పున్నాగ పూవుల నీడలలోన...
అందాల గంధపు గాలులు వీచే!
చిన్నారి మనసును తెచ్చి,
శ్రీరంగనాథునికిచ్చి,
మందార పూవులా... ఎర్రగ కంది,
ఇన్నేళ్ల ప్రేమను చిలకలు చుట్టి,
తన బంగారు వేళ్లకు బహుమతి నిచ్చి,
గులాబీ మొగ్గల పెదవుల మధ్య
మాటల వీణల పాటలు పాడగా...
వయ్యారి కన్నులు వాలుగ చూడగా,
వందేళ్ల పండుగ...నీవే నిండుగా.
మరుమల్లే పూవుల యుద్దమో,
కస్తూరి జింకల స్వేదమో,
ఏ మలయ పర్వత మారుతమో...
ఏ చందన పరిమళ ప్రళయమో ...
నన్నెత్తుకెళ్లెను నింగిలోకి.
ఈ మత్తు గాలిలో గువ్వగ ఎగిరి,
నా రెక్కల ఊయల కట్టి,
నిన్నేగరేసుకుపోనా...
చుక్కల పక్కకు తీసుకుపోయి
చంద్రునితో తులతూయనా...
నీ కన్నుల అందము,
ఏ వెన్నెలకీ...రాదని చాటి
నీ రాధని, నా ప్రేమ గాధని,
ఆ నింగిపైన రాసిరానా!.
అందాల భరిణవు నీవని,
వందేళ్ల ఆయువు ఇమ్మని,
శ్రీరంగనాథుని కోరి...
చామంతి పూవుల మాలను కట్టి,
నా బంగారు స్వామి మెడ వంపులపై
శృంగార మంత్రము జపియిస్తూ...
గాలుల్లో ప్రేమ గంధము జల్లనా!
ఏ పూవుల ఒడిలో సుగంధమో,
ఏ తుమ్మెద రెక్కలు తెచ్చెనో...
నా మనసు తాకిన క్షణమున,
ఈ కవితల రూపము మారెను.
ఏ గాలి చెప్పిన సందేశమో...
అంతర్జాలపు ఇంద్రజాలమో...
నే ప్రేమ విహంగమై ఎగిరాను.
ఈ ఎగిరే రెక్కల ఆయువు,
నీవిచ్చిన దీవెనే స్వామి!
Thank you 🙇🏻♀️,
✍️ Bhagyamati .
మత్తు గాలిలో గువ్వగ ఎగిరి
రిప్లయితొలగించండినా రెక్కల ఊయల కట్టి,
నిన్నేగరేసుకుపోనా... భాగ్యమతి నీ మనస్సును గెలిచే రాకుమారుడు చాలా అదృష్టవంతుడు సుమీ
Thank you 🤗
తొలగించండిBhagyamati✍️
తొలగించండి