నిజమే! కొన్ని ఉంటాయి అలా...
అందమైనవాడు ఏది పలికినా... అందమే అన్నట్లు, సత్యము మాత్రమే పలికే ఈ సుగుణ వంతుని ఎన్ని పొగిడినా... ఎంత కీర్తించినా... పదములే కరువగును. ఇతని పాదముల మోకరిల్లిన, జన్మమే దన్యమగును.
ఊహాలకందినవారు కవులు, ఊసులాడిన వారు పుణ్యాత్ములు, పాడి భజనలు చేసినవారిక పండితులు, అనుదినం అతనిని చూసేవారు పరమభక్తులు, కీర్తించగా... పరవశించే వారిక నాలా దాసులు.
ఆజానుబాహుడు, అపురూప సఖుడు... సఖి సీతకే కాదు పడుచులందరికి ఆదర్శ పురుషుడు. పరమాత్ముడని, పొగిడిన పలువురు. కాదు, పవిత్రుడు మాత్రమేనని పలికిన కొందరు, అందరి మధ్య అతని కథనం ఆకర్షణీయం. కథ అయితే కలలా... కరిగిపోయేది. నిజమైనది నీరజాక్షునికి కోవెలైనది.
సుందర పురుషుని సున్నిత వైనం,
కలువల కన్నుల కాంతి వీక్షణం,
మందార పెదవుల మందహాసం,
చందన దేహపు చెంచల గమనం,
వసీకరుని వన్నెల బాణం,
రక్కసి మూఖతో... అనుదినం,
రాముడు ఆడిన ఆటే...
ఈ... రామాయణం.
అసలున్నాడో... లేడో...అనే అయోమయం కాదిది, రాముడంతడి వాడు పుడమిలో నున్నాడా... అనే సంశయం మాత్రమే. సకల లోకములను ఏలేవాడు, సౌందర్య శీలుడు... అసలు ఈ పుడమి మీద ఎందుకున్నాడు? అన్ని అవమానాలు ఎందుకు మోసాడు? ఆడది కదా! సీత, ఎందుకు అనుమానించాడు? నలుగురిలో ఎందుకు అవమానించాడు? రాముని తత్వం, ప్రేమ తత్వం అయితే... లోకమంతా ప్రేమ పంచిన ఆదిపురుషుడు, సీతనెందుకు నిందించాడు? ఏమో వాల్మీకి కే... తెలియాలి, సీత పడ్డ ఆవేదన... రామునిపై ఆమె ఆరాధన.
ఏది ఏమైనా... పుడమి పైన పుణ్య పురుషులు పదివేలు. పురుషోత్తముడు మాత్రం తానొక్కడే. ఎన్ని జన్మల పుణ్యంకట్టుకుందో... ఆ సీతమ్మ, అతనికి ఆలి అయినది, లోకమునకు తల్లి అయినది. నిందలు మోసినా సరే... నిప్పులా మెరిసిన సీతమ్మ, మా మగువలందరికీ అమ్మ.
Thank you 🙏🏻
Bhagyamati ✍️
❤️❤️❤️👌👌👌🤝🤝🤝
రిప్లయితొలగించండిThank you
తొలగించండిచాలా అద్భుతంగా వర్ణిస్తారు అండి మీరు. Superb 💐
రిప్లయితొలగించండిThank you
తొలగించండిMi samayaspurthi ki joharlu
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.
తొలగించండిThank you
తొలగించండి