సముద్రం ఎప్పుడూ నీటితో నిండి ఉంటుంది. మన హృదయాలు ఎప్పుడూ ప్రేమతో నిండి ఉంటాయి. అందుకే మనసు పరవశించే ప్రదేశం సముద్రం. జీవనది కూడా జలకమాడటానికి ఇక్కడికే వస్తుంది. వయ్యారి నడుముని అటు ఇటూ తిప్పి చివరకు ఈ సంద్రం లో కలిసిపోతుంది. తియ్యటి నీళ్లను తీసుకొచ్చి, ఎంత దూరమో పయనించి ఈ మగనితో కలిసిపోతుంది. నదికెంత ప్రేమో రాతి ఉప్పుతో రాసలీలలాడుతుంది.
తెల్లటి ఇసుక పై ఏడాది పొడుగునా విహారయాత్ర చేసే నత్త గుల్ల నై, చిన్న చిన్నగా నడుస్తూ... ప్రతి ఇసుక రేణువులను తడిమి చూస్తూ... విహరించాలని ఉంది. పైకెగసిపడే అలలతో పోటీపడి కొట్టుకునే గుండెని కొంచెం సేద తీర్చాలని ఉంది.
ప్రశాంతమైన, క్రూరమైన సముద్ర శబ్దాన్ని మళ్ళీ మళ్ళీ వినాలని ఉంది. ఇసుక ముద్దల కింద కాలివేళ్ళని దాపెట్టి... తీరాన్ని ముద్దాడి వెళ్ళే కెరటాలను చూడాలని ఉంది. పైపై అలలలో కొట్టుకు పోతూ... ఉప్పు నీటి శ్వాసలో విధ్యుత్ శక్తి పొందాలనుంది. పట్టుకుంటే జారిపోయే గవ్వలను, చుట్టూ కమ్ముకునే హోరైన గాలి శబ్ధాన్ని, మౌనంలో... గుండె లోతుల్లో... జవాబు దొరకని ప్రశ్నల్ని, ఒదార్పు నిచ్చే అత్మని ఒకసారి మళ్ళీ కలవాలనుంది.
అలలను లాగి విసిరే ఈ సముద్రం ఎంత సేపటికీ అలిసి పోదేమి? తీరంలో సేద తీరే మనకోసం శాంతి నిస్తూ... తను విశ్రాంతి తీసుకోవడం మరిచింది.
ఈ తీరం వెంట మన అడుగులు చెదిరిపోయిన, మనం ఈ సముద్రపు వలలో చిక్కుకునే ఉంటాము. ఉప్పు నీటి కవ్వింపులు ఊహల్లో ఊగిసలాడు తుంటాయి. మళ్ళీ మళ్ళీ వచ్చి రుచి చూసి వెళ్ళమంటాయి.
సముద్ర గర్భం, గుండె లోతులా నిశి తో నిండి ఉన్నా... నిర్మలంగా ఉంటుంది. ఆల్చిప్పల్ని, ఆణిముత్యాలని అడుగడుగునా మొస్తున్నా... నీటి నురగలని మాత్రమే పైకి చూపుతుంది. ఏ ఆడంబరం లేని అందమంటే ఇదే మరి.
చేతికందే దూరంలో చందమామ ఉన్నా చేయి అయినా చాపదు. ఆశలేని సంద్రాన్ని, నిరాడంబరమైన ఆందాన్ని ఇక్కడే చూస్తాము. ఆలోచించడానికి ఇష్టపడే ఆలోచనలు మాత్రమే ప్రేరేపించే ఈ గాలి లో... తీరం వెంబడే నడిచేంత అయువుని నా ప్రేమకు ఇవ్వమని కోరుకుంటాను.
ఎగసిపడే అలల పౌరుషాన్ని...
వెనక్కి తోసే ఇసుక దైర్యాన్ని...
సూర్యాస్తమయం లో ఆటు పోట్లని...
పౌర్ణమి నాటి సముద్రపు ఆవేశాన్ని...
నింగి నేల ఏకమయ్యే అవతలి ఒడ్డుని
తనివితీర చూడాలని మనసు తపన పడుతోంది.
Thank you ⛵
Bhagyamati ✍️.
👌👌❤️❤️❤️🤝🤝🙏🙏💐💐
రిప్లయితొలగించండిThank you 😊
తొలగించండి👌
రిప్లయితొలగించండిThank you
తొలగించండివాహ్, అద్భుతః
రిప్లయితొలగించండిThank you
తొలగించండిSuper nice
రిప్లయితొలగించండి