ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

ఇది స్వప్నమా?! లేక సత్యమా?

 నీ తలపుల వానలో... తడిచిన దేహము, వలపుల పువ్వులు విచ్చిన మోహము, ఇహము - పరము లేవన్నవి. ఈవల- ఆవల వద్దన్నవి. వెయ్యి కలువలు ఒక్కసారి విచ్చినట్టు, వేయి కన్నులు ఒక్కసారి తెరిచినట్టు, ఆ జిలుగుల వెలుగుల చూపులు, నా ముందట మెరిసిన క్షణమున, నా గుండె దొర్లి, పొంగిపొర్లి, ఎటువైపు వెళ్లిందో తెలియదు! నీకు కనిపిస్తే తెచ్చి ఇవ్వు. వద్దులే! నీచోటే... ఉండనివ్వు.


విరజాజులు కొమ్మ పై ఆడే సరసాలు చూస్తూ... మన మధ్య సాగిన సల్లాపాలను గుర్తు తెచ్చుకుంటున్నాను. నీ విసురులు, కసురులు, ముసి ముసి నవ్వులు, కసి తలపుల కన్నులు, వశ మగు చూపులు, నా ఉసురు తీసి వెళ్లినవని ఈ నిశి రాతిరికి చెప్పుకుంటూ ఉన్నాను.

ఆ రోజు నుంచి ఈరోజు దాకా ప్రతి మాటను, గడియారానికి అప్ప జెబుతున్నాను. గడిచిన గడియ గడియను, గడియలో ప్రతి నిమిషమును, నిమిషములో ప్రతి సెకనును, క్షణకాలమైనా... నిన్ను చూడక రెప్ప వేసానా? ఆ కనురెప్ప పాటులో... నీ కదలికను కోల్పోయానా?! గంధర్వ కన్య నైనా కాకపోతిని! రెప్పవేయని వరముండేదని.

నీ అరుణ వర్ణపు అధరములను, అవి గాంచి పైన వేసుకున్న బిడియపు తెరలను, నీ భుజములపై వాల్చిన ముఖమును, మన వెచ్చని చేతుల కౌగిలిలో వచ్చిన స్వేదమును, మన మనసులో మాటలను పాటలుగా పాడిన ఆ గాలి గొంతును, ఇంతకాలం చెప్పాలనుకుని వచ్చి ఇంకా దాక్కొని ఉన్న ఆ ఆశలను, మౌనంగా కళ్ళతో ఆడుకున్న ఊసులను, ఇన్ని నెలల పడిగాపుల తరువాత వచ్చిన ఈ ఊపిరి వడగాల్పులను, మొహమాటపు గొడుగులు అడ్డుపెట్టి మన మాడిన దోబూచులాటలను, మరల మోస్తూ ఉన్నా... నా మనికట్టుపై, నీ పిడికిలి బిగువును.

చంద్రమా... నా మనసు అద్దం పై నిన్ను చూసిన నాటి నుంచి నేటి వరకు, నే రాసిన ఇన్ని పిచ్చి రాతలలో ప్రతి అక్షరం నీకు అర్పించాను కదా! చెలించని సజ్జనుడివేమి నువ్వు?  సూర్యచంద్రుల నుండి ఊడి పడ్డావా? మనసు తెర చింపుకొని ఒక్క మాటైనా మాట్లాడవా? మన పరిచయము స్వప్నమా? మన ప్రేమ సత్యమా? ఒక్క మాట పలికితే... ఆ ముత్యపు మూటను నే దోచుకొని పోతాననా??

Thank you ☺️

✍️ Bhagyamati.





కామెంట్‌లు

  1. Amma, adbhutham gaa vundi. Ituvanti kastamyna kaalamlo mee kavitha, kadhanam, yentho vooratanu ichayi. kaani, naa doubt, meeru "kalam" peru pettukuni, posting cheyuta manchidi kadaa, mee vanti pratibha kala kavula manassu yenaadoo koodaa parijatham laagaa, prasanthamu gaa vundaali kadaa, dustulu, neechulu yevarynaa ibbandi padu comments pedataaru kadaa ani naa manavi. amma God bless you. Kavulu Gayakulu, Vidvamsulu definitegaa Dyva sambhoothulu.

    రిప్లయితొలగించండి
  2. 👌🏾👌🏾👌🏾👌🏾❤️❤️❤️

    రిప్లయితొలగించండి
  3. మీరు భాగ్యమతి కాదు మధుమతి, మధుర మతి … ప్రపంధ కవుల స్థాయిలో సాగే మీ కవనం అమోఘం.. మీ మనసులోని ఆ మన్మధుడు ఎవరో కాని ధన్యుడు. అదృష్టవంతుడు.

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నా మొదటి ప్రేమ... మా నాన్న!

  ఒక అమ్మాయి ఏ వయసులో అయినా ఉండొచ్చు కానీ ఆమె ఎప్పటికీ తన తండ్రికి చిన్ని యువరాణిగానే ఉంటుంది.  తండ్రీ కూతుళ్ల మధ్య ఉన్న ఈ ప్రత్యేక బంధం... ఆరాధ్య బంధం!.  ఒక తండ్రి తన కూతురిపై ఉంచే హద్దులు లేని ప్రేమ ఎప్పటికీ తిరిగి చెల్లించలేనిది.   బెస్ట్ ఫ్రండ్ తో షాపింగ్:  నేను రత్నం జూనియర్ కాలేజి లో చదివేటప్పుడు కాలేజి వ్యాన్, ఇల్లు తప్ప ఏం తెలియదు. డిగ్రీ కి వచ్చాక న బెస్ట్ ఫ్రెండ్ శ్వేత తో మొదటిసారి బయటకి వెళ్ళాను. ఫస్ట్ టైం వెళ్ళడం, నాన్నకి trunk road లో కనిపించాను. నా మైండ్ బ్లోక్ అయ్యి రెడ్ అయ్యి, బ్లూ అయ్యింది. మా నాన్న మాత్రం సింపుల్ గా షాపింగ్ కి వచ్చావా? డబ్బులు ఉన్నాయా? అంటూ 2000 ఇచ్చేసి వెళ్ళాడు. నాన్న అంటే అంతే మరి, నెక్స్ట్ లెవెల్.  నేను పెద్ద చిరంజీవి అభిమాని ని. నాన్న ఫస్ట్ డే ఫస్ట్ షో చిరంజీవి మూవీ కి తీసుకుని వెళ్తాడు. నేను తిరుపతి లో M.SC చేసేప్పుడు నాకోసం dairy milk బాక్స్లు కొరియర్ చేసేవాడు. చిరంజవి గ్రీటింగ్స్ పంపేవాడు. నాన్నకి నేను ఎప్పటికీ చిన్న పిల్లనే. నేను అబద్ధాలు చెప్పను. ఇప్పటికీ చెప్పను. అందుకే నన్ను మా అమ్మ, నాన్న బాగా నమ్ముతారు. నా ప్రాణ స్నేహితుడు నాన్న: చిన్నపుడ

ఇప్పటికి మేల్కున్నావా స్వామి?!

 తడిసి నీళ్ళోడుతున్న చీర కొంగును పిండుకుంటూ... అల్లంత దూరాన ఉన్న అతనిని చూసాను. కడవ నడుముకెత్తి తిరిగి మళ్ళీ మళ్ళీ చూసాను. ఎదుట ఏటుగట్టు వెనకనుంచి చుమ్మలు చుట్టుకుంటూ... తెల్లని పొగతెరలు, చెట్ల ముసుగులు దాటి వచ్చాను.  మామిడి చెట్టు ఆకుల గుబురుల్లోంచి, సన్నగా పడుతున్న నులి వెచ్చని సూర్యకిరణాలు.... మడత మంచంపై మాగన్నుగా పడుకుని ఉన్న నా మన్మధుడు. ఓయ్... అని కేక వేయాలనుంది, వాలుగాలిలో మాట కొట్టుకుని పోదా అని ఆగిపోయాను. తడక మీద ఆరవేసిన తుండువా లాగి దులుపుదామనుకున్నాను. గడుసుదనుకుంటాడని గమ్మునుండి పోయాను. పొగమంచు మేఘాల మధ్య చాచుకునే ఉంది. పసిడి పువ్వులు నా పిరికితనం చూసి నవ్వుకుంటున్నాయి. చెట్టు కొమ్మన కౌగిలించుకున్న రామచిలుకలు నీ మాటేమిటి? అని ఆరా తీశాయి.  సరే! నడుము మీద కడవ నిలవకుంది, అతనితో గొడవ పడమంది. నెత్తిన కుమ్మరిస్తే మేలుకొంటాడుగా?! అమ్మో కయ్యాలవాడు మాటలే కట్టేస్తాడు. వద్దులే రేగిపోయిన జుట్టును ముడి వేసుకుంటూ పక్కనే ఓ పూచిక పుల్ల కోసం వెతికాను. ఈ పడుచు వాడి కలలో ఏమొస్తుందో... నిద్రలోనే నవ్వాడు. చక్కనోడు చెంప మీద చంద్రవంకలు పూచాయి. మర్రి చెట్టు కాయలు ముసిముసిగా నవ్వుతూ... పుల్ల ఒకటి వ

ఇది యుగాలనాటి ప్రేమ!.

 రాధంటే... ఉత్తదేహం కాదు, ఉత్త మనసే కాదు, రాధంటే ఆత్మ. కృష్ణుని ప్రేమలో లీనమైన ఆత్మ. ప్రపంచానికి అర్థం కాని ఎన్నో విషయాలలో వీరి ఇరువురి ప్రేమ కూడా ఒకటి. వీరి శృంగారం మానసికమే! కానీ ఆత్మసంబంధం. ఏ ప్రేమ కథకైనా వీరే ఆదర్శం. ప్రేమ యొక్క గొప్పతనం పట్టాలంటే... కథలో చిత్రించే పాత్రలను రాధాకృష్ణలను ఊహించే రాయాలి. కృష్ణుని పై ఆశలు రేకెత్తించుకొని మనసును కృంగ దీసుకున్న రాధ ప్రేమ లోంచి విరహం అనే పదం పుట్టుకొచ్చిందేమో?! ప్రేమంటే మనసంతా కాముఖత్వం పులుముకోవడం కాదు, దేహవసరాలను తీర్చుకోవడం కాదు, ప్రేమంటే విశాలత్వం, దైవత్వం, విరహం, తపన, వేదన, ఎడబాటు, త్యాగం, కృష్ణుని రూపు కోసం పరితపించే రాధ దినచర్య. అందుకే రాధాకృష్ణుల ప్రేమ ఉత్త ప్రబంధ కథగా కాకుండా... యుగాలు చెప్పుకునే గొప్ప ప్రేమగాధ గా మిగిలింది. ఒక ప్రేమ కథను పైకెత్తి ఆకాశంలో ప్రవేశపెట్టాలన్నా... ఒక ప్రేమ గీతాన్ని, స్వర్గాన్ని తాకేంత ఆనందంగా ఆలాపించాలన్నా... రాధాకృష్ణుల ప్రేమే ప్రేరణ. ఇంత గొప్పగా మనం ప్రేమించాలంటే రోజు మనసుకి మెదడుకి మధ్య దేవాసుర యుద్ధమే జరుగుతుంది, అయినా నిలబడితేనే ప్రేమ గెలుస్తుంది. ఇక్కడ గెలవడం అంటే ఇద్దరు పెళ్లి చేసుకొని జీవించటం