ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

జ్ఞానం- ధ్యానం, నా గ్రంథాలయం(99th blog)

 ఇది నా 99వ Blog, నేను కథలు రాయను, కవితలు రాయను, రచనలు చేయను. రోజు ఒక ఆరు పేరాగ్రాఫ్లు రాసి అందులో నా అమాయకపు ఫోటో ఒకటి పెట్టి ఏదో చదివిస్తూ ఉంటాను మీ చేత. అలా ఇది నా 99వ బ్లాగ్. ఇలా ఏదో ఒకటి రాయగలిగాలి అంటే దానికి ఒక ప్రేరణ ఉంటుంది. 


రాయడానికి నాకు ప్రేరణ ఇచ్చిన వాటిల్లో మొదటివారు, మా తాత, రామచంద్రయ్య. ఆయన ఊటుకూరు గ్రామంలో గవర్నమెంట్ స్కూల్లో తెలుగు టీచర్ గా చేసేవారు. చాలా కవితలు రాసారు. తాత రాసిన సంక్షిప్త రామాయణం- శ్రీరామ శతకం అనే పేరుతో ఉంటుంది. అందులో రామాయణాన్ని మొత్తం 100 పద్యాలలో తాత సంక్షిప్తంగా రాశారు. ఈ పుస్తకాన్ని టిటిడి దేవస్థానం వాళ్ళు లక్ష కాపీలు అచ్చు వేశారు. తాత ఇప్పుడు లేరా? అంటే ఉన్నారు. ఆ పుస్తకంలో. కవులెక్కడికి వెళ్తారు? వారి రచనల్లో అలానే ఉంటారు.


రెండవది నెల్లూరు, రేబలవారి వారి వీదిలో ఉన్న గ్రంథాలయం. ఇలా గ్రంథాలయం వెళ్లడం కూడా తాత నేర్పించిందే. చిన్నప్పుడు ఎలిమెంటరీ స్కూల్ చదివేటప్పుడు వేసవి సెలవుల్లో తాత వాళ్ళ ఊరికి వెళ్లే వాళ్ళం. రోజు సాయంత్రం గ్రంథాలయం తీసుకెళ్లేవాళ్లు. రెండు గంటలు గడిపే వాళ్ళం. అది నాకు బెస్ట్ టైం అన్నట్టు. ఇప్పటికీ RAIN(ధియేటర్) లో మూవీ చూడ్డం కంటే రేబల లైబ్రరీ లో బుక్ చదవడం స్టేటస్ సింబల్ నాకు. ధ్యానం చేసినంత ప్రశాంతంగా ఉంటుంది. జ్ఞానము వస్తుంది. 


నా డిగ్రీ త్రీ ఇయర్స్, సబ్జెక్టు బుక్స్ కంటే లైబ్రరీ బుక్స్ ఎక్కువ చదివాను. జువాలజీ క్లాస్ బోరింగ్ గా ఉండేది. మా జువాలజీ మేడం "హ్యూమన్ డైజిస్టివ్ సిస్టం" ని కలర్ చాక్పీసులు తీసుకుని వచ్చి, బోర్డు మీద 40 మినిట్స్ బొమ్మ గీసేది. అదొక బాధాకరమైన బోరింగ్ క్లాస్. అందుకే నేను జువాలజీ బుక్ లో... లైబ్రరీ బుక్స్ పెట్టుకొని చదువుకునేదాన్ని. ఒకసారి మేడంకి పట్టుబడిపోయాను. ఆమె ఏమీ అనకపోగా ఆ బుక్ భలే ఇంట్రెస్టింగ్ గా ఉంది నాకు ఇవ్వు అనింది. అది ఒక ఆయుర్వేదిక్ సైన్స్ బుక్. 


ఈ బుక్ ని నేను లైబ్రరీ నుంచి కొట్టేసాను. ఇలాంటి బుక్కు మళ్ళీ ఎక్కడ దొరకదు కాబట్టి. ఈ బుక్ లో చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్టు ఉండేది. ఇందులో మనిషి కనుల ఆకారాన్ని బట్టి, వాళ్లు ఏ రకం మనస్తత్వం కలిగిన వాళ్లు? వాళ్లకు భవిష్యత్తులో ఏ రకమైన జబ్బులు రావచ్చు? కంప్లీట్ గా వాళ్ల సైకాలజీ గురించి రాసి ఉండేది. Quora లో...ఈ మధ్య ఎవరో అడిగిన ఒక ప్రశ్నకు, సమాధానంగా నేను ఈ బుక్ లో నాకు గుర్తున్న విషయాన్ని మళ్లీ రాసాను చాలా లైక్స్ వచ్చాయి. Quora లో నేను రాసే చాలా సమాధానాలు, లైబ్రరీ ఇచ్చిన జ్ఞానమే. ఈ లైబ్రరీ పిచ్చి అలా పద్మావతి యూనివర్సిటీ దాకా వెళ్ళింది. అక్కడ కూడా బయోటెక్నాలజీ బుక్స్ కంటే లైబ్రరీలో ఉన్న అన్ని రకాల బుక్స్ ని చదివేసాను.


అందరూ చెబుతారు యోగ గురుముఖంగా నేర్చుకోవాలని నేను యోగా కూడా ఈ లైబ్రరీ నుంచి తెచ్చుకున్న పుస్తకం నుంచే నేర్చుకున్నాను. నా 20 ఇయర్స్ అప్పటి నుండి, ఈ 20 ఇయర్స్ లో  కాలేజీ లో, హాస్టల్ లో, యూనివర్సిటీ లో... చాలామందికి నేర్పించాను.


నేను రాయడం మొదలెట్టింది మాత్రం, నాకు 13 సంవత్సరాలు ఉన్నప్పుడు. అది నా ఫేవరెట్ హీరో చిరంజీవి గురించి. అప్పటినుంచి ఏదో ఒకటి రాస్తూనే ఉన్నాను తెలుగులో, ఇంగ్లీషులో, హిందీలో. రాసిన ప్రతిదాన్ని తాతకి తీసుకెళ్లి వినిపించేదాన్ని. తాత మెచ్చుకుంటే వావ్ అనుకునేదాన్ని. ఆయన నేను ఏం రాసిన మెచ్చుకునేవాడు. పెద్దవాళ్లు అలా ప్రోత్సహిస్తారు కదా. తాత... సో స్వీట్. నాకు ప్రేమ కవితలు అంటే ఇష్టం. ఇప్పుడు 40 ఏళ్లు వచ్చాయి. అయినా కవిత్వంలో ప్రేమే నా ప్రధాన వస్తువు. అంటే వయసు మనిషికి వస్తుంది గాని కవి మనసుకు రాదు. నేను రాసిన ఈ 99 బ్లాగ్స్ లో 80 ప్రేమ మీదే ఉంటాయి. 

అబ్బాయిలు ఎలా అందమైన అమ్మాయిని చూసి కాసేపలా ఆగిపోతారో...నివ్వెరపోయి చూస్తుంటారో అమ్మాయిలు కూడా అంతే. మాలాంటి కవులు, కళాకారులు అబ్బాయి అందాన్ని గురించి డజన్ల కొద్ది కవితలు రాసేస్తూ చేతికొచ్చిన బొమ్మ లేవో గీసేస్తూ ఉంటాము. మేమెందుకు ఈమెకు తారస పడ్డామా! అన్నట్లు మా అభిమానాన్ని అతని మీద కుమ్మరిస్తూ ఉంటాము. అబ్బా... ఆ కళ్ళు, ఆ పెదాలు అనుకుంటూ... అద్దానికి చెప్పుకుంటూ మురిసిపోతుంటాం. బెస్ట్ ఫ్రెండ్ కి చెబితే... అది ఎత్తుకుపోతుందిగా మరి!.


నాకు రాయడానికి ప్రేరణ ఇచ్చిన వారందరికీ నా ధన్యవాదాలు. 99 బ్లాగ్స్ నేను రాయగలిగాను అంటే మీలో ఎవరో ఒకరు ఇలా దాన్ని చదవబట్టే. వారందరికీ నా ధన్యవాదాలు.


Really thanking you🙇🏻‍♀️,

✍️Bhagyamati.




కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నా మొదటి ప్రేమ... మా నాన్న!

  ఒక అమ్మాయి ఏ వయసులో అయినా ఉండొచ్చు కానీ ఆమె ఎప్పటికీ తన తండ్రికి చిన్ని యువరాణిగానే ఉంటుంది.  తండ్రీ కూతుళ్ల మధ్య ఉన్న ఈ ప్రత్యేక బంధం... ఆరాధ్య బంధం!.  ఒక తండ్రి తన కూతురిపై ఉంచే హద్దులు లేని ప్రేమ ఎప్పటికీ తిరిగి చెల్లించలేనిది.   బెస్ట్ ఫ్రండ్ తో షాపింగ్:  నేను రత్నం జూనియర్ కాలేజి లో చదివేటప్పుడు కాలేజి వ్యాన్, ఇల్లు తప్ప ఏం తెలియదు. డిగ్రీ కి వచ్చాక న బెస్ట్ ఫ్రెండ్ శ్వేత తో మొదటిసారి బయటకి వెళ్ళాను. ఫస్ట్ టైం వెళ్ళడం, నాన్నకి trunk road లో కనిపించాను. నా మైండ్ బ్లోక్ అయ్యి రెడ్ అయ్యి, బ్లూ అయ్యింది. మా నాన్న మాత్రం సింపుల్ గా షాపింగ్ కి వచ్చావా? డబ్బులు ఉన్నాయా? అంటూ 2000 ఇచ్చేసి వెళ్ళాడు. నాన్న అంటే అంతే మరి, నెక్స్ట్ లెవెల్.  నేను పెద్ద చిరంజీవి అభిమాని ని. నాన్న ఫస్ట్ డే ఫస్ట్ షో చిరంజీవి మూవీ కి తీసుకుని వెళ్తాడు. నేను తిరుపతి లో M.SC చేసేప్పుడు నాకోసం dairy milk బాక్స్లు కొరియర్ చేసేవాడు. చిరంజవి గ్రీటింగ్స్ పంపేవాడు. నాన్నకి నేను ఎప్పటికీ చిన్న పిల్లనే. నేను అబద్ధాలు చెప్పను. ఇప్పటికీ చెప్పను. అందుకే నన్ను మా అమ్మ, నాన్న బాగా నమ్ముతారు. నా ప్రాణ స్నేహితుడు నాన్న: చిన్నపుడ

ఇప్పటికి మేల్కున్నావా స్వామి?!

 తడిసి నీళ్ళోడుతున్న చీర కొంగును పిండుకుంటూ... అల్లంత దూరాన ఉన్న అతనిని చూసాను. కడవ నడుముకెత్తి తిరిగి మళ్ళీ మళ్ళీ చూసాను. ఎదుట ఏటుగట్టు వెనకనుంచి చుమ్మలు చుట్టుకుంటూ... తెల్లని పొగతెరలు, చెట్ల ముసుగులు దాటి వచ్చాను.  మామిడి చెట్టు ఆకుల గుబురుల్లోంచి, సన్నగా పడుతున్న నులి వెచ్చని సూర్యకిరణాలు.... మడత మంచంపై మాగన్నుగా పడుకుని ఉన్న నా మన్మధుడు. ఓయ్... అని కేక వేయాలనుంది, వాలుగాలిలో మాట కొట్టుకుని పోదా అని ఆగిపోయాను. తడక మీద ఆరవేసిన తుండువా లాగి దులుపుదామనుకున్నాను. గడుసుదనుకుంటాడని గమ్మునుండి పోయాను. పొగమంచు మేఘాల మధ్య చాచుకునే ఉంది. పసిడి పువ్వులు నా పిరికితనం చూసి నవ్వుకుంటున్నాయి. చెట్టు కొమ్మన కౌగిలించుకున్న రామచిలుకలు నీ మాటేమిటి? అని ఆరా తీశాయి.  సరే! నడుము మీద కడవ నిలవకుంది, అతనితో గొడవ పడమంది. నెత్తిన కుమ్మరిస్తే మేలుకొంటాడుగా?! అమ్మో కయ్యాలవాడు మాటలే కట్టేస్తాడు. వద్దులే రేగిపోయిన జుట్టును ముడి వేసుకుంటూ పక్కనే ఓ పూచిక పుల్ల కోసం వెతికాను. ఈ పడుచు వాడి కలలో ఏమొస్తుందో... నిద్రలోనే నవ్వాడు. చక్కనోడు చెంప మీద చంద్రవంకలు పూచాయి. మర్రి చెట్టు కాయలు ముసిముసిగా నవ్వుతూ... పుల్ల ఒకటి వ

ఇది యుగాలనాటి ప్రేమ!.

 రాధంటే... ఉత్తదేహం కాదు, ఉత్త మనసే కాదు, రాధంటే ఆత్మ. కృష్ణుని ప్రేమలో లీనమైన ఆత్మ. ప్రపంచానికి అర్థం కాని ఎన్నో విషయాలలో వీరి ఇరువురి ప్రేమ కూడా ఒకటి. వీరి శృంగారం మానసికమే! కానీ ఆత్మసంబంధం. ఏ ప్రేమ కథకైనా వీరే ఆదర్శం. ప్రేమ యొక్క గొప్పతనం పట్టాలంటే... కథలో చిత్రించే పాత్రలను రాధాకృష్ణలను ఊహించే రాయాలి. కృష్ణుని పై ఆశలు రేకెత్తించుకొని మనసును కృంగ దీసుకున్న రాధ ప్రేమ లోంచి విరహం అనే పదం పుట్టుకొచ్చిందేమో?! ప్రేమంటే మనసంతా కాముఖత్వం పులుముకోవడం కాదు, దేహవసరాలను తీర్చుకోవడం కాదు, ప్రేమంటే విశాలత్వం, దైవత్వం, విరహం, తపన, వేదన, ఎడబాటు, త్యాగం, కృష్ణుని రూపు కోసం పరితపించే రాధ దినచర్య. అందుకే రాధాకృష్ణుల ప్రేమ ఉత్త ప్రబంధ కథగా కాకుండా... యుగాలు చెప్పుకునే గొప్ప ప్రేమగాధ గా మిగిలింది. ఒక ప్రేమ కథను పైకెత్తి ఆకాశంలో ప్రవేశపెట్టాలన్నా... ఒక ప్రేమ గీతాన్ని, స్వర్గాన్ని తాకేంత ఆనందంగా ఆలాపించాలన్నా... రాధాకృష్ణుల ప్రేమే ప్రేరణ. ఇంత గొప్పగా మనం ప్రేమించాలంటే రోజు మనసుకి మెదడుకి మధ్య దేవాసుర యుద్ధమే జరుగుతుంది, అయినా నిలబడితేనే ప్రేమ గెలుస్తుంది. ఇక్కడ గెలవడం అంటే ఇద్దరు పెళ్లి చేసుకొని జీవించటం