రఘురాముని కై ఎదురు చూసిన సీతలా...
యమునా తీరాన వ్యథలు పడ్డ రాధలా...
కనుచూపు మేర నీ రూపు కోసం...
పడ్డ తపనల పరితపనలు,
ఆనాడు నేనెదురు చూసిన రోజులు.
నిదుర రాని గత రాతిరి చమటలు,
నీ చూపుకై మూతబడని రెప్పలు,
అద్దంలో చూస్తూ... అడిగిన ప్రశ్నలు,
గదిలో లెక్కెట్టిన గడియల నిడివిలు,
నీ పిలుపు వినగానే వేసిన గంతులు...
మరల మరల మారిన దుస్తులు,
గడప బయట ముస్తాబైన కొత్త జోళ్ళు.
నడిమి సూర్యుడి వేడిమి చూపులు,
ప్రేమికులకవి వెన్నెల వడగాల్పులు.
నిన్ను కలిసిన తొలిరోజు మధ్యాహ్నం.
గురుతుందా... నీకారోజు?
గుండెలోతులో గుబాలించిన ప్రేమ పూవులు,
గువ్వలమై చెట్టుకింద చెప్పుకున్న కబురులు,
గాలి కూడ గర్వంగా తాకి వెళ్ళిన రాత్రులు.
నిను నను మోసిన పల్సర్ బైకు,
కనులను గీటిన హైటెక్సిటీ లైట్లు.
నా నోటికి కళ్లెం, ఆ కొండాపూర్ పార్కు,
వీడ్కోలు చెప్పుకునే ప్రగతినగర్ స్టాపు.
ఆదివారం హాస్టల్ బయట పడిగాపులు,
విశ్వనాథ్ తియేటర్లో సినిమాలు,
భాగ్యనగరం చేసుకున్న భాగ్యమే అది!
మన ప్రేమ కథకు పుస్తకమైనది.
చెప్పి చెప్పి నీ తీపి కబుర్లు,
స్నేహితురాళ్ళ చెవులు తూట్లు.
విని విని మన ప్రేమ ముచ్చట్లు...
ప్రియుడులేని అమ్మాయిల పాట్లు...
ఏ కలం పట్టినా నీ కథల వర్షం,
మది నిండా నీ మాటల సంద్రం,
గాలి తాకి వెళ్ళినా గందరగోళం,
నీ ప్రేమదే... ఈ పాటి పుణ్యం.
చోటివ్వవేమి? నాకయినా కొంత,
ఇరుకయ్యింది గుండె నీకే...అంత.
ప్రతి జన్మ ఇస్తావా నాకు,
నా పేరు వెనక నీ పేరు కోసం,
నీ దారి వెంట నా పరుగు కోసం.
నీ పేరొక మంత్రం...
జపిస్తూనే ఉంటాను.
నీ ప్రేమొక తంత్రం...
మనసు బిగిస్తూనే ఉంటాను.
Thank you😍
✍️ Bhagyamati.
Wonderful Bhagi 👏👏👏👏
రిప్లయితొలగించండిThank you
తొలగించండిఇద్దరి పరిచయమెలానో తెలపలేదు..?
రిప్లయితొలగించండిఇంకో blog రాస్తాను. Thank you,
తొలగించండి👌mdm
రిప్లయితొలగించండిThank you
తొలగించండిThank you
తొలగించండిఅందమైన భావ వ్యక్తీకరణ....సున్నితం గా మనసు నీ హత్తుకునే లా రాశారు అభినందనలు
రిప్లయితొలగించండిThank you
తొలగించండి