పుడమిపై లేడు కానీ... పున్నమి వెన్నెలలో వెతికాను. తన జాడ లేని ఈ పున్నమి ఎక్కడిది?? ఈ తెల్లని వెన్నెల ఎక్కడిది?? నింగికెగరి వెతకాను, మబ్బులను పక్కకు తోసి చూసాను. మంచు కొండలపై కలిసిపోయాడని మరీ మరీ వెతికాను. అలిగి నాపై దాక్కున్నాడని, అందరాని చందమామ కోసం జగమంతా... వెతికాను. ఆకాశానికి నిచ్చెనేయగలనా... ఆ అల్లరి చూపుల వానిని పట్టుకోగలనా?? ఆ ముద్దు పెదవుల అందం, ముత్యాలు నిండిన బుగ్గ సొట్టల చందం... ఇక ఎక్కడైనా చూడగలనా?!.
"అమ్మ" అని ఆశ తీర పిలవాలని ఉంది. ఒక్కసారైనా దరికి చేరి చూడాలని ఉంది. చిన్ననాటి అమ్మ ప్రేమ ముద్ద, ఈ చందమామను చూసే తిన్నాను, ఇతను నింగి నలిగి నేలకొచ్చాడా? నేలపై అలిగి నింగికెళ్లాడా? ఎప్పుడొచ్చాడో... ఎప్పుడెల్లాడో... అర్థవసంతమైనా కాలేదు, అందాల చంద్రుని ఆచూకీ లేదు. తెలుసుకోవాలనుకుంటున్నాను, ఈ తెల్లని చంద్రుని తేట తెల్లం కాని ఈ జాడలను.
బ్రతుకు సఫలమయ్యే రోజు వరకు నిశబ్దపు కాలంతో... నిట్టూర్పుల యుద్ధం చేశాను. గుండె శబ్దమొక ప్రేమ మంత్రమై, జపించి, అతనికై తపించి తన మనసు వాకిట ప్రేమ వర్షమై కురిసాను. ప్రేమ పడవను కట్టి, పల్లానికి కొట్టుకుని పోతున్నాను. గట్టిగా రాయేదో... తగిలి ఆగిపోయాను, గుండె నెత్తురు చిమ్మకుండా గట్టిగా... అదిమి పట్టుకున్నాను.
చల్లని సంద్యగాలి ఎర్రని సూర్యుని మోసినట్టు, కోనేటి నీరు కలువని పైకెత్తినట్టు, మేగాలు ఒక్కటొక్కటిగా పక్కకు జరిగినట్టు, నా చంద్రుని జాడను మెల్లగా వెతికాను... నెలవంక తానై నవ్విన ఊహలు... నా సిగ్గు చెంపల పై పూసిన గులాబీలు... ఒక్కోటి కోసి మాల కట్టి, వస్తాడేమో చూస్తున్నాను, మేఘాలతో కబురంపాను. హరివిల్లు పై నిద్రిస్తున్నాడేమో... అన్ని రంగులలో కలిసిపోయి కనిపించకున్నాడు.
ఏనాడో ఒకనాడు నా ఊహలకు ప్రాణమొస్తుంది, ఊపిరి పోసుకొని అతని రూపు నా ముందుకొస్తుంది. కవిని నేను!, నీ కల్పనలో... కాపురముంటాను. నీ కౌగిలి వద్దు నాకు, నీ కుశలము చాలును. మరుజన్మ ఉంది మనకు. మనసారా... వేడుకుంటాను మాధవుని. మసక మబ్బుల జాతకమిది, మంచి రోజులు రావని, మొండి గుండెను మోసుకుంటూ... మరలా పుడతా నీకోసం, మరచిపోకు నేస్తం, ఇది నా ప్రేమ ప్రమాణం.
Thank you 🙏🏻.
✍️ Bhagyamati.
Excellent
రిప్లయితొలగించండిThank you 😊
తొలగించండిBagundandi.
రిప్లయితొలగించండిThank you
తొలగించండి