రియా!. నా కనులు దొంగిలించిన నీ మోమును, నీ కనుల దొర్లిన తేనెను మింగిన నా రెప్పలను, మరిగే పాల కడవలా... నురగలు కక్కే కడలిలా... నా మది చిలికిన నీ కవ్వపు నవ్వును మరల తెలువనా ప్రియా!.  వెన్నెలంత చల్లగా నీ చూపులు, వేసవంత వెచ్చగా నా పడిగాపులు ముసుగులు వేసుకుని, గుసగుసలా నీ స్వరము ఒక వరమై, నా చెవులను చేరే సమయాన... అవధులు లేని ప్రేమని అనంతమైన అనుభూతిని అలవికాక అందుకున్న ఆ నిమిషాలను మరల తెలుపనా ప్రియా!.   ఈ చూపుల సమన్వయంలోని మకరందాన్ని దొంగిలించగా పూల పొదరిల్లను వదిలి వచ్చిన మధుకరం గుర్తుందా? దాని దారి మర్లించలేక మనం పడ్...

Fashion tips for Girls.

   After completion of my bachelor degree in Microbiology, I was applied for Fashion technology and Biotechnology for my post graduation. I got both admissions at a time. One is from kothari institute of fashion technology in Chennai and another one Biotechnology from Padmavati Mahila University of Tirupati. I had choose Biotech for my post graduation. But still interested in fashion technology. FASHION Fashion is a way of dressing that is prominent and valued socially.  Fashion has to do with new trends. It refers to popular ways of dressing during a specific era. Fashion is changing from year to year. For every 20years old generation styles are reintroduced into new generations. ELEGANT AND CLASSY LOOK:  Elegant  means pleasing  and  graceful  in the appearance  or style. When we look at our grand parents pictures in album... They look more elegant and graceful, because of the type of clothes and pleasent expression in their faces...

ఉత్తరాల ఊర్వశి!.

 సువ్యక్తంగా... సుందరంగా... నా వ్యక్తిత్వాన్ని వ్యక్తపరచుకోవడానికి రాసిన ఉత్తరమిది. ఉత్తరాలు రాయడం అంత సులభమేం కాదు. ఇది కూడా ఒక సృజనాత్మక కళ, దయచేసి ఒప్పుకోండి. నన్ను నేను గొప్ప చిత్రకారిణి అనుకుని నీ చిత్రాలు గీశాను. నా మనోచిత్రమంతా... నీవేనని వ్యక్తపరిచడమే నా ఉద్దేశ్యం. నా ఈ అంతరంగం అవ్యక్తం, మీకు మాత్రమే అది బహిర్గతం. నా అంతః బహిర్ముకములు తెలిసిన ఒకే ఒక్కనివి నీవు. నిరంతరం తెంపులేని ఆనందంతో ప్రవహించేది కాదుగా... నా తలరాత. ఒడిదుడుకులు వచ్చి పోతుంటాయి. ఈ నిడివిలో నేను కడలంత కన్నీరయ్యాను. నీ ఒడి దాక్కుని ఏడవాలని వేదన పడ్డాను. దూరమయ్యింది నువ్వైనా... నీ ధరి చేరే ఏడవాలనుకున్నాను. చేరుకును మార్గమెటో తెలియలేక నావ కట్టి నీటిలోకి వదిలాను. నే రాసుకున్న ఉత్తరాలు తెరచాపకు కట్టాను. అటు ఇటు ఏటో వెళ్లి నీ ఒడ్డు చేరింది నా పడవ. నీ ప్రేమ సాగరంలోకి దూకేలా నన్ను ప్రేరేపించింది నీవే. ఆ తీయటి దోసిటి నీళ్లు తాగించి ఈ ప్రపంచాన్ని మర్చిపోయేలా చేసింది నీవే!. తటాలున పెద్ద బావిలో పడవేసింది నీవే. ఇప్పుడు మళ్లీ ఈ తృష్ణ ను  చీకటి నుండి వెలుతురు వైపుకు నడిపిస్తుంది నీవే!. ఇన్ని ప్రయత్నాలన్నీ చేసి అప్రయత...

సూరీడొచ్చే... వేళయ్యింది.

 ప్రతి ఉదయం నన్నిలా... పలచ పలచని కిరణాలతో... పలకరించే సూర్యునికి శుభోదయం. చటుక్కున కిటికీలోకి దూరి, వెచ్చని చేతులతో... నా చంపగిల్లే భానుడికి ఉషోదయం. నిన్నటి గాయాలకు ఉష్ణ లేపనం రాసే నీ మమకారానికి మహోదయం.  జీవితం అంటే ఆకలేసేంత ఆశ లేకపోయినా... రోజు నీ నిట్టూర్పులతో... ఇలా కొత్తగా లేవడం, కాఫీ కప్పుతో పైకి చూస్తూ-చూడలేక రెప్పవాల్చడమే! నా తొలి ప్రణయం. నీలి కురులను ఇలా... నయగారంగా... చేతి వేళ్ళతో ఒద్దికగా సర్దుతూ నీకేసి చూడడమే నీతో నా సల్లాపం. చేతులను పైకి చాచి ఒల్లిరుచుకుంటూ... నిన్ను కవ్వించడమే నా కాలక్షేపం. కనుపాప పసిపాపేమో! నిన్ను చూడలేక అరచేతిలో దాక్కుంటే, నీ వెచ్చదనానికి విచ్చిన పూలన్నీ నా కొంగులోకి కోస్తున్నాను. మేఘమొచ్చి పోయే వేళ, నీ అందాన్ని వర్ణించ చూస్తున్నాను.  సంధ్య వేళల చీకటి అంటే భయమా నీకు? కొండల చాటున దాక్కుంటావు. చంద్రుడంటే అసూయా నీకు? తను వెళ్లే దాకా రావు. చిన్ని చుబుకాన్ని చేతులలో చాచుకుని, ఇట్టే నిన్ను చూస్తుంటాను. రోజూ...వస్తావని తెలిసిన, ఈవేళ వస్తావా? రావా? అనే సందిగ్ధంలో!. పవిట కొంగును పంటి కింద పెట్టుకుని నీ ఎర్రటి రూపు చూడాలని, పడిగాపులు పడుతుంటాను. వచ్చ...

నేనసలు కవినే కాదు!.

    ఒక కవి విమర్శించారు. మీకు "అతనిపై ప్రేమ", "అతని అందం" ఈ రెండే కథా వస్తువులా? కవులంటే నవరసాలను పలికించాలి. మీరు మాత్రం ఈ రెండింటితోనే నెట్టుకొస్తున్నారు అని. నేను కవిని కాదు, మీ కవి సమూహంలో కూర్చునే అర్హత నాకు లేదు, అవకాశము నాకొద్దు. నా కలం నా గుండె భారాన్నే మోస్తుంది. నా ఇంటి కిటికీలోంచి బయట సమస్యల్ని వీక్షించే సమయమే నాకు లేనప్పుడు ఏ ప్రేరణతో నేను స్పందించగలను.  ఒక కవికి హృదయ స్పందనే... రసస్పందన. ఈ కాలం నాకు అతని వల్ల కలిగిన ఈ గుండె గాయాన్ని మాత్రమే తెలియజేస్తుంది. మరే స్థితిగతులు నన్ను ఏ మార్చకున్నాయి. లేతప్రాయపు కాంక్షలేవీ నా కలంపై కదలకున్నాయి. నా ప్రతి కదలికను గమనించే లోకుల ఆంక్షలే  మెదడును తొలుస్తున్నాయి. గుండె నెత్తుటి ఏరై  ప్రవహిస్తోంది. పెదవులపై చిరునవ్వు మాత్రం నిరంతరం చిగురిస్తోంది. విడిపోయామనే నిజాన్ని ఒప్పుకోలేక, ఏకాంతంలో కొట్టుమిట్టాడుతున్న ఒంటరితనానికి తన రూపు చూపుతున్నాను. రోజు గుడిలో వెలిగించే దీపాలు నాలో వెలుగులు నింపట్లేదు, దీపపు కాంతుల మధ్య మెరిసే చీకటే నా కనులకు తారసపడుతుంది. నా రచనల్లో వెలుగునీడలను రెండింటినీ రాయాలనుకుంటాను. కానీ చీకటే ఎక...

స్త్రీ కవిత్వం పై నా సంతకం.

 స్త్రీ కవిత్వం అంటే స్త్రీ వాదం కాదు. సున్నితత్వం కాదు. అద్దంలో ఆమె అందం యొక్క చిరునామా కాదు. వెన్నెల్లో ఆడపిల్ల కథలా... రూపు కానరాక ఆడే అల్లరి ఆట కాదు. వయసు, వయ్యారం, సొగసు, సౌమ్యత... ఇవి మాత్రమే ఆడది కాదు. అనుకువలో అరనవ్వునవ్వి, అరచేతిలో ముఖం దాచుకోవడం కాదు. అల్లారు ముద్దుగా నాన్న ఎదపై ఆడుకునే చిట్టి అడుగులు కాదు. ఇల్లంతా తిరిగే అందెల అడుగుల చప్పుడు మాత్రమే కాదు. అమ్మ కొంగు పట్టుకుని అత్తారింటి ఆరండ్లు చెప్పుకునే అమాయకపు ఆడపిల్ల కాదు.  స్త్రీ అంటే వండి వార్చి వడ్డించే అమ్మ చేతి గాజుల చప్పుడు. అమ్మానాన్నలను వదులుకొని అతని కోసమే బ్రతికే గుండె చప్పుడు. చీకటింట వెలుగులు నింపి గూటిలోనే మౌనంగా ఉండిపోయే గోరంత దీపం. మన అమ్మ ఆచూకీ నాలుగు గోడల మధ్య, ఆలి ఆచూకీ ఆఫీసు ఫైలు దాకే, మరి కూతురు ఆచూకీ? నాన్న కలల వాకిటి దాకే!. ఇంతలో ప్రియుని ప్రేమలో పిచ్చితనం, తల్లిదండ్రులను వ్యతిరేకించే గడుసుదనం, అన్నీ గెలిచి అత్తారింటికి పోతే... అక్కడ మళ్లీ మరో గెలుపు పందెం. అమ్మగా, ఆలిగా అన్ని గెలిచాం అనుకునే లోపు అనుమానం, అపార్థం. మళ్లీ ఓడిపోతాం. స్త్రీ అంటే గెలుపోటముల యుద్ధం. ఏ యుద్ధమూ... మనుషులను గెలవలేద...

మరచుట తెలియని మనసు నాది!.

 భిన్న అస్తిత్వాలతో నా కథా సాహిత్యాన్ని విస్తరించాలంటే, కొత్త కథా వస్తువులు కావలెనా? నా కలానికి, కాగితానికి?. నా మనసుపై తిలకమద్దిన అతని వేలిముద్రలు చాలవా? తిమిరంగా రెప్పవేయక చూసే అతని చూపులు చాలవా!. కడలి పొంగిన అలనై దూసుకురానా... ప్రేమ కెరటమై కాగితంపై ఎగసిపడనా...  నా ప్రపంచంలో ఇద్దరే బలవంతులు నా ఊహలో నీ రూపు, నీ రూపునే రాసే నా కలం. ఈ లోకంలో అలసిపోక  సంచరించే ఆ ఇద్దరు బాటసారులు... సూర్యచంద్రులనడుగు, ఇది నిజమో కాదో చెబుతారు. వేల రాళ్ల మధ్య విభిన్నంగా ప్రకాశించే రత్నమై నీవు, మిరుమిట్లు గొలుపుతూ నా కనులకు తారసపడ్డావు. ఆనాటి నుండి విచ్ఛిన్నమైన కనుపాప ఏ రాయిని చూడలేకుంది. నా దేశమంతా రాళ్ళు, మట్టితో నింపేసి, పరదేశం వెళ్ళిపోతావా?. అబద్దానికి దూరంగా నిజానికి దగ్గరగా ఉన్నప్పుడు మాత్రమే జీవితం బాగుంటుందంటారు. కానీ నేను ఊహలకు దగ్గరగా వాస్తవానికి దూరంగా బ్రతుకుతుంటాను. దూరమైన వాస్తవాన్ని నాకు దగ్గరగా చూపి, నా ఊపిరిని నిలిపి ఉంచేది ఈ ఊహే!. దేవుడనేవాడు మనిషి ఊహల్లో సృష్టింపబడిన వాడైతే, వాస్తవం కాకపోతే నీవు కూడా దేవునివే. దేవుడనే మాట కల్పితమైతే, నీపై నా ప్రేమ కూడా కల్పితమే. నా దృఢవిశ్వాస...