భర్త గారి గాలి మాటలు, గాలి వాగ్దానాలు విని మళ్ళీ మోసపోయి, కాపురానికి వెనక్కు వెళ్లే భార్యలెందరో! ఇంతకాలం భరించడం నా అజ్ఞానం, ఇక భరించలేను అని సుజ్ఞానంగా పలుకుతూనే మరల తమ విజ్ఞానాన్ని కోల్పోయి, అతని వెనక వెళ్లిపోతుంటారు. అతగాడి నుంచి అదనపు జ్ఞానం పొందటానికే ఈ అగచాట్లన్ని. అమ్మగారింటికి పోవడానికి మొహం చెల్లక, సిగ్గుపడి అతనితోనే కాలం వెళ్ళబుచ్చుకుంటారు. ఇక్కడ ఈమె అభిప్రాయాన్ని మార్చుకోవడం తప్ప, అతని ప్రవర్తనలో మార్పేమీ రాదు. ఆమె నోరు మూసుకుని ఉన్నంతకాలం, దెబ్బలకు ఓర్చినంత కాలం ఇది పండంటి కాపురమే!. పక్కవారికి ప్రేరణ కూడా ఈ అన్యోన్య దాంపత్యం.
రంగనాయకమ్మ గారి "కళ్ళు తెరిచిన సీత" బుక్ చదువుతుంటే నాకెందుకో ఇలా రాయాలనిపించింది.
బట్టలు, సర్టిఫికేట్లు సర్దుకుని నెలకోసారి పుట్టింటికి పారిపోయే భార్యలున్నారు. ఇరుగుపొరుగు వారి మాటలు విని, అత్తరింటి రాయబారాలతో... మళ్ళీ తిరిగు ముఖం పడుతుంటారు. మళ్లీ వారం తిరగక ముందే ఈ విముక్తి నుంచి ఎవరు బయట వేస్తారు వారికి ఆ జన్మాంతం రుణపడి ఉంటాము, అని దేవుని ప్రార్థిస్తూ ఉంటారు. మనం ఆపదలో ఉన్నప్పుడు ఎదుటివారు సహాయం మనకు అంతలా అనిపిస్తుంది.
పడి పడి లేచాక, ఇక పడితే లేవలేం అని తెలిశాక, వెళ్లిపోవడానికే నిర్ణయించుకోవాలి. నిర్ణయించుకుంటే నిలబడాలి. వెనక్కి తిరిగి వెళ్తే... తిరిగిమళ్లి చూసే వాళ్ళుండరు. మళ్ళీ నిన్ను నమ్మేవాళ్లుండరు. వెళ్ళిపోయే ముందు మనసు వెలితిగానే ఉంటుంది. తిరిగి వెళ్ళేప్పుడూ... అంతే ఉంటుంది. అది గాయపడ్డ మనసు, దానిని సాయం అడగకుంటేనే మంచిది. అయినా అది అతని ప్రేమలో పడ్డప్పుడే పొరబాటుపడింది, ఇక ఎప్పటికీ తడబాటు పడుతూనే ఉంటుంది.
పెళ్లి చేసుకున్న పాపానికి ఇంట్లోనే ఒక మూల కుక్కలా బ్రతికే కన్నా... బయటకొచ్చి మనిషిలా ఒంటరిగా బ్రతకడం మేలు. అసలు అక్కర్లేదనే వాణ్ణి ఎంతకాలం పట్టుకుని ఊరేగగలం?. ఆడదానికి అవగింజైనా తెలివుంటే మనసు ముక్కలు కాకముందే బయట పడుతుంది. అందరి కోసం బ్రతకాలనుకుంటే అక్కడే ఉండిపోతుంది. ఈ అందరూ భర్త గారికి సంస్కారం నేర్పరు. భార్యకు పతివ్రత సూత్రాలు మాత్రమే నేర్పుతారు.
రోజుకొకసారి భార్యను అవమానిస్తూ నేర్చుకుంటే వచ్చేది కాదు భర్త గారి సంస్కారం. అతని తల్లిదండ్రులు నేర్పితే వచ్చేది. భార్యని పిడికిట్లో బిగించడం ఎలా? అనే పాఠాన్నే పదే పదే పలికించే తల్లులునంత కాలం, ఆ కాపురాలు అలానే ఏడుస్తాయి. పైగా ఇది కూడా భార్య కర్తవ్యాలలో భాగంగా చెబుతారు. భర్తను, బంధువులను, సమాజాన్ని తన సమర్ధతతో నెట్టుకోరాలేక ఆమెలో ఎన్ని ప్రశ్నలో?...
నువ్వు ఎవరు? నన్ను కొట్టడానికి, తిట్టడానికి, అవమానించటానకి, అనుమానించడానికి... ఎప్పటికీ ఇవే ఆమె ప్రశ్నలు. అన్నిటికీ అతని నుంచి ఒకటే సమాధానం "నేను మొగుణ్ణి", నేను మొగుణ్ణి. ఒక మూర్ఖుడికి మొగుడు అనేది ఒక అధికార కంకణం కావచ్చు కానీ ఆమెకు అది పక్కలో బల్లెం కాకూడదు. మంత్రాల పెళ్లిళ్లలో భార్యాభర్తలు ఎలా మసులుకోవాలో చెప్పే సూక్తులు... భార్య భర్త యొక్క ప్రక్కటెముక అని చెప్పే బైబిల్ వాక్యాలు ఈ ముర్కులకి పట్టవులేండి.
ఇలాంటి వాడితో వేగలేక ఓ మూలన తల మొత్తుకునే కన్న, తల ఎత్తుకుని ఒంటరిగా బ్రతకడం మేలు. సమాజం కూడా ఎంతో మారింది. సతాయించే మొగుడు అనే మగాడే కాకుండా... ఉద్యోగంలో నిస్వార్ధంగా అక్కలా, స్నేహితురాలిగా ఆదరించే మగవాళ్ళు చాలా మందే ఉన్నారు. మునుపటిలా ఆమెను నిందించే సమయం జనాలకు లేకపోవడం కూడా ఒక కారణం కావచ్చు. సర్దుకుపోయే వారికి కాదు నా ఈ సలహా!. ఇక సర్దలేక వృధా అయిపోయే జీవితాలకు మాత్రమే!
Thank you 🙏
✍️ Bhagyamati.
👍
రిప్లయితొలగించండిThank you 😊
తొలగించండిSuperb words bhagyamati ji👌
రిప్లయితొలగించండిThank you 😊
తొలగించండిBaga rasaru Kani writings lo Maro Ranganayakamma kanipistundi mee ratalaku ,aalochanalaku bhinnam ga undo .KODDI SEPU REBEL QUEEN ANNVACHO NEMO
రిప్లయితొలగించండిThank you 😄
తొలగించండిChala correct ga cheppav Bhagi 👏👏👏
రిప్లయితొలగించండిThank you
తొలగించండి