ఆశల ఆకాశం అంతెత్తులో ఉంది. అక్షరాలు మబ్బులలో తేలి పోతూ... ఉన్నాయి. కోరికల చెట్టుకి కొత్త పూలు పూశాయి. కోసి మాల కడదామంటే... తనివి తీరా వేద్దామంటే... తరచి తరచి చూద్దామంటే... అసలతను ఏడి? రాణి గుండెకు రాజైన వాడు రానే వస్తాడు, రాగ బందపు ప్రేమ గంధము తేనెతెస్తాడు.
అందమైన చెలికాడు అక్కడెక్కడో ఉన్నాడు. ఆకాశం శూన్యమై నల్ల ముఖం వేసింది. అందరానివాడి కోసం హృదయమరువు చాచింది. అసలెందుకే మనసా? అలసిపోవే కాసేపు. అతని హృదయ మెందుకు నీకు? నీ హృదయముంది చాలదా... తుది వరకు.
జారిపోకే పిచ్చి మనసా! జారు తున్నావని తెలుసు కనుక. లేత ప్రాయము కాదిది, మరల దొరకదు పోయినది. తొంగి చూడకు గుండెలోకి, తొలకరి జల్లు కురువదు. తొణికిసలాడే మనసుకు తొందరెందుకు ప్రతి మాటకు? ఆగి పలికే మాటలకు అర్థముంటుంది, ఆగకుండా పరిగెడితే ప్రేమ వ్యర్ధమవుతుంది. అన్ని తెలిసిన వేళ ఈ అలజడి ఎందుకు? అవతలి వానికి లేని ప్రేమ నీకెందుకు? ఎదురు చూసిన మనసుకేం మిగిలింది? ఆకలి దప్పులు లేక క్రిందికొరిగింది.
ఇన్ని ప్రశ్నల మధ్య ఇతనెక్కడ?
ఇక్కడెక్కడో ఉన్నావని, ప్రేమ చినుకులన్ని ఒడిసి పట్టి, ఒడిన కట్టి, మనసు దారము మధ్య పెట్టి, పలుకులన్ని అల్లికలై... పలుకుతున్నా నీ చెలినై. సమయముందా... నా కొరకు, చెలిమినై ఉంటాను కడవరకు. తొలిప్రేమ లోనే కాదు, మలి ప్రేమ లోనూ... ఇలానే ఉంటాను, నీకు గులామునవుతాను. మళ్లీమళ్లీ నిన్నే ప్రేమిస్తుంటాను... మరణమొచ్చినా ఎదిరిస్తుంటాను.
చల్లని అక్షరాల గొడుగు పడతాను. నీ తెల్లని గులాబీ కన్నులు నిదురించే వేళ... మెల్లగా జోల పాడుతాను. మళ్ళీ అమ్మనై నా ఒడిన నిద్దురోపుతాను. మరీమరీ అడుగుతున్నాను మరి. మరు జన్మకీ మరల వస్తావా? నీ మగువగ నన్ను స్వీకరిస్తావా?!.
Thank you🙏🏻,
✍️ Bhagyamati.
డైలీ పొదలకూరు కి సచివాలయం డ్యూటీ కి వెళ్తూ..అటు ఆఫీస్ వర్క్ + ఇంట్లో పనులు చూసుకుంటూ.. ఒక రచయిత లా ఇలా రాస్తుంది నువ్వేనా.. లేక నీ పేరుతో మీ హస్బెండ్ రాస్తున్నారా..?
రిప్లయితొలగించండిThank you
తొలగించండిJust casual words.. don't be seriously..🙏
రిప్లయితొలగించండి