ఇప్పుడే గుడి మెట్లు ఎక్కాను, భక్తులతో... అలయమంతా రద్దీగా ఉంది. సాక్షాత్తు శ్రీనివాసుని దర్శించాలని, శ్రీవారి సేవలో తరియించాలని వేయి కనులతో వేచిన అలివేలు మంగనయి అతని కోసం ఎదురు చూసాను. కోర్కెల చిట్టాలతో భక్తుల పాట్లు ఏలనో?. నెరవేర్చు వాడు నెరవేర్చక మానడుగా!. కర్మలను ఆయనే రాయును, కార్యములు ఆయనే చేయును. ఇంతలో ఈ తన్నులాట లెందుకు? తరియించక!
అనంత పద్మనాభుడయి ఆ శయన మందు పవళించినా... మానస లీలా చోరుడై మురళిని ధరియిన్చినా... శ్రీరామ చంద్రుడై సీతను వరియించినా... నీల మేఘ స్యాముడై యశోద ఒడి దెంచినా... ఆతను ప్రతి అవతారమందు పవిత్ర రూపుడేగా, పరమానంద భూషుడేగా. అతనిక ఆజానుబాహుడు, అరవింద నేత్రుడు.
నాభి యెందు పద్మము కలిగినా... పద్మ మందు లక్ష్మిని కలిగినా... లక్ష్మి హృదయమందు మహా విష్ణువతడు. క్షీర మంత సంద్రములో స్నానమాడేటి పాల నురగల కనులవాడు. చేప పిల్లలకు ఈత నేర్పే చేతి వేళ్ళ వాడు. చంప మీద నునుపుటద్దపు చెక్కిలివాడు. చెక్కిలి యందు చంద్రవంకలా... చుక్క కలవాడు. చదరంగపు చతురతల చమత్కారి వీడు. అమ్మ పద్మావతిని, అలివేలు మంగను, అసలమాంతం ఏడు కొండలను పట్టిన వాడు. ఒట్టి చేతులతో... గట్టి హుండీలను పట్టినవాడు. పరమ నేర్పరి ఈ పంకజ నేత్రుడు.
కొండపై కూర్చొని భక్తుల కునుకు కాచెడి వాడు, పరమ పావనుడు. గోరంత భక్తికి లొమ్గేటి వాడు, గోవర్దనమును పైకెత్తిన వాడు. కాలిందిని సైతం మచ్చిక చేసి కాలి అడుగులు అద్దిన వాడు, కనక విబూషణుడు ఈ కమలాకరడు. భక్తి మాత్రమె చాలును ఏ బహుమతులడుగడు, బంగారు నవ్వుల వాడు. చిత్తరువై చూసే వేళ చిన్ని దయ జల్లెటివాడు. చిద్విలాసమతనికి ఈ చంచల లోకము.
అనుదినము అతని భక్తిలో తరియించగ సంపన్ను లెందరో... అయినా తాను, పేద జీవికి ముందుగా నొసగును. అన్న ప్రసాదములైనా స్వీకరించునో... లేదో...స్వామి? అడగకుండానే భక్తులకు అనంతములిచ్చును. ఆది విష్ణువు తాను! అమ్మ భూదేవికి, శ్రీదేవికి అంతయు తానైన వాడు. అష్టైస్వర్యాలతో... అలంకరించుకునేటి వాడు. అతనారాద్యుడు అందరికీ... అవ్యక్త బావ ప్రకటనలో... అనంత విశ్వమందు విహరించే... వినీల లోచనుడు.
అసలాతని కన్నుల వెలుగు...ఏ సరసు నీదే వెన్నెల సొగసో?!. అతని సౌందర్యమసలు భువికి ఏల దెంచనో? భువనమంతా... తిరిగినా ఆఖరికి ఆ ఏడుకొండలే దిక్కగును. నా చివరి శ్వాసకు నేనెంచుకున్న గమ్యమైనా... నా కడపటి జన్మకు ఇటులనే... నే పయణమయినా!
Thank you🙇🏻♀️
Bhagyamati ✍️.
💐💐💐🤝🤝🤝🎉🎉🎉
రిప్లయితొలగించండిThank you
తొలగించండి