నేనేసే బొమ్మల్లో...
రాసే కవితల్లో...
నుదిటిపై గీతల్లో...
ఎవరివి నువ్వు? నా ఎదురైనావు !
నా గజి బిజి రాతల్లో...
జిగి బిగి పలుకుల్లో...
ఇరుక్కు పోయి, కదల లేక!
ఒరిగి పోయి, గుండె మీద!
అసలెవరివి నువ్వు? నా ఎదురైనావు!
అక్షరాల తొక్కిసలాటలో...
అర్థ మెరుగని పదముల మధ్య,
చిక్కు ముడులు విడువలేక,
హత్తుకుని కాగితాన్ని,
కదలకున్నావు ఎవరు నువ్వు?
ఎవరో... ఎదుటనున్న వాడివని
వెదకబోతు ఉంటే...
పైట పట్టి లాగావు!
వెనుక మల్లే లోగా...
చెంప గిల్లి పోయేవు?
అసలెవరివి నువ్వు? నా ఎదురైనావు!
మేలుకొల్పుల మధ్య,
కలల మేఘమై!
మేలి తెర పైవిసిరి
అటు ఇటు కదిలేవు!
పట్టబోతే ... చిక్కకుండా...
పాదరసమై జారేవు.
అసలెవరివి నువ్వు?
నా యెద లోతుల్లో ...
వీణవై మ్రోగేవు.
గానమై పాడేవు.
పిలవబోతే కలలో...
కనుమరుగైనావు.
ఎదురుపడితే చెలిమై...
చనువైనావు.
చెలికాడినని, చేయి కలిపి
మనువాడి మగడి వయ్యావు.
ఎవరైతే నేమి నువ్వు
నా ఈడుజోడు వయ్యావు.
తోడు నీడ వయ్యవు.
Thank you ☺️
✍️ Bhagyamati.
👍🙂
రిప్లయితొలగించండిThank you
తొలగించండి