మనం చూసే ప్రతిదానిలోనూ అందం ఉంటుంది, కానీ అందరూ దానిని చూడలేరు.
అందమంటే ఏమిటో కాదు...
కనులకు ఇంపైనది,
మనసుకు సొంపైనది.
మళ్లీ మళ్లీ చూడాలనిపించేది.
మనసు మరువలేక, మదనపడేది.
నా పదహారేళ్ల వయసులో నేను వర్షం గురించి రాసిన మొదటి కవిత...
మబ్బు యదను, మెరుపు కొరికి,
వానచినుకు వలస పంపె,
చిటుకు పటుకు చిన్ని చినుకు,
ఆకు చివర పాక వేసే!
దప్పికతో పైకి చూసే... పసి మొగ్గల గొంతు తడిపే.
మొగ్గ ఒక్క రెక్క తెరచి,
ముసిరి ముసిరి నవ్వుచుండ,
పరిమళాల కబురు విన్న ప్రియుడు వచ్చే పరుగుపరుగన,
వడిన దాచిన వయసునెళ్ళ తాగివెల్లే ఒక్క గుటకన.
ప్రకృతిలోని అందం:
కవులు ఎప్పుడు ప్రకృతిలోని అందం, స్త్రీ లోని అందం అని మళ్లీ మళ్లీ తిప్పి చెబుతూనే ఉంటాం. అందమంటే మా కథ వస్తువులు ప్రకృతి, స్త్రీ నే. ప్రకృతిలో ఉన్న కొండలు, లోయలు... వాగులు, వంకలు... సెలయేళ్లు, జలపాతాలు... అన్ని ఆమె లో ఉన్నాయి. అందుకే మాకు అందమంటే ప్రకృతి మరియు స్త్రీ.
వర్షం పడ్డప్పుడు మట్టి వాసన, సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు మెరిసే గాజు కిటికీలు, ఆకు చివర మెరిసే మంచు బిందువులు, కమ్ముకున్న ఆకాశంలో మనోహరమైన మబ్బులు, చల్లని గాలి చర్మాన్ని తాకినప్పుడు కలిగే హాయి... ఇవన్నీ ప్రకృతిలోని వాస్తవికమైన అందాలు.
స్త్రీ లోనే అందం:
స్త్రీ యొక్క అందం ఫేషియల్ మోడ్‌లో ఉండదు, ఆమె నిజమైన అందం ఆత్మలో ఉంటుంది. అది ముఖంపై ప్రతిబింబిస్తుంది. ఆమె చూపించే ప్రేమ, శ్రద్ధ ఆమెను ఇంకా అందంగా చూపుతుంది. గడిచేకొద్దీ గతించేది జ్ఞాపకాలే తప్ప స్త్రీ అందం కాదు.
ఉదాహరణకు మన అమ్మ. మన చిన్నప్పుడు ఆమెను, ఆమె 20లో చూసాము. ఇప్పుడు ఆమెను, ఆమె అరవై లో చూస్తున్నాము. అప్పటికీ ఇప్పటికీ ఆమె అందం ఇంకా పెరిగింది. ఎందుకంటే చూసే కొద్ది ఆమె పట్ల మన ప్రేమ ఇంకా పెరిగింది కాబట్టి.
కవి కలం లోని అందం:
కవి కలం, కాగితంపై కౌగిలించుకునే ప్రతి చోటా... ఓ అందమైన కావ్యం పుడుతుంది. కవి కన్నులు పడ్డ ప్రకృతి, ఇంకొంచెం అందం ఇనుమడింప చేసుకుంటుంది. వ్యధలు, రొదలు రాసే కవులు లేకపోలేదు, సుధలు మధువులు రాసే కవులే ఎక్కువ. ఎందుకంటే ప్రీతి అయినది రీతి కాబట్టి, రీతి అయినది అందం కాబట్టి.
కవి కల్పనలో అందముంటుంది, కథనంలో అందముంటుంది, ట్యూన్ కట్టి చెప్పడంలోనూ అందముంటుంది.
చిత్రకారుని కుంచె లోని అందం:
చిత్రకారుని కుంచె మెత్తనిది, వొంపైనది. అన్ని రంగులలో తడిచి అందాన్ని మలిచేది. ఇంద్రధనస్సు కంటే ఎక్కువ రంగులు చిత్రకారుని మనసుకి కలవు. నలుపు, తెలుపు, చామన చాయ మనుషులు ఉంటారు అనుకోకండి. ఒక కుంచె పది రంగులు అద్ది అందమైన ఛాయను చూపుతుంది. చిత్రకారుడు వెలుగులు, నీడలు, మొదలు, చివర అన్ని ఒకే బొమ్మలో చూపుతాడు. రూపం యొక్క అందం, ఒక ఆలోచన యొక్క అందం కలిపితే అందమైన చిత్రం వస్తుంది.
ఇది మనకు చిత్రాల పట్ల ఉన్న సహజమైన ప్రేమను సంతృప్తిపరుస్తుంది. చిత్రకారుని ఆలోచనలను మనకు పరిచయం చేస్తుంది. ఇది ఇంద్రియాలకు, హృదయానికి మరియు ఆలోచనలకు ఏకకాలంలో ఆనందాన్ని ఇస్తుంది.
నేను చిన్నప్పటి నుండి లైవ్ డ్రాయింగ్, పెయింటింగ్స్ వేస్తాను. అందుకే ఇలా ఆవేశంగా చెప్పేస్తున్నాను.
సౌందర్య సాధనాలు:
సౌందర్య సాధనాలు అంటే ఫెయిర్ అండ్ లవ్లీలు, ఫాన్స్ వైట్ బ్యూటీ లు కాదు. ఎదుటి వారి గుండెను కత్తిలా కసుక్కున కోసే మీ చిరునవ్వు. అద్దం లో ముఖం చూసుకున్నప్పుడు కనిపించే ఆ చిరునవ్వు, అన్నిటికంటే అందమైనది.
ఎందుకంటే అందానికి ఆనందం వంటి సౌందర్య సాధనం లేదు. ఇది మన చిరకాల నేస్తం. చిన్నప్పటినుంచి రోజు మొదటి సారి చూసే మొదటి అందం.
అందమైనదాన్ని చూసే అవకాశాన్ని ఎప్పుడూ కోల్పోకండి, ఎందుకంటే అందం అనేది దేవుని చేతివ్రాత. ఆకాశంలో చుక్కలను చూడకండి, ప్రకాశవంతమైన నక్షత్రాలను చూడండి.
నమస్కారం🙏
🔗 భారతీయ సౌందర్యం - beautiful India
✍️ Bhagyamati.
Ohh so your so talented from a young age mam ,
రిప్లయితొలగించండిwow so nice mam
Thank you
తొలగించండిఅందాన్ని కవి కళ్ళతో మరింత అందంగా చూపించారు.. ధన్యవాదాలు...
రిప్లయితొలగించండిThank u dear
తొలగించండిHa... Sister.. I remember your art at our door...
రిప్లయితొలగించండిReborn version of you..
Be happy artist..
Thanks Rajani. Love you sis. Yaah bhagi is back
తొలగించండి