ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

శ్రీవారి సేవలో తరియించిన భాగ్యము

ఇప్పుడే గుడి మెట్లు ఎక్కాను, భక్తులతో... అలయమంతా రద్దీగా ఉంది. సాక్షాత్తు శ్రీనివాసుని దర్శించాలని, శ్రీవారి సేవలో తరియించాలని వేయి కనులతో వేచిన అలివేలు మంగనయి అతని కోసం ఎదురు చూసాను. కోర్కెల చిట్టాలతో భక్తుల పాట్లు ఏలనో?. నెరవేర్చు వాడు నెరవేర్చక మానడుగా!. కర్మలను ఆయనే రాయును, కార్యములు ఆయనే చేయును. ఇంతలో ఈ తన్నులాట లెందుకు? తరియించక!


అనంత పద్మనాభుడయి ఆ శయన మందు పవళించినా... మానస లీలా చోరుడై మురళిని ధరియిన్చినా... శ్రీరామ చంద్రుడై సీతను వరియించినా... నీల మేఘ స్యాముడై యశోద ఒడి దెంచినా... ఆతను ప్రతి అవతారమందు పవిత్ర రూపుడేగా, పరమానంద భూషుడేగా. అతనిక ఆజానుబాహుడు, అరవింద నేత్రుడు. 


నాభి యెందు పద్మము కలిగినా... పద్మ మందు లక్ష్మిని కలిగినా... లక్ష్మి హృదయమందు మహా విష్ణువతడు. క్షీర మంత సంద్రములో స్నానమాడేటి పాల నురగల కనులవాడు. చేప పిల్లలకు ఈత నేర్పే చేతి వేళ్ళ వాడు. చంప మీద నునుపుటద్దపు చెక్కిలివాడు. చెక్కిలి యందు చంద్రవంకలా... చుక్క కలవాడు. చదరంగపు చతురతల చమత్కారి వీడు. అమ్మ పద్మావతిని, అలివేలు మంగను, అసలమాంతం ఏడు కొండలను పట్టిన వాడు. ఒట్టి చేతులతో... గట్టి హుండీలను పట్టినవాడు. పరమ నేర్పరి ఈ పంకజ నేత్రుడు.


కొండపై కూర్చొని భక్తుల కునుకు కాచెడి వాడు, పరమ పావనుడు. గోరంత భక్తికి లొమ్గేటి వాడు, గోవర్దనమును పైకెత్తిన వాడు. కాలిందిని సైతం మచ్చిక చేసి కాలి అడుగులు అద్దిన వాడు, కనక విబూషణుడు ఈ కమలాకరడు. భక్తి మాత్రమె చాలును ఏ బహుమతులడుగడు, బంగారు నవ్వుల వాడు. చిత్తరువై చూసే వేళ చిన్ని దయ జల్లెటివాడు. చిద్విలాసమతనికి ఈ చంచల లోకము.


అనుదినము అతని భక్తిలో తరియించగ సంపన్ను లెందరో... అయినా తాను, పేద జీవికి ముందుగా నొసగును. అన్న ప్రసాదములైనా స్వీకరించునో... లేదో...స్వామి? అడగకుండానే భక్తులకు అనంతములిచ్చును. ఆది విష్ణువు తాను! అమ్మ భూదేవికి, శ్రీదేవికి అంతయు తానైన వాడు. అష్టైస్వర్యాలతో...  అలంకరించుకునేటి వాడు.  అతనారాద్యుడు అందరికీ... అవ్యక్త బావ ప్రకటనలో... అనంత విశ్వమందు విహరించే... వినీల లోచనుడు.


అసలాతని కన్నుల వెలుగు...ఏ సరసు నీదే వెన్నెల సొగసో?!. అతని సౌందర్యమసలు భువికి ఏల దెంచనో? భువనమంతా... తిరిగినా ఆఖరికి ఆ ఏడుకొండలే దిక్కగును. నా చివరి శ్వాసకు నేనెంచుకున్న గమ్యమైనా... నా కడపటి జన్మకు ఇటులనే... నే పయణమయినా!


Thank you🙇🏻‍♀️

Bhagyamati ✍️.


కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

నా మొదటి ప్రేమ... మా నాన్న!

  ఒక అమ్మాయి ఏ వయసులో అయినా ఉండొచ్చు కానీ ఆమె ఎప్పటికీ తన తండ్రికి చిన్ని యువరాణిగానే ఉంటుంది.  తండ్రీ కూతుళ్ల మధ్య ఉన్న ఈ ప్రత్యేక బంధం... ఆరాధ్య బంధం!.  ఒక తండ్రి తన కూతురిపై ఉంచే హద్దులు లేని ప్రేమ ఎప్పటికీ తిరిగి చెల్లించలేనిది.   బెస్ట్ ఫ్రండ్ తో షాపింగ్:  నేను రత్నం జూనియర్ కాలేజి లో చదివేటప్పుడు కాలేజి వ్యాన్, ఇల్లు తప్ప ఏం తెలియదు. డిగ్రీ కి వచ్చాక న బెస్ట్ ఫ్రెండ్ శ్వేత తో మొదటిసారి బయటకి వెళ్ళాను. ఫస్ట్ టైం వెళ్ళడం, నాన్నకి trunk road లో కనిపించాను. నా మైండ్ బ్లోక్ అయ్యి రెడ్ అయ్యి, బ్లూ అయ్యింది. మా నాన్న మాత్రం సింపుల్ గా షాపింగ్ కి వచ్చావా? డబ్బులు ఉన్నాయా? అంటూ 2000 ఇచ్చేసి వెళ్ళాడు. నాన్న అంటే అంతే మరి, నెక్స్ట్ లెవెల్.  నేను పెద్ద చిరంజీవి అభిమాని ని. నాన్న ఫస్ట్ డే ఫస్ట్ షో చిరంజీవి మూవీ కి తీసుకుని వెళ్తాడు. నేను తిరుపతి లో M.SC చేసేప్పుడు నాకోసం dairy milk బాక్స్లు కొరియర్ చేసేవాడు. చిరంజవి గ్రీటింగ్స్ పంపేవాడు. నాన్నకి నేను ఎప్పటికీ చిన్న పిల్లనే. నేను అబద్ధాలు చెప్పను. ఇప్పటికీ చెప్పను. అందుకే నన్ను మా అమ్మ, నాన్న బాగా నమ్ముతారు. నా ప్ర...

ఇది యుగాలనాటి ప్రేమ!.

 రాధంటే... ఉత్తదేహం కాదు, ఉత్త మనసే కాదు, రాధంటే ఆత్మ. కృష్ణుని ప్రేమలో లీనమైన ఆత్మ. ప్రపంచానికి అర్థం కాని ఎన్నో విషయాలలో వీరి ఇరువురి ప్రేమ కూడా ఒకటి. వీరి శృంగారం మానసికమే! కానీ ఆత్మసంబంధం. ఏ ప్రేమ కథకైనా వీరే ఆదర్శం. ప్రేమ యొక్క గొప్పతనం పట్టాలంటే... కథలో చిత్రించే పాత్రలను రాధాకృష్ణలను ఊహించే రాయాలి. కృష్ణుని పై ఆశలు రేకెత్తించుకొని మనసును కృంగ దీసుకున్న రాధ ప్రేమ లోంచి విరహం అనే పదం పుట్టుకొచ్చిందేమో?! ప్రేమంటే మనసంతా కాముఖత్వం పులుముకోవడం కాదు, దేహవసరాలను తీర్చుకోవడం కాదు, ప్రేమంటే విశాలత్వం, దైవత్వం, విరహం, తపన, వేదన, ఎడబాటు, త్యాగం, కృష్ణుని రూపు కోసం పరితపించే రాధ దినచర్య. అందుకే రాధాకృష్ణుల ప్రేమ ఉత్త ప్రబంధ కథగా కాకుండా... యుగాలు చెప్పుకునే గొప్ప ప్రేమగాధ గా మిగిలింది. ఒక ప్రేమ కథను పైకెత్తి ఆకాశంలో ప్రవేశపెట్టాలన్నా... ఒక ప్రేమ గీతాన్ని, స్వర్గాన్ని తాకేంత ఆనందంగా ఆలాపించాలన్నా... రాధాకృష్ణుల ప్రేమే ప్రేరణ. ఇంత గొప్పగా మనం ప్రేమించాలంటే రోజు మనసుకి మెదడుకి మధ్య దేవాసుర యుద్ధమే జరుగుతుంది, అయినా నిలబడితేనే ప్రేమ గెలుస్తుంది. ఇక్కడ గెలవడం అంటే ఇద్దరు పెళ్లి చేసుకొని జీవి...

అతడొక హిమశిఖరం

 జీవితంలో ఒక గాఢమైన ఇష్టం కలిగినప్పుడు ఆ ఇష్టం కలిగించే తన్వయత్వమే ప్రేమ. దాని ముందు ప్రపంచంలో మరేది ఎక్కువ కాదు. ఇప్పుడు మనసు దృష్టి ఇంకా విశాలమవుతుంది. ఇంకా హాయిగా... గొప్పగా... అనిపిస్తుంది. కానీ అతను మాత్రమే కనిపిస్తుంటాడు. అతని అందం, గుణం ఆపై ప్రేమ కప్పిన మోహం. జీవితంలోని ప్రతి అడుగు, ప్రతి కదలిక అతని కోసం ఏదోక త్యాగం చేయమంటాయి. త్యాగం ప్రేమకు దర్పణం. ఒక శిల్పి తన ఉలితో చెక్కినట్టు... అందమైన ముఖం, చక్కటి కనుబొమ్మలు, కళ్ళలో నెమలి కనుల మెరుపు, తీయటి గొంతు, మాటలలో ఒక సన్నని సంగీతం. సంభాషణలో మృదుత్వం, బింకం కొంచెం కొంచెంగా తొనికిసలాడుతుంటాయి. మనసులోకి తొంగి చూసే అతని ఆలోచన తీరు, ఇంకొంచెం అతని వైపు లాగుతుంటాయి. అప్పుడప్పుడు మాటలకు దొరకక ఎక్కడో వెళ్లి దాక్కుంటాడు. ఈ చిన్ని పావురం నీకోసం ఎన్ని ప్రేమ లేఖలు రాసిందో తెలుసా? అని అడగగానే, పెదవులపై విరబూసే చిరునవ్వే సమాధానం అంటాడు. ఆవేళ అతని కనులలో మెరుపేదో కదలాడుతుంది, అది మనసుకు మాత్రమే కనబడుతుంది. ఆ నవ్వు విని సిగ్గుపడి ముఖం ఎర్రబారిపోతుంది. ఎంతో ఎడబాటు నుంచి మనసును తేలిక పరిచే సంగీతం ఆ నవ్వు. ముఖాన్ని అరచేతుల్లో దాచుకొని అద్దానికి చూపె...