ఆ విశ్వరూపుని గుణగణాలను వెల్లడించే... వేయి నామాలను, గుండెలో ప్రతిధ్వనించుకుంటూ... ఈ విష్ణు సహస్రనామం చదువుతున్నాను. ఇది నా రాముని కోసం, నా దేవుని కోసం. జగత్ ప్రభువైన ఈ భగవానుడు నా కనుల ముందే అగుపించుచున్నాడు. ఈ ధ్యానంలో... మౌనముద్రలో... అతి సుందరమైన అతని నిజరూపును, చిరునగవును చూసిన ప్రత్యక్ష సాక్షిని నేను. దేవునితో నాకు గల సంబంధాన్ని, సమన్వయాన్ని ఉదాత్తంగా రాసుకుంటున్నాను. ఇందులోని ప్రతి అక్షరం అతని మందహాసం నుంచి ఆవిర్భవించినవే!!.
నిలకడ చూపుల వాడు, నిర్మల నేత్రముల వాడు, నవనీతము వంటి దేహము కలవాడు, నిరాడంబరుడై... నింగి వరకు ఎత్తైనవాడు.... ఈ సర్వేశ్వరుడు. గేయమై, గీతమై, నా గొంతులో గానమై, ప్రతి వాక్కును నాతో ఇలా రాయిస్తూ ఉన్నాడు. ఇతని అసమాన్యమైన కథ సామాన్యులకు అంతుపట్టదు. ఈ రాముని చిరంతర సిద్విలాసాన్ని, శ్రేష్టంగా భావించి ఆంతర్యం గ్రహిస్తే తప్ప పూర్తిగా బోధపడడు.
భగవద్గీత సారాంశాన్ని గ్రహించిన వారికి తెలుస్తుంది శ్రీకృష్ణుడితో అర్జునుడికి గల బాంధవ్యము, సఖ్యము, సాహద్యము, సారథ్యము. అదేవిధంగా మనము కూడా ధన్యజీవులను కాగలము. దేవుని యొక్క మమతకు లోబడి ధర్మనిరతిని పాటించిన వారికి, అతని పరమశాంతి నిదానుడైన వ్యక్తిత్వమును గ్రహించిన వారికి... ఇతనితో ఆ బాంధవ్యము కలుగును. సఖ్యము కలుగును. నిరంతరము అతని ధ్యానంలో మనసు, దేహము కుదుటబడును. ఇదే కర్మసాధకమైన జ్ఞానం. మనసులో ఉద్భవించిన సందేహాలు అన్ని తొలగించబడతాయి. అతని దివ్య నామము పలుకుతూ ఆనందంలో విహరిస్తాము. ఇతని సన్నిధిలో వెలిగిన మనోజ్యోతిని ప్రీతిగా... వేయినోళ్ళ కొనియాడుతాము.
పరిపూర్ణమైన జ్ఞానాన్ని, పొదిగి ఉన్న రాముని రూపాన్ని, చిన్నచిన్న మాటల్లో... గొప్ప గొప్ప రహస్యాలుగా... ఎప్పుడో రామాయణం వివరించింది. అయినా అన్ని యుగముల ముందు అవతరించిన వానిని, ఈనాడు నేను కొత్తగా చూసాను. ఇందులో నా పరిపూర్ణ అజ్ఞానాన్ని ఒప్పుకున్నాను. శాంతికి అశాంతికి వ్యక్తుల మనస్తత్వాలే హేతువులు కానీ పరిస్థితులు కావని, నా మనసు మొహమాటం లేకుండా ఒప్పుకుంటుంది. ఇది ఇన్నాళ్లు మాయామొహం ఆవరించుకొని నా మనసును మూసివేసింది.
ఈ అలౌకికమైన ఆనందాన్ని నాకు అనుగ్రహింపచేసిన ఈ దేవునికి, నా రామునికి, అక్షరాలతో... అర్థిస్తున్నాను. స్తోత్రాలతో స్తుతిస్తున్నాను. ఒక్కొక్క మాటను మంత్రాల మూటగా కట్టి, అతని ముందు నివేదిస్తున్నాను. పవిత్రాలకు పవిత్రమైన వాడు, మంగళములకు మంగళమయినవాడు, పంచమ వేదసారమైన ఆ భగవానునికి ఆరాధించి వేడుకుంటున్నాను... ఈ ఐహిక సుఖముల నుండి విముక్తి కలిగించమని, మరుజన్మలో మరల అతని భక్తురాలిగా జన్మించేలా వరం ప్రసాదించమని🙇🏻♀️.
Thank you 🙏
✍️ Bhagyamati.
చాలా బాగుంది
రిప్లయితొలగించండిThank you 🙏🏻
తొలగించండిమీరు భగవంతుని ఏమి కోరుతున్నారు ఆండీ, మరలా ఒకసారి పరికించి చూడండి
రిప్లయితొలగించండి