బంధాలు 3 రకాలుగా ఉంటాయి. భౌతికమైనవి, మానసికమైనవి, ఆత్మసంబంధమైనవి. మనం మాట్లాడుకునే సోల్మెట్స్ అనే పదం ఆత్మ సంబంధమైనది. నా స్నేహితురాలు నన్ను అడిగింది, soulmates ఉండరా? అయితే! అని. నాకు కచ్చితంగా తెలియదు. భౌతికమైన బంధాలను పక్కన పెడితే మానసికమైనవి, ఆత్మసంబంధమైనవి పరిపూర్ణంగా ఉండే బంధాలు. అంటే ఉన్నంత కాలం కలిసి ఉండేవి.
పాతకాలపు బంధాలు:
మన అమ్మ నాన్న, వాళ్ల అమ్మ నాన్న ఎంతో అనురాగంతో ఉన్న జంటలు. చిన్నపుడు మనకు soulmates అనే పదం తెలియక ముందే వీళ్ళు మనకు తెలుసు. మనం గొప్ప ప్రేమికులం అని, మనది నిజమైన ప్రేమ అని చెప్పుకోవాల్సిన అవసరం అప్పట్లో మన పెద్దవాళ్ళకి లేదు. అయినా వాళ్ళు గొడవలు పడ్డారా అసలు, అది కూడా మనకు తెలియదు. వాళ్ళకి ప్రేమ అంటే తగ్గడం, క్షమించడం, సర్దుకు పోవడం. నువ్వు ఏం చేసినా నువ్వు నాకు ఇష్టం అని నమ్మడం. అందుకే వాళ్ళు soulmates అనే పదం వాడకుండా soulmates గా ఉన్నారు.
కాలంతో పాటు మరిపోవాలి:
మారిపోవాలి మన అభిరుచులు, స్టైల్, మాట తీరు... ఇంకా ఎన్నో. మనసులోని సున్నితత్వం, క్షమాగుణం కాదు. Orange సినిమా వచ్చి 13 సంవత్సరాలు అయింది. ఎవరికి నచ్చని, ఒప్పుకోలేని నిజాలు అందులో ఉన్నాయి. నేను కొంతకాలమే ప్రేమిస్తాను అంటాడు హీరో. ఆ ప్రేమించిన కొంతకాలం చాలా గొప్పగా ప్రేమిస్తాను, నా అంత గొప్ప ప్రేమికుడు లేడు, ఐయాం ఎ గ్రేట్ లవర్ అంటాడు.
గొప్పగా ప్రేమించేవాడు అంటే సోల్మేట్ కదా! కాలం గడిచే కొద్దీ ప్రేమ తగ్గిపోతూ ఉంటే... సోల్మేట్ మారిపోతాడా? అంటే ఇక్కడ గొప్ప ప్రేమికుడు ఉన్నాడు కానీ అతను soulmate కాదనే కదా?!
అసలు సోల్మేట్ అంటే ఏంటి?
ఇద్దరూ ఒకే అభిరుచులు కలిగి ఉండి, మాట తీరు కలిసి, పరస్పరం ఆకర్షణ, ప్రేమ కలిగి ఉండి గొప్ప ప్రేమను ఇవ్వగలవాళ్ళు, అందుకునేవారు soulmates అని నిర్వచనం ఉంది. వీరు స్నేహితులు కావచ్చు, ప్రేమికులు కావచ్చు. ఈ సోల్మెట్స్ ఎంత దూరంలో ఉన్న ప్రపంచంలో ఏమూలనో ఉన్నా... ఒకరినొకరు కలుసుకుంటారని, ఇద్దరు కలిసే... ఉంటారని నమ్ముతారు. ఇలా అనుకునే వాళ్ళు మరి ఎందుకు విడిపోతున్నారు? అప్పుడు వాళ్ళు చెప్పే కారణం ఏంటి? అతను నా సోల్మెట్ అనుకున్నాను, కానీ కాదని ఇప్పుడే తెలిసింది అంటారు.
విడిపోయిన వాళ్లు విడిపోయినట్టు ఉండగా మళ్లీ కొత్త వాళ్ళని వెతుక్కుంటారు. వీళ్ళే మా soulmate అంటారు. ఈ కన్ఫ్యూజన్ అంతా సృష్టించింది సినిమాలు. తెర మీద చూపించింది నిజానికి నిజం కాదు, అమ్మానాన్న నుంచి సమాజం నుంచి మనం నేర్చుకున్నవే నిజాలు.
Soulmate కావాలంటే?!
తాడు తెగిపోయేటప్పుడే దాన్ని గట్టిగా పట్టుకుంటాం. అలానే బంధం బలహీనమయ్యేటప్పుడే బలంగా పట్టుకోవాలి. అప్పుడు బలహీనమైతే ఆ బంధం పూర్తిగా తెగిపోతుంది.
భారతదేశ కుటుంబ వ్యవస్థ విచిన్నమైపోతుందని గోల పెట్టే సామాజిక సంస్కర్తల లాగా కాదు కానీ, మన అమ్మానాన్న లాగా వొద్దికైన జంటలు రాబోయే తరంలో కూడా ఉండాలని ఆశిద్దాం. మనం తిన్నప్పటిలాగా ఇప్పుడు అంత ముద్దుగా ఉండము, అయినా మన అమ్మానాన్న మనల్ని చక్కని తల్లి, బంగారు తల్లి అంటుంటారు. మనం మన పిల్లల్ని అరచేతిలో చిట్టి పాపాయిలుగా చూసినప్పుడు మనకంటే పొడవై, పెద్దగా ఇప్పుడు కనిపిస్తుంటే చిట్టి తల్లి అనే పిలుస్తుంటాము. ఎందుకంటే... ఇవి ఆత్మ సంబంధమైన బందాలు అని నేను నమ్ముతాను.
అలానే ఒకసారి ముడిపడ్డ బంధం రాను రాను ఆకర్షణ, ప్రేమ తగ్గిపోతున్నా...
నేను ఇంకా ప్రేమిస్తున్నాను,
నువ్వు తప్పు చేస్తే క్షమిస్తాను,
నువ్వు ప్రేమిస్తే స్వీకరిస్తాను.
నీ ప్రేమ కోసం ఎదురు చూస్తూ ఉంటాను.
అని మనలో మనం గట్టిగా తీర్మానించుకున్నప్పుడు అతనే మన soulmate. మనతో చనిపోయేదాకా ఉండే ఆత్మబంధం.
Thank you🙏
Bhagyamati✍️
❤️❤️❤️❤️❤️❤️
రిప్లయితొలగించండిThank you
తొలగించండిSuper
రిప్లయితొలగించండిThank you
తొలగించండి