పసుపు గడపకు, ఎదురుచూపుల ఎరుపు రంగులద్ది, తళుకుతారల పవిట కప్పుకుని, తమరి కోసం చూస్తు ఉన్నాను. నీలిరంగు చీరపై నా నీలాల కురులు పరచి, నచ్చినవాడు దొరికాడని ఈ వెచ్చని రాతిరికి కబురులు చెబుతున్నాను. పసిడి బొమ్మగా మారి పలుకు తేనెల చిలుకనై కొత్త పలుకులు నేర్చుతున్నాను. కులుకు నగవుల బిగువులు, నుదుట కుంకుమ జిలుగులు.... నా అదురు బెదురు చూపులు, అన్నీ మీవే!. నా పెదవులపై ఒలికే ఈ మధువుల చినుకులు మీ అదరముల చేర్చే త్రోవున్నదేమో చెబుతారా?!
మిమ్ము చూసిన నాటి నుంచి ఈనాటి వరకు, మీ చూపు జల్లిన సప్తవర్ణాల వానలో తడిసిపోతున్నాను. నా విశాల ప్రపంచానికి కొత్త వర్ణాల నద్దుకున్నాను. గతం తాలూకు నలుపు తెలుపుల రాతిరులు, నన్నిక గాయం చేయలేవు. మీ తీపి పలుకుల మబ్బుల తెరలు నా మనో ఆకాశమంతా పరుచుకున్నాయి. వెన్నెల్లో చిన్న పిల్లనై అల్లిబిల్లి తిరుగుతున్నాను. కళ్ళకపటమెరుగని మీ మనసు నాకు కమ్మని కథలు చెప్పింది. మీ మాటల్లోని నిజం, నా మనసు గాయాలపై మందు పూసింది. కళ్ళముందు మీరున్నట్టు కొత్తగా ఏదో రాయమంది.
నా కళ్ళ ముందటి ఆ రూపుని నేను మరువనే లేదు. మసకగానే మోసుకొచ్చిన కొన్ని రూపురేఖలను మళ్లీ మళ్లీ తలుచుకుంటూ వెన్నెల పేరు పెట్టుకున్నాను. మీ ముద్దు పేరది చంద్రమా!... మీ యద పై ఒద్దికగా నన్ను చేర్చుకోమని, మన హృదయపు సడులను ముడివడి కూర్చుకోమని, ఆపై బిడియపు తడికలు తగవుకు జొరబడితే... తరిమేయమని మీకు మనవి.
నేను నీ దానిని - నీవు నా వానివని, అరచేతులద్ది... ఈ ఆరడుగుల వాని పాదములకు నా అధరముల ముద్దాడనా!. నిదురించే నా హృదయం లో స్వప్న సౌధాన్ని కట్టిన నా చెలికాడికి ఏమివ్వను?!. ఈ రూప లావన్యాలు అంద చందాలు తెలియదు నాకు. ఏ మాలిన్యము లేని మనసే గొప్పనుకుంటాను. మరి ఈ గొప్ప మనసున్న వానికి ఏమివ్వను?! నా ప్రాణమేం ఖరీదని ఇవ్వను?! నా దేహమెటులనో తనదే కదా!. మరేమివ్వను నా మనసు మారాజుకి?!. అడిగిచూసి తడుముకుంటున్నాను, అసలుందా అంతగా నాలో ఏదైనా...తనను తాకేంత విలువైనది???
Thank you 🙏,
✍️ Bhagyamati.
Good nice writing ✍️
రిప్లయితొలగించండిThank you 🙏
తొలగించండిచాలా బాగుందండి ఫీల్ తో రాశారు.
రిప్లయితొలగించండిThank you 😊
తొలగించండిమీ మాటల్లోని నిజం, నా మనసు గాయాలపై మందు పూసింది. కళ్ళముందు మీరున్నట్టు కొత్తగా ఏదో రాయమంది. 👌👌👌👌
రిప్లయితొలగించండిమీ మనస్సులో చలం దూరి, భావాలు కురిపించేసాడు. ఈ కాలం అమ్మాయిలలో ఇంతటి లోతు అయిన భావనలు ఊహించలేము. 👍🙏
రిప్లయితొలగించండిThank you sir
తొలగించండి