ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

మరుజన్మకూ... నీ చెలియనే మరి!

ఆశల ఆకాశం అంతెత్తులో ఉంది. అక్షరాలు మబ్బులలో తేలి పోతూ... ఉన్నాయి. కోరికల చెట్టుకి కొత్త పూలు పూశాయి. కోసి మాల కడదామంటే...  తనివి తీరా వేద్దామంటే... తరచి తరచి చూద్దామంటే... అసలతను ఏడి? రాణి గుండెకు రాజైన వాడు రానే వస్తాడు,  రాగ బందపు ప్రేమ గంధము తేనెతెస్తాడు. 



అందమైన చెలికాడు అక్కడెక్కడో ఉన్నాడు. ఆకాశం శూన్యమై నల్ల ముఖం వేసింది. అందరానివాడి కోసం  హృదయమరువు చాచింది. అసలెందుకే మనసా? అలసిపోవే కాసేపు. అతని హృదయ మెందుకు నీకు? నీ హృదయముంది చాలదా... తుది వరకు.


జారిపోకే పిచ్చి మనసా! జారు తున్నావని తెలుసు కనుక. లేత ప్రాయము కాదిది, మరల దొరకదు పోయినది. తొంగి చూడకు గుండెలోకి, తొలకరి జల్లు కురువదు. తొణికిసలాడే మనసుకు తొందరెందుకు ప్రతి మాటకు? ఆగి పలికే మాటలకు అర్థముంటుంది, ఆగకుండా పరిగెడితే ప్రేమ వ్యర్ధమవుతుంది. అన్ని తెలిసిన వేళ ఈ అలజడి ఎందుకు? అవతలి వానికి లేని ప్రేమ నీకెందుకు? ఎదురు చూసిన మనసుకేం మిగిలింది? ఆకలి దప్పులు లేక క్రిందికొరిగింది.


ఇన్ని ప్రశ్నల మధ్య ఇతనెక్కడ? 

ఇక్కడెక్కడో ఉన్నావని,  ప్రేమ చినుకులన్ని ఒడిసి పట్టి, ఒడిన కట్టి, మనసు దారము మధ్య పెట్టి, పలుకులన్ని అల్లికలై... పలుకుతున్నా నీ చెలినై. సమయముందా... నా కొరకు, చెలిమినై ఉంటాను కడవరకు. తొలిప్రేమ లోనే కాదు, మలి ప్రేమ లోనూ... ఇలానే ఉంటాను, నీకు గులామునవుతాను. మళ్లీమళ్లీ నిన్నే ప్రేమిస్తుంటాను... మరణమొచ్చినా ఎదిరిస్తుంటాను. 


చల్లని అక్షరాల గొడుగు పడతాను. నీ తెల్లని గులాబీ కన్నులు నిదురించే వేళ... మెల్లగా జోల పాడుతాను. మళ్ళీ అమ్మనై నా ఒడిన నిద్దురోపుతాను. మరీమరీ అడుగుతున్నాను మరి.  మరు జన్మకీ మరల వస్తావా? నీ మగువగ నన్ను స్వీకరిస్తావా?!.


Thank you🙏🏻,

✍️ Bhagyamati.

కామెంట్‌లు

  1. డైలీ పొదలకూరు కి సచివాలయం డ్యూటీ కి వెళ్తూ..అటు ఆఫీస్ వర్క్ + ఇంట్లో పనులు చూసుకుంటూ.. ఒక రచయిత లా ఇలా రాస్తుంది నువ్వేనా.. లేక నీ పేరుతో మీ హస్బెండ్ రాస్తున్నారా..?

    రిప్లయితొలగించండి
  2. Just casual words.. don't be seriously..🙏

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఇది యుగాలనాటి ప్రేమ!.

 రాధంటే... ఉత్తదేహం కాదు, ఉత్త మనసే కాదు, రాధంటే ఆత్మ. కృష్ణుని ప్రేమలో లీనమైన ఆత్మ. ప్రపంచానికి అర్థం కాని ఎన్నో విషయాలలో వీరి ఇరువురి ప్రేమ కూడా ఒకటి. వీరి శృంగారం మానసికమే! కానీ ఆత్మసంబంధం. ఏ ప్రేమ కథకైనా వీరే ఆదర్శం. ప్రేమ యొక్క గొప్పతనం పట్టాలంటే... కథలో చిత్రించే పాత్రలను రాధాకృష్ణలను ఊహించే రాయాలి. కృష్ణుని పై ఆశలు రేకెత్తించుకొని మనసును కృంగ దీసుకున్న రాధ ప్రేమ లోంచి విరహం అనే పదం పుట్టుకొచ్చిందేమో?! ప్రేమంటే మనసంతా కాముఖత్వం పులుముకోవడం కాదు, దేహవసరాలను తీర్చుకోవడం కాదు, ప్రేమంటే విశాలత్వం, దైవత్వం, విరహం, తపన, వేదన, ఎడబాటు, త్యాగం, కృష్ణుని రూపు కోసం పరితపించే రాధ దినచర్య. అందుకే రాధాకృష్ణుల ప్రేమ ఉత్త ప్రబంధ కథగా కాకుండా... యుగాలు చెప్పుకునే గొప్ప ప్రేమగాధ గా మిగిలింది. ఒక ప్రేమ కథను పైకెత్తి ఆకాశంలో ప్రవేశపెట్టాలన్నా... ఒక ప్రేమ గీతాన్ని, స్వర్గాన్ని తాకేంత ఆనందంగా ఆలాపించాలన్నా... రాధాకృష్ణుల ప్రేమే ప్రేరణ. ఇంత గొప్పగా మనం ప్రేమించాలంటే రోజు మనసుకి మెదడుకి మధ్య దేవాసుర యుద్ధమే జరుగుతుంది, అయినా నిలబడితేనే ప్రేమ గెలుస్తుంది. ఇక్కడ గెలవడం అంటే ఇద్దరు పెళ్లి చేసుకొని జీవి...

నా మొదటి ప్రేమ... మా నాన్న!

  ఒక అమ్మాయి ఏ వయసులో అయినా ఉండొచ్చు కానీ ఆమె ఎప్పటికీ తన తండ్రికి చిన్ని యువరాణిగానే ఉంటుంది.  తండ్రీ కూతుళ్ల మధ్య ఉన్న ఈ ప్రత్యేక బంధం... ఆరాధ్య బంధం!.  ఒక తండ్రి తన కూతురిపై ఉంచే హద్దులు లేని ప్రేమ ఎప్పటికీ తిరిగి చెల్లించలేనిది.   బెస్ట్ ఫ్రండ్ తో షాపింగ్:  నేను రత్నం జూనియర్ కాలేజి లో చదివేటప్పుడు కాలేజి వ్యాన్, ఇల్లు తప్ప ఏం తెలియదు. డిగ్రీ కి వచ్చాక న బెస్ట్ ఫ్రెండ్ శ్వేత తో మొదటిసారి బయటకి వెళ్ళాను. ఫస్ట్ టైం వెళ్ళడం, నాన్నకి trunk road లో కనిపించాను. నా మైండ్ బ్లోక్ అయ్యి రెడ్ అయ్యి, బ్లూ అయ్యింది. మా నాన్న మాత్రం సింపుల్ గా షాపింగ్ కి వచ్చావా? డబ్బులు ఉన్నాయా? అంటూ 2000 ఇచ్చేసి వెళ్ళాడు. నాన్న అంటే అంతే మరి, నెక్స్ట్ లెవెల్.  నేను పెద్ద చిరంజీవి అభిమాని ని. నాన్న ఫస్ట్ డే ఫస్ట్ షో చిరంజీవి మూవీ కి తీసుకుని వెళ్తాడు. నేను తిరుపతి లో M.SC చేసేప్పుడు నాకోసం dairy milk బాక్స్లు కొరియర్ చేసేవాడు. చిరంజవి గ్రీటింగ్స్ పంపేవాడు. నాన్నకి నేను ఎప్పటికీ చిన్న పిల్లనే. నేను అబద్ధాలు చెప్పను. ఇప్పటికీ చెప్పను. అందుకే నన్ను మా అమ్మ, నాన్న బాగా నమ్ముతారు. నా ప్ర...

అతగాడి రూపేదని ??

 ఆ పేరు ఎవరు పెట్టారో.. కానీ, కళ్ళు మూసుకుంటే పగటిపూట సూర్యకిరణాలకు మెరిసే... పచ్చ పవిట కప్పుకున్న పైరులా... కనిపిస్తాడు. చల్లగాలి, ఏటి నీటిని తాకి తగిలినట్టు హాయిగా ఉంటాడు. నవ్వితే దాన్నిమ్మకాయ పగిలినట్టు నోటి నిండా ముత్యాల రవ్వలతో కనువిందు చేస్తాడు. మాట మాటను మంచు కప్పి చల్లగా చెబుతాడు. చెవిపై చెక్కిలిగింతలు పెడుతాడు. రూపమేమో తెలియదు నాకు?! అంతగా చూడలేదు. ఒక్కసారైనా కలవాలని కాలం తొందర పెడుతోంది. కళ్ళతో మాట్లాడుకోవాలని ఆశపడుతోంది. పరిచయమైనది కొంతకాలమైనా... ప్రేమలో అడిగిడి చాలా కాలమైనట్టుంది. ఈ మనసు గందరగోళంలో పడింది, ఆ సుందరవదనుని తలపులు తప్ప ఏ తిండి, నిద్ర వద్దంది. నక్షత్రాలను లెక్కబెడుతూ రాత్రంతా... ఎన్నో క్షణాలను భారంగా గడుపుతున్నాను. ఎప్పుడూ... మాటలు విని సంతోషపడడమే తప్ప, ఒక్కసారి కలుద్దామా? అని అడిగే ధైర్యము చనువు లేవు. కలిస్తే బాగుండు! ఆ కొన్ని గంటల్ని ఇంకొన్ని జ్ఞాపకాలుగా మలుచుకొని అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటాను. నేను అనే నా రెండక్షరాలను నీతో కలుపుకోనుగాని, నీలోని కొన్ని క్షణాలను నాలో కలుపుకుంటాను. వెన్నెల వెలుగుల్లో నిన్ను చూసి నాలోని చీకటిని తరిమేసుకుంటాను. నా గుండె నిండ...