నా దేశం మూడు రంగుల జెండా కాదు, నా దేశం మూడు అక్షరాల పదం కాదు, నా దేశం మూడు పార్టీల ఎన్నిక కాదు. నా దేశం అతి పెద్ద ప్రజస్వామ్య దేశం. నా దేశం అతి పెద్ద రాజ్యాంగ పుస్తకం. పరాయి సంకెళ్లు తెంచుకున్నా... మనలో మనం వేసుకున్న సంకెళ్లు తరాల తరబడి చేతి గాయాలై... నెత్తురోడుతుంటే... పుట్టిన అక్షరాల కత్తి ఈ రాజ్యాంగం. కులం గుంపుల కొట్లాటలను, మతం చేసిన మాయలను స్మశానం పంపి సమాధి కట్టింది ఈ రాజ్యాంగం.
పదాలు జొరబడలేని అనుభవాలు యెన్నో ఉన్నాయి. దేశం కోసం విడిచిన ప్రాణలెన్నో ఉన్నాయి. చరిత్ర కెక్కిన పోరాటవాదులు, చరిత కనులు చూడని సమర యోధులు...అందరినీ స్మరించుకుందాం... ఎపుడో ఏడాది కొకసారి ఇది మన ధర్మం. సహనం కట్టలు దెంచుకున్న కవులు కలమెత్తారు, విప్లవ గాయకులు గళమెత్తారు, మువ్వన్నెల జెండా రక్తపు మడుగుల్లో తడిసింది. పేదవాడి కడుపు ఆకలికి ఏడవలేదు, అన్నానికి ఏడలేదు, స్వతంత్రం కోసం అందులోని సమానత్వం కోసం ఏడ్చింది.
నేడు ఉన్నవాడు, లేని వాడు, లేనే లేడు ఇది నా దేశం. ఇక్కడ మనమంతా... సమానం. మూడు రంగుల జెండా కప్పుకున్న సీతా కోకలం. విదేశాలకు ఎగిరే పక్షులు కొన్ని ఎత్తుకొచ్చిన జ్ఞానం, ధనం, అమ్మ భరతమాతకు ఇస్తుంటే, తత్వ మెరిగిన స్వదేశీ పక్షులిక మనం, దేశం కోసం పాటు పడుదాం.
అమ్మ భారతి కి అందరం పిల్లలం. ఇక్కడ మా మగువలది ఒక చిన్న విన్నపం... మేము కూడా కోరుకుంటాం స్వేచ్చా... స్వతంత్రం. దేశ జనాభాకే కాదు, ప్రగతికి కూడా మేము అవసరం. సమాజం, మగవాడు కొత్తగా...వింతగా... చూడకండి మేము కూడా మీలా మనుషులం. మీరే స్వతంత్రం ఇస్తే సమానత్వం కోసం రాజ్యాంగం లో ఎందుకు కొట్టుకుంటాం?.
జీవ వైవిద్యం పేరుతో మొక్కలను, జంతువులను కాపాడుకుంటూ ఉన్నాం. పర్యావరణ పరిరక్షణ పేరుతో ప్రకృతిని కాపాడుకుంటున్నాం. మరి మేమేం తప్పు చేశాం? నాన్న ప్రేమలో మునిగి పోతున్నందుకా? మగని ప్రేమలో మోసపోతున్నందుకా? కట్టుబాట్లలో ఇరుక్కు పోతునందుకా? విదేశాల్లో చదవనీయండి, ఉద్యోగాలు చేయనీయండి, నచ్చిన వారిని పెళ్లి చేసుకునే స్వతంత్రం ఇవ్వండి, మాకు నచ్చినట్లు బట్టలు వేసుకోవడానికి, అలంకరించుకునేందుకు స్వేచ్చనివ్వండి, అసలు ముందు ఆడపిల్లగా... పుట్టనివ్వండి.
మాలాగే కొన్ని వర్గాలు ఇంకా... కూలబడే ఉన్నాయి, భవిత కోసం బారులు తీరే ఉన్నాయి. అందుకే కొత్త పందాలను తొక్కుతూ... ఇంకా కొత్త రొక్కలను కట్టుకుందాం. మన దేశ హద్దుల వైపు శాంతి కపోతాలమై స్వేచ్చగా ఎగురుదాం.
జైహింద్.
Thank you 🙏🏻
Bhagyamati ✍️.
Super
రిప్లయితొలగించండిThank you
తొలగించండి